RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S3

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78515412

బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 సెక్షన్ 35ఎ తో పాటు సెక్షన్ 56 క్రింద నిర్దేశాలు – మపుసా అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ అఫ్ గోవా లిమిటెడ్ – నిర్దేశాల అవధి పొడిగింపు

నవంబర్ 18, 2019

బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 సెక్షన్ 35ఎ తో పాటు సెక్షన్ 56 క్రింద నిర్దేశాలు – మపుసా
అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ అఫ్ గోవా లిమిటెడ్ – నిర్దేశాల అవధి పొడిగింపు

బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 సెక్షన్ 35ఎ తో పాటు సెక్షన్ 56 క్రింద భారతీయ రిజర్వు బ్యాంకు ది మపుసా అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ అఫ్ గోవా లిమిటెడ్ కు జులై 24, 2015 తారీఖు డైరెక్టివ్.డిసిబియస్.సిఓ. బియస్డి-1.నం.డి-06/12.22.156/2015-16 ద్వారా నిర్దేశాలు జారీచేసింది, ఇవి ఎప్పటికప్పుడు సవరణ పొందుతూ, క్రితంసారి ఆగష్టు 13, 2019 తారీఖు డైరెక్టివ్ డిసిబిఆర్.సిఓ.ఏఐడి/డి-08/12.22.156/2019-20 ద్వారా నవంబర్ 18, 2019 తారీఖు వరకు పొడిగింపబడ్డాయి.

ప్రజా శ్రేయస్సు దృష్ట్యా, ది మపుసా అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ అఫ్ గోవా లిమిటెడ్ కు జారీ చేయబడి ఎప్పటికప్పుడు సవరణపొందుతున్న జులై 24, 2015 తారీఖు నిర్దేశం డిసిబియస్.సిఓ. బియస్డి-I.నం.డి-06/12.22.156/2015-16 కాలవ్యవధిని మరో మూడు మాసాల పాటు పొడిగించడం అవసరమని భారతీయ రిజర్వు బ్యాంకు గుర్తించింది.

తదనుగుణంగా, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 సెక్షన్ 35ఎ(1) తో పాటు సెక్షన్ 56 ప్రకారం తమకు సంక్రమించిన అధికారాలతో భారతీయ రిజర్వు బ్యాంకు ఇందుమూలంగా నిర్దేశిస్తున్నది – మపుసా అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ అఫ్ గోవా లిమిటెడ్ కు జులై 24, 2015 తారీఖున జారీచేయబడిన డైరెక్టివ్ డిసిబియస్.సిఓ.బియస్డి-I.నం. డి-6/ 12.22.156/2015-16 చెల్లుబాటు వర్తింపు, ఎప్పటికప్పుడు సవరించబడి ఇతఃపూర్వం నవంబర్ 18, 2019 వరకు పొడిగింపబడి మరో మూడు మాసాలబాటు నవంబర్ 19, 2019 నుండి ఫిబ్రవరి 18, 2020 తారీఖు వరకు సమీక్షకు లోబడి, ఆ బ్యాంక్ కు కొనసాగుతుంది.

ఎప్పటికప్పుడు సవరణ పొందుతున్న పై సూచించబడిన డైరెక్టివ్ లోని అన్ని ఇతర నిబంధనలు మరియు షరతులలో ఎటువంటిమార్పు లేదు.

(యోగేష్ దయాళ్)
చీఫ్ జనరల్ మేనేజర్

పత్రికా ప్రకటన: 2019-2020/1211

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?