<font face="mangal" size="3px">బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949, సెక్షన్‌ 35 A (సెక్ష& - ఆర్బిఐ - Reserve Bank of India
బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949, సెక్షన్ 35 A (సెక్షన్ 56 తో కలిపి) - ది మపుసా అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ ఆఫ్ గోవా లి., గోవా - ఆదేశాల పొడిగింపు మరియు నగదు ఉపసంహరణ పరిమితి సడలింపు
తేదీ: 20/02/2019 బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949, సెక్షన్ 35 A (సెక్షన్ 56 తో కలిపి) - ది బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949, సెక్షన్ 35A (సెక్షన్ 56 తో కలిపి), క్రింద, రిజర్వ్ బ్యాంక్, ది మపుసా అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ ఆఫ్ గోవా, గోవాకు, జులై 24, 2015, తేదీన నిర్దేశాలు జారీచేసినది. ఈ నిర్దేశాలు ఎప్పటికప్పుడు మార్చబడుతూ, చివరి నిర్దేశం ఆగస్ట్ 13, 2018 ద్వారా, ఫిబ్రవరి 18, 2019 వరకు పొడిగించబడ్డాయి. ప్రస్తుతం అమలులోనున్న నిర్దేశాలను అనుసరించి, ఇతర నిబంధనలతోబాటు, ప్రతి సేవింగ్స్, కరెంట్, ఇతర డిపాజిట్ ఖాతాలనుండి (ఏపేరుతో పిలువబడ్డా) రూ. 1,000/- మించి విత్డ్రా చేయుటకు అనుమతించరాదు. అయితే, ఖాతాదారు బ్యాంకుకు ఏ విధంగానైన బాకీ ఉన్నట్లయితే (రుణగ్రహీతగా, స్యూరిటీగా, బ్యాంక్ డిపాజిట్లపై రుణాలతో సహా), ఈమొత్తం, మొదట అట్టి బాకీకి జమ చేయవలెను. రిజర్వ్ బ్యాంక్, బ్యాంకుయొక్క ఆర్థిక పరిస్థితి సమీక్షించి, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949, సెక్షన్ 35A, సబ్ సెక్షన్లు (1)(2), (సెక్షన్ 56 తో కలిపి) ద్వారా వారికి సంక్రమించిన అధికారాలతో, ప్రజా ప్రయోజనం కొరకు, పై నిర్దేశాలు, ఈ క్రింద తెలిపిన మేరకు మార్పు చేయడం అవసరమని భావించింది. రిజర్వ్ బ్యాంక్, వారి జులై 24, 2015 నిర్దేశాలో, ఈక్రింది మార్పులు చేసినది: ప్రతీ సేవింగ్స్ బ్యాంక్ లేదా కరెంట్ అకౌంట్ లేదా నిర్ణీతకాల లేదా ఏ ఇతర డిపాజిట్ అకౌంట్నుండి అయినా (ఏ పేరుతో పిలవబడినా), రూ. 50,000/- మించకుండా, ఉపసంహరించుటకు అనుమతించవచ్చు. కానీ, ఖాతాదారు బ్యాంకుకు ఏవిధంగానైనా బాకీ ఉంటే (రుణ గ్రహీతగా, స్యూరిటీగా, బ్యాంక్ డిపాజిట్లపై రుణాలతో సహా), ఈ సొమ్ము మొదట, అట్టి రుణ ఖాతాలకు జమ చేయవలెను. డిపాజిటర్లకు చెల్లించవలసిన సొమ్ము, వేరుగా ఒక ఎస్క్రో అకౌంట్లోగాని మరియు/లేక ప్రత్యేకంగా దీనికై కేటాయించిన సెక్యూరిటీలలోగాని ఉంచవలెను. ఈ మొత్తం, నిర్దేశాల అనుసారంగా కేవలం డిపాజిటర్లకు చెల్లించుటకు మాత్రమే వినియోగించవలెను. ఇంతేగాక, జలై 24, 2015 తేదీన ది మపుసా అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ ఆఫ్ గోవా లి., గోవాకు జారీచేయబడి, ఎప్పటికఫ్ఫుడు పొడిగించబడుతూవచ్చిన నిర్దేశాలు, ప్రజల క్షేమం దృష్ట్యా, మరొక ఆరు నెలల కాలం పొడిగించడం అవసరమని రిజర్వ్ బ్యాంక్ భావించింది. ఆ కారణంగా, రిజర్వ్ బ్యాంక్, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం1949, సబ్-సెక్షన్ 1, సెక్షన్ 35 A, (సెక్షన్ 56 తో కలిపి) తమకు దఖలుపరచిన అధికారాలతో, జులై 24, 2015 తేదీన ది మపుసా అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ ఆఫ్ గోవాకు, జారీచేయబడి, ఎప్పటికఫ్ఫుడు మార్పు చేయబడుతూవచ్చిన నిర్దేశాలు మరొక ఆరు నెలల కాలం, (అనగా ఫిబ్రవరి 19, 2019 నుండి ఆగస్ట్ 18, 2019 వరకు), సమీక్షకులోబడి, అమలులో ఉంటాయని, ఇందుమూలముగా ఆదేశించడమైనది. పైన తెలిపిన నిర్దేశాలలో ఎప్పటికప్పుడు మార్చబడుతూవచ్చిన, ఇతర నియమ నిబంధనలలో ఎట్టి మార్పూ లేదు. అజిత్ ప్రసాద్ పత్రికా ప్రకటన: 2018-2019/1979 |