<font face="mangal" size="3">శివాజీ రావు భోంస్లే సహకారి బ్యాంకు లిమిటెడĺ - ఆర్బిఐ - Reserve Bank of India
శివాజీ రావు భోంస్లే సహకారి బ్యాంకు లిమిటెడ్, పూణే,మహారాష్ట్ర ఫై బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (సహకారసంఘాలకు వర్తించేది), సెక్షన్ 56 తో కలిపి సెక్షన్ 35A, క్రింద నిర్దేశాలు – కాలపరిమితి పొడిగింపు
తేది: మార్చి 04, 2021 శివాజీ రావు భోంస్లే సహకారి బ్యాంకు లిమిటెడ్, పూణే,మహారాష్ట్ర ఫై భారతీయ రిజర్వు బ్యాంకు మే 03, 2019 నాటి ఆదేశం DCBS.CO.BSD-I/D-14/12.22.254/2018-19 ద్వారా శివాజీ రావు భోంస్లే సహకారి బ్యాంకు లిమిటెడ్, పూణే, మహారాష్ట్ర ను మే 04, 2019 పని వేళల ముగింపు నుండి నిర్దేశాల క్రింద ఉంచింది. ఆ నిర్దేశాల గడువు, తదుపరి అదేశాల ద్వారా ఎప్పటికప్పుడు పొడిగించబడుతూ, చివరిసారి మార్చి 04, 2021 వరకు పొడిగింపబడినది. 2. బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (సహకార సంఘాలకు వర్తించేది) సెక్షన్ 56 తో కలిపి సెక్షన్ 35A (1) క్రింద ఇచ్చిన అధికారాలను వినియోగించుకొని ప్రజా ప్రయోజనాల దృష్ట్యా, పైన ఉటంకించిన ఆదేశాలు జూన్ 04, 2021 తేదీవరకు, మార్చి 04, 2021 తేదీ నాటి తమ ఆదేశం DOR.MON/D-61/12.22.254/2020-21 ద్వారా సమీక్షకు లోబడి, అమలులో వుంటాయని భారతీయ రిజర్వు బ్యాంకు తెలియజేస్తుంది. 3. పైన సూచించిన ఆదేశాల యొక్క ఇతర నిబంధనలు మరియు షరతులు మారవు. నిర్దేశాల కాల పరిమితి పొడిగింపును సూచించే మార్చి 04, 2021 తేదీ నాటి ఆదేశం యొక్క నకలు, బ్యాంకు ప్రాంగణంలో ప్రజా వీక్షణార్ధం ప్రదర్శించబడినది. 4. పైన పేర్కొన్న నిర్దేశాల పొడిగింపు మరియు/లేదా సవరణలు బ్యాంకు యొక్క ఆర్ధిక స్థితిలో గణనీయమైన మెరుగుదల పట్ల భారతీయ రిజర్వు బ్యాంకు సంతృప్తికరంగా ఉందని భావించరాదు. (యోగేష్ దయాళ్) పత్రికా ప్రకటన: 2020-2021/1199 |