RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S2

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78528872

ది మరాఠా సహకారి బ్యాంక్ లిమిటెడ్, ముంబై - బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949, సెక్షన్ 56 తో కలిపి సెక్షన్ 35 A క్రింద నిర్దేశాలు - కాలపరిమితి పొడిగింపు

తేది: 30/11/2021

ది మరాఠా సహకారి బ్యాంక్ లిమిటెడ్, ముంబై -
బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949, సెక్షన్ 56 తో కలిపి
సెక్షన్ 35 A క్రింద నిర్దేశాలు - కాలపరిమితి పొడిగింపు

భారతీయ రిజర్వు బ్యాంకు, ఆగష్టు 31, 2016 నాటి ఆదేశం DCBS.CO.BSD-I.No.D-4/12.22.141/2016-17 ప్రకారం ది మరాఠా సహకారి బ్యాంక్ లిమిటెడ్, ముంబై, ఆగష్టు 31, 2016 పనివేళలు ముగింపు నుండి నిర్దేశాల క్రింద ఉంచబడింది. అట్టి నిర్దేశాల కాలపరిమితిని సమయానుసారంగా పొడిగిస్తూ, చివరిగా నవంబర్ 30, 2021 వరకు చెల్లుబాటు ఐయ్యేలా పొడిగించడమైనది.

2. బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 లోని సెక్షన్ 56 తో కలిపి, సబ్ సెక్షన్ (1), సెక్షన్ 35A క్రింద భారతీయ రిజర్వు బ్యాంకుకు ఇచ్చిన అధికారాలను వినియోగించుకొని, సమీక్షకు లోబడి పొడిగింపబడిన అట్టి నిర్దేశాలు, నవంబర్ 29, 2021 నాటి DOR.MON/D-49/12.22.140/2021-22 ఆదేశానుసారం, సమీక్షకు లోబడి, ఫిబ్రవరి 28, 2022 వరకు బ్యాంక్‌కి వర్తిస్తాయని ప్రజలకు తెలియజేయడమైనది.

3. పై నిర్దేశాల ఇతర నియమ నిబంధనలలో ఎట్టి మార్పులు వుండవు. నిర్దేశాల పొడిగింపును తెలిపే నవంబర్ 29, 2021 నాటి ఆదేశం యొక్క ప్రతి, ప్రజా వీక్షణార్ధం బ్యాంక్ ప్రాంగణంలో ప్రదర్శించబడినది.

4. భారతీయ రిజర్వు బ్యాంకు ద్వారా పొడిగింపబడిన/మార్పుచేయబడిన ఫై నిర్దేశాలను, బ్యాంక్ యొక్క ఆర్ధిక స్థితిలో మెరుగుదలగా భారతీయ రిజర్వు బ్యాంకు సంతృప్తి పడినట్లుగా అన్వయించుకోరాదు.

(యోగేష్ దయాళ్) 
చీఫ్ జనరల్ మేనేజర్

పత్రికా ప్రకటన: 2021-2022/1282

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?