<font face="mangal" size="3px">ఇటావా నగర సహకార బ్యాంకు లిమిటెడ్, ఇటావా (ఉత్త - ఆర్బిఐ - Reserve Bank of India
ఇటావా నగర సహకార బ్యాంకు లిమిటెడ్, ఇటావా (ఉత్తర్ ప్రదేశ్) - జరిమానా విధించబడింది
మార్చ్ 06, 2019 ఇటావా నగర సహకార బ్యాంకు లిమిటెడ్, ఇటావా (ఉత్తర్ ప్రదేశ్) - జరిమానా విధించబడింది బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (సహకార సంఘాలకు వర్తించే విధంగా), సెక్షన్ 36 (1) క్రింద జారీ చేసిన కార్యకలాపాల ప్రాంతం, శాఖ ప్రామాణీకరణ విధానం, ఎక్స్టెన్షన్ కౌంటర్లు, ఎటిఎంలు తెరవడం/అప్గ్రేడ్ చేయడం మరియు కార్యాలయాల బదిలీ/విభజన/మూసివేత పై, భారతీయ రిజర్వు బ్యాంకు యొక్క పర్యవేక్షక సూచనలు ఉల్లంఘించినందుకు, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (సహకార సంఘాలకు వర్తించే విధంగా) సెక్షన్ 46(4) తో కలిపి, సెక్షన్ 47A(1)(c) లోని అధికారాలను వినియోగించుకొని, ఇటావా నగర సహకార బ్యాంకు లిమిటెడ్, ఇటావా (ఉత్తర్ ప్రదేశ్) ఫై, భారతీయ రిజర్వు బ్యాంకు ₹ 50,000/- (యాభై వేల రూపాయలు మాత్రమే) జరిమానా విధించింది. భారతీయ రిజర్వు బ్యాంకు జారీచేసిన షో-కాజ్ నోటీసుకు ప్రతిస్పందనగా బ్యాంక్ ఒక లిఖిత పూర్వక సమాధానాన్ని సమర్పించింది. కేసులోని వాస్తవాలను, బ్యాంక్ ప్రత్యుత్తరం మరియు వ్యక్తిగత విచారణ లోని అంశాలను పరిశీలించిన తరువాత, ఈ విషయంలో బ్యాంకు యొక్క ఉల్లంఘన వాస్తవమని మరియు జరీమానా విధించదగినదిగా భారతీయ రిజర్వు బ్యాంకు నిర్ధారణకు వచ్చింది. అజిత్ ప్రసాద్ పత్రికా ప్రకటన సంఖ్య : 2018-2019/2116 |