RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S2

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78529817

సెక్షన్ 56 తో కలిపి సెక్షన్‌ 35 A, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949 క్రింద నిర్దేశాలు - రుపీ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., పుణే, మహారాష్ట్ర - కాలపరిమితి పొడిగింపు

తేదీ: డిసెంబర్ 01, 2021

సెక్షన్ 56 తో కలిపి సెక్షన్‌ 35 A, బ్యాంకింగ్ నియంత్రణ
చట్టం 1949 క్రింద నిర్దేశాలు - రుపీ కో-ఆపరేటివ్ బ్యాంక్
లి., పుణే, మహారాష్ట్ర - కాలపరిమితి పొడిగింపు

భారతీయ రిజర్వు బ్యాంకు, ఫిబ్రవరి 21, 2013 నాటి ఆదేశం UBD.CO.BSD-I/D-28/12.22.2018/2012-13 ద్వారా రుపీ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., పుణే, మహారాష్ట్ర ను, ఫిబ్రవరి 22, 2013 వ తేదీ పనివేళల ముగింపు నుండి నిర్దేశాల క్రింద ఉంచింది. ఆ నిర్దేశాల గడువు, తదుపరి అదేశాల ద్వారా ఎప్పటికప్పుడు పొడిగించబడుతూ, చివరిసారి నవంబర్ 30, 2021 వరకు పొడిగించబడింది.

బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 సెక్షన్ 56 తో కలిపి సెక్షన్ 35A (1) క్రింద ఇచ్చిన అధికారాలను వినియోగించుకొని ప్రజా ప్రయోజనాల దృష్ట్యా, పైన ఉటంకించిన నిర్దేశాలు ఫిబ్రవరి 28, 2022 తేదీ వరకు, నవంబర్ 29, 2021 నాటి తమ ఆదేశం DOR.MON/D-50/12.22.218/2021-22 ద్వారా సమీక్షకు లోబడి, అమలులో వుంటాయని భారతీయ రిజర్వు బ్యాంకు తెలియజేస్తున్నది.

పైన సూచించిన ఆదేశాల యొక్క ఇతర నిబంధనలు మరియు షరతులు మారవు. నిర్దేశాల కాల పరిమితి పొడిగింపును సూచించే నవంబర్ 29, 2021 తేదీ నాటి ఆదేశం యొక్క నకలు, బ్యాంక్ ప్రాంగణంలో ప్రజా వీక్షణార్ధం ప్రదర్శించబడినది.

పైన పేర్కొన్న నిర్దేశాల పొడిగింపు మరియు/లేదా సవరణలు బ్యాంక్ యొక్క ఆర్ధిక స్థితిలో గణనీయమైన మెరుగుదల పట్ల భారతీయ రిజర్వు బ్యాంకు సంతృప్తికరంగా ఉందని భావించరాదు.

(యోగేశ్ దయాల్) 
చీఫ్ జనరల్ మేనేజర్

పత్రికా ప్రకటన: 2021-2022/1288

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?