RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S2

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78524356

ది మాపుసా నగర సహకార బ్యాంకు లిమిటెడ్, గోవా – బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం, 1949, సెక్షన్ 56 తో కలిపి సెక్షన్ 35A క్రింద నిర్దేశాలు – నిర్దేశాలలో మార్పులు

తేదీ: 02/07/2019

ది మాపుసా నగర సహకార బ్యాంకు లిమిటెడ్, గోవా – బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం,
1949, సెక్షన్ 56 తో కలిపి సెక్షన్ 35A క్రింద నిర్దేశాలు – నిర్దేశాలలో మార్పులు

బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం, 1949, సెక్షన్ 56 తో కలిపి సెక్షన్ 35A క్రింద జులై 24, 2015 నాటి భారతీయ రిజర్వు బ్యాంకు ఆదేశం ప్రకారం, ది మాపుసా నగర సహకార బ్యాంకు లిమిటెడ్, గోవా నిర్దేశాల క్రింద ఉంచబడింది. సమయానుసారంగా అట్టి నిర్దేశాలను తదుపరి ఆదేశాలతో భారతీయ రిజర్వు బ్యాంకు పొడిగిస్తూ వచ్చింది. ఈ క్రమంలో చివర ఇచ్చిన ఫిబ్రవరి 15, 2019 నాటి ఆదేశం ప్రకారం, అట్టి నిర్దేశాలు ఆగష్టు 18, 2019 వరకు పొడిగించబడ్డాయి.

2. బ్యాంకు యొక్క ఆర్ధిక స్థితిని సమీక్షించిన తరువాత, ప్రజా ప్రయోజనార్ధం పైన పేర్కొన్న నిర్దేశాలలో మార్పులు అవసరమని భారతీయ రిజర్వు బ్యాంకు భావించింది.

3. తదనుసారముగా, బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం, 1949, సెక్షన్ 56 తో కలిపి సెక్షన్ 35A (1) & (2) క్రింద ఉన్న అధికారాలను వినియోగించుకుని, ది మాపుసా నగర సహకార బ్యాంకు లిమిటెడ్, గోవా కు జారీ చేసిన జులై 24, 2015 నాటి నిర్దేశాలను పాక్షికంగా మార్పు చేసి క్రింద సూచించిన విధంగా పేరా 1 లో క్లాజ్ xi జత చేయాలని ఆదేశించడమైనది.

xi. "రుణగ్రహీతతో రుణ ఒప్పందం యొక్క నిబంధనలు మరియు షరతుల మేరకు నిర్దిష్ట డిపాజిట్ ఖాతాలోని మొత్తాన్ని (ఏ పేరుతో పిలిచినా), తన రుణాలు సర్దుబాటు చేయడానికి/కేటాయించడానికి బ్యాంకుకు అనుమతి ఉంది. రుణ ఖాతాలో బకాయిలు ఉన్నంత వరకు అటువంటి కేటాయింపు/సర్దుబాటు క్రింది అదనపు షరతులకు లోబడి చేయవచ్చు:

ఎ. సర్దుబాటు తేదీ నాటికి ఖాతాలు KYC కి అనుగుణంగా ఉండాలి.

బి. హామీదారు/పూచీదారులతో సహా, మూడవ పక్షం వారి డిపాజిట్లు కూడా సర్దుబాటు చేయడానికి అనుమతించబడవు.

సి. సాధారణంగా మరింత ఆలస్యం జరిగి రుణ ఖాతా, నిరర్థక ఖాతా (ఎన్‌పిఎ) అయ్యే సందర్భాల్లో, డిపాజిటర్‌కు తగిన నోటీసు క్రింద ఈ ఎంపికను అమలు చేయాలి. ప్రామాణిక రుణాలు (క్రమం తప్పకుండా రుణ ఖాతా నిర్వహించడం) మరియు రుణ ఒప్పందం యొక్క నియమ నిబంధనల నుండి మార్పుకు, డిపాజిటర్-రుణగ్రహీత యొక్క ముందస్తు వ్రాతపూర్వక అనుమతి అవసరం.

డి. డిపాజిట్ లేదా దాని సెట్ ఆఫ్, కోర్ట్ అటాచ్మెంట్ ఆదేశం/నిషేధిత ఉత్తర్వు లేదా చట్టబద్ధమైన అధికారం లేదా చట్టం ప్రకారం అధికారం పొందిన ఇతర అధికారం, ఎర్నెస్ట్ మనీ డిపాజిట్, ట్రస్ట్ కు చెందినది, మూడవ పార్టీ తాత్కాలిక హక్కు, రాష్ట్ర సహకార సంఘాల చట్టం మొదలైన నిబంధనలకు కట్టుబడి ఉండకూడదు”.

4. ఎప్పటికప్పుడు సవరించినట్లుగా, మాపుసా నగర సహకార బ్యాంకు లిమిటెడ్, గోవా కు జారీ చేసిన జూలై 24, 2015 నాటి ఆదేశం, సమీక్షకు లోబడి, పేరా 3 లో చేసిన మార్పుతో కొనసాగుతుంది.

5. నిర్దేశం లో ఉన్న అన్ని ఇతర నియమ నిబంధనలు మారవు.

యోగేష్ దయాళ్
చీఫ్ జనరల్ మేనేజర్

పత్రికా ప్రకటన: 2019-2020/22

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?