<font face="mangal" size="3">శ్రీ ఆనంద్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ చిన - ఆర్బిఐ - Reserve Bank of India
శ్రీ ఆనంద్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ చిన్చువాడ్, పూణే - బ్యాంకింగ్ నియంత్రణ చట్టం,1949 సెక్షన్ 35 A (సెక్షన్ 56 తో కలిపి) క్రింద నిర్దేశాలు - గడువు పొడిగింపు
తేదీ: మార్చి 24, 2021 శ్రీ ఆనంద్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ చిన్చువాడ్, భారతీయ రిజర్వు బ్యాంకు, జూన్ 21, 2019 తేదీ నాటి ఆదేశం DCBS.CO.BSD-I/D-16/12.22.474/2018-19 ద్వారా శ్రీ ఆనంద్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ చిన్చువాడ్, పూణే ను జూన్ 25, 2019 పని ముగింపు వేళల నుండి ఆరు మాసాలపాటు నిర్దేశాల క్రింద ఉంచింది. ఆ నిర్దేశాల గడువు, తదుపరి అదేశాల ద్వారా ఎప్పటికప్పుడు పొడిగించబడుతూ చివరిసారి మార్చి 24, 2021 వరకు పొడిగించబడింది. 2. బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (సహకార సంఘాలకు వర్తించేది) సెక్షన్ 56 తో కలిపి సెక్షన్ 35A (1) క్రింద ఇచ్చిన అధికారాలను వినియోగించుకొని ప్రజా ప్రయోజనాల దృష్ట్యా, పైన ఉటంకించిన ఆదేశాలు జూన్ 24, 2021 తేదీ వరకు, మార్చి 23, 2021 తేదీ నాటి తమ ఆదేశం DOR.CO.AID.నం.D-65/12.22.474/2021-22 ద్వారా సమీక్షకు లోబడి, అమలులో వుంటాయని భారతీయ రిజర్వు బ్యాంకు తెలియజేస్తుంది. 3. పైన తెలిపిన నిర్దేశాలలోని ఇతర నియమ నిబంధనలలో ఎట్టి మార్పూ లేదు. కాలపరిమితి పెంచుతూ, మార్చి23, 2021 తేదీన జారీచేసిన ఆదేశాల ప్రతి, బ్యాంకు ఆవరణలో, ప్రజల సమాచారార్ధం ప్రదర్శించబడినది. 4. పైన తెలిపిన కాలపరిమితి పొడిగింపు మరియు / లేక మార్పులు చేసినంతమాత్రాన, బ్యాంకు యొక్క ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడిందని భారతీయ రిజర్వు బ్యాంకు సంతృప్తి చెందినట్లుగా, ఏ మాత్రమూ భావించరాదు. (యోగేశ్ దయాల్) పత్రికా ప్రకటన: 2020-2021/1292 |