<font face="mangal" size="3">కర్నాలా నగరి సహకారి బ్యాంక్ లి., పన్వెల్, (మహార - ఆర్బిఐ - Reserve Bank of India
కర్నాలా నగరి సహకారి బ్యాంక్ లి., పన్వెల్, (మహారాష్ట్ర) - బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 సెక్షన్ 35 A (సెక్షన్ 56 తో కలిపి) క్రింద ఆదేశాల జారీ – గడువు పొడిగింపు
తేది: 15/06/2021 కర్నాలా నగరి సహకారి బ్యాంక్ లి., పన్వెల్, (మహారాష్ట్ర) - రిజర్వ్ బ్యాంక్, వారి ఉత్తరువులు DoS.CO.UCBs-West/D-1/12.07.157/2019-20, తేదీ జూన్ 15, 2020 ద్వారా కర్నాలా నగరి సహకారి బ్యాంక్ లి., పన్వెల్, రాయగఢ్, (మహారాష్ట్ర) కు, జూన్ 15, 2020 పని ముగింపువేళనుండి ఆరు నెలల కాలానికి కొన్ని నిర్దేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల అమలుకాలం, డిసెంబర్ 14, 2020 తేదీన జారీచేసిన DOR.AID/D43/12.22.365/2020-21 ఆదేశాలద్వారా, జూన్ 15, 2021 వరకు పొడిగించబడినది. 2. బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం 1949, సెక్షన్ 35A (సెక్షన్ 56 తో కలిపి), సబ్-సెక్షన్ (1) క్రింద తమకు దఖలు పరచిన అధికారాలతో, పైన తెలిపిన ఆదేశాలు, జూన్ 15, 2021 తేదీ, జారీచేసిన DOR.AID/D-16/12.22.365/2021-22 ద్వారా ఆగస్ట్ 15, 2021 వరకు, సమీక్షకులోబడి, అమలులో ఉంటాయని ఇందుమూలముగా ప్రజలకు తెలియపరచడమైనది. 3. పైన పేర్కొన్న నిర్దేశాల్లోని అన్ని ఇతర నియమ నిబంధనలు యథాతథంగా ఉంటాయి. జూన్ 15, 2021 తేదీన అమలుకాలం పొడిగిస్తూ జారీ చేసిన ఆదేశాల ప్రతి, కర్నాలా నగరి సహకారి బ్యాంక్ లి., పన్వెల్, రాయగఢ్, (మహారాష్ట్ర), ప్రాంగణంలో ప్రజల సమాచారం కోసం, ప్రదర్శింపబడినది. 4. పైన తెలిపిన పొడిగింపు మరియు /లేదా మార్పులు చేసినంతమాత్రాన, బ్యాంకుయొక్క ఆర్థిక స్థితి మెరుగుపడినట్లు రిజర్వ్ బ్యాంక్ భావించిందని అనుకోరాదు. (యోగేశ్ దయాల్) పత్రికా ప్రకటన: 2021-2022/368 |