<font face="mangal" size="3">వర్తక పరపతుల (ట్రేడ్ క్రెడిట్స్) కోసం లెటర్స - ఆర్బిఐ - Reserve Bank of India
వర్తక పరపతుల (ట్రేడ్ క్రెడిట్స్) కోసం లెటర్స్ అఫ్ అండర్టేకింగ్ (LoUs) మరియు లెటర్స్ అఫ్ కంఫర్ట్ (LoCs) విరమణ
ఆర్బిఐ/2017-18/139 మార్చి 13, 2018 అన్ని అధీకృత డీలర్ కేటగిరీ – I బ్యాంకులు మేడం/సర్ వర్తక పరపతుల (ట్రేడ్ క్రెడిట్స్) కోసం లెటర్స్ అఫ్ అండర్టేకింగ్ (LoUs) మరియు లెటర్స్ అఫ్ కంఫర్ట్ (LoCs) విరమణ అధీకృత డీలర్ కేటగిరీ – I బ్యాంకులకు ఒసగిన అధికారాల క్రింద భారత దేశంలో దిగుమతుల కోసం లెటర్స్ ఆఫ్ అండర్టేకింగ్ (LoUs), లెటర్స్ అఫ్ కంఫర్ట్ (LoCs) మరియు హామీలు, నవంబరు 1, 2004 నాటి ఏ.పి (DIR సిరీస్) సర్క్యులర్ సంఖ్య 24, పేరా 2 మరియు జనవరి 1, 2016 నాటి మాస్టర్ డైరెక్షన్ సంఖ్య 5, పేరా 5.5, ఎప్పటికప్పుడు సవరించిన విధంగా, “బాహ్య వాణిజ్య రుణాలు (ఇసిబిలు), అధీకృత డీలర్లు, అధీకృత డీలర్లు కాని వ్యక్తులు ద్వారా వర్తక పరపతి (ట్రేడ్ క్రెడిట్), విదేశీ కరెన్సీలో రుణాలు ఇవ్వడం మరియు తీసుకోవడం” ఫై అధీకృత డీలర్ కేటగిరీ – I బ్యాంకుల దృష్టిని ఆకర్షించడమైనది. 2. ప్రామాణిక మార్గదర్శకాల సమీక్షాణాంతరం, అధీకృత డీలర్ కేటగిరీ – I బ్యాంకుల ద్వారా భారతదేశంలో దిగుమతుల కోసం వర్తక పరపతులు, లెటర్స్ ఆఫ్ అండర్టేకింగ్, లెటర్స్ అఫ్ కంఫర్ట్ జారీ చేయడాన్ని వెంటనే నిలిపివేయాలని నిర్ణయం తీసుకోబడింది. భారతదేశంలోకి దిగుమతుల కోసం లెటర్స్ ఆఫ్ క్రెడిట్స్, మరియు వర్తక పరపతుల కోసం బ్యాంక్ గ్యారంటీలు, "హామీలు మరియు సహ-ఒప్పందాల" పై ఎప్పటికప్పుడు సవరించిన, జూలై 1, 2015 నాటి బ్యాంకింగ్ నియంత్రణ విభాగం మాస్టర్ సర్క్యులర్ సంఖ్య DBR.BC.11/13.03.00/2015-16 లో ఉన్న నిబంధనలకు అనుగుణంగా జారీ చేయడాన్ని కొనసాగించవచ్చు. 3. అధీకృత డీలర్ కేటగిరీ – I బ్యాంకులు ఈ సర్క్యులర్ యొక్క సారాంశంను వారి విభాగాల మరియు వినియోగదారుల దృష్టికి తీసుకురావాలి. 4. ఈ మార్పులు ప్రతిబింబించడానికి జనవరి 01, 2016 నాటి మాస్టర్ డైరెక్షన్ సంఖ్య 5 నవీకరింపబడుతుంది. ఈ సర్కులర్ జారీ తేదీ నుండి మార్పులు అమలులోకి వస్తాయి. 5. ఈ సర్కులర్ లో ఉన్న ఆదేశాలు, విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం, 1999 (ఫారిన్ ఎక్స్చేంజి మానేజిమెంట్ ఆక్ట్) (42 ఆఫ్ 1999) యొక్క సెక్షన్ 10 (4) మరియు 11 (1) క్రింద, ఏ ఇతర చట్టాల క్రింద ఇచ్చిన అనుమతులు/ఆమోదాలకు విరుద్ధముగా కాకుండా, జారీ చేయబడ్డాయి. మీ విధేయులు అజయ్ కుమార్ మిశ్రా |