RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Page
Official Website of Reserve Bank of India

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78525292

బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949, సెక్షన్ 56 తోకలిపి సెక్షన్ 35A క్రింద నిర్దేశాలు- ది కపోల్ సహకార బ్యాంకు లిమిటెడ్, ముంబై, మహారాష్ట్ర - కాలపరిమితి పొడిగింపు

తేది: ఏప్రిల్ 30, 2021

బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949, సెక్షన్ 56 తోకలిపి
సెక్షన్ 35A క్రింద నిర్దేశాలు-
ది కపోల్ సహకార బ్యాంకు లిమిటెడ్, ముంబై, మహారాష్ట్ర -
కాలపరిమితి పొడిగింపు

భారతీయ రిజర్వు బ్యాంకు మే 30, 2017 నాటి ఆదేశం DCBS.CO.BSD-I/D-9/12.22.111/2016-17 ద్వారా ది కపోల్ సహకార బ్యాంకు లిమిటెడ్, ముంబై, మహారాష్ట్ర ను మే 30, 2017 పని వేళల ముగింపు నుండి ఆరు మాసాలపాటు నిర్దేశాల క్రింద ఉంచింది. ఆ నిర్దేశాల గడువు, తదుపరి అదేశాల ద్వారా ఎప్పటికప్పుడు పొడిగించబడుతూ, చివరిసారి ఏప్రిల్ 30, 2021 వరకు పొడిగింపబడినది.

2. బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (సహకార సంఘాలకు వర్తించేది) సెక్షన్ 56 తో కలిపి సెక్షన్ 35A (1) క్రింద ఇచ్చిన అధికారాలను వినియోగించుకొని ప్రజా ప్రయోజనాల దృష్ట్యా, పైన ఉటంకించిన ఆదేశాలు అక్టోబర్ 31, 2021 తేదీవరకు, ఏప్రిల్ 29, 2021 తేదీ నాటి తమ ఆదేశం DOR.MON/D-7/12.22.111/2021-22 ద్వారా సమీక్షకు లోబడి, అమలులో వుంటాయని భారతీయ రిజర్వు బ్యాంకు తెలియజేస్తుంది.

3. పైన సూచించిన ఆదేశాల యొక్క ఇతర నిబంధనలు మరియు షరతులు మారవు. నిర్దేశాల కాల పరిమితి పొడిగింపును సూచించే ఏప్రిల్ 29, 2021 తేదీ నాటి ఆదేశం యొక్క నకలు, బ్యాంకు ప్రాంగణంలో ప్రజా వీక్షణార్ధం ప్రదర్శించబడినది.

4. పైన పేర్కొన్న నిర్దేశాల పొడిగింపు మరియు/లేదా సవరణలు బ్యాంకు యొక్క ఆర్ధిక స్థితిలో గణనీయమైన మెరుగుదల పట్ల భారతీయ రిజర్వు బ్యాంకు సంతృప్తికరంగా ఉందని భావించరాదు.

(యోగేష్ దయాళ్) 
చీఫ్ జనరల్ మేనేజర్

పత్రికా ప్రకటన: 2021-2022/146

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

మా యాప్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి QR కోడ్‌ను స్కాన్ చేయండి

RbiWasItHelpfulUtility

పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ:

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?