<font face="mangal" size="3px">డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ యొక్క విస్తరణ మ - ఆర్బిఐ - Reserve Bank of India
డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ యొక్క విస్తరణ మరియు బలోపేతం
ఆర్ బి ఐ/2019-20/79 అక్టోబర్ 7, 2019 అధ్యక్షుడు/కార్యనిర్వాహక సంచాలకుడు/ముఖ్య కార్యనిర్వహణ అధికారి మేడమ్/ప్రియమైన సర్, డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ యొక్క విస్తరణ మరియు బలోపేతం ఫై విషయం లో దయచేసి అక్టోబర్ 4, 2019 నాటి నాల్గవ ద్వైమాసిక ద్రవ్య విధాన ప్రకటన లోని పేరా 8 - అభివృద్ధి మరియు నియంత్రణ విధానాలు చూడండి. 2. డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను విస్తరించడానికి మరియు బలోపేతం చేయాలనే ఉద్దేశ్యంతో, అన్ని రాష్ట్ర/యుటి స్థాయి బ్యాంకర్ల కమిటీలు (ఎస్‌ఎల్‌బిసి/యుటిఎల్‌బిసి), బ్యాంకులు మరియు వాటాదారులతో సంప్రదించి పైలట్ ప్రాతిపదికన ఆయా రాష్ట్రాలు/యుటిలలో ఒక జిల్లాను గుర్తించాలని నిర్ణయించారు. గుర్తించబడిన జిల్లా ప్రాంతంలో ఎక్కువ విస్తరించివున్న బ్యాంకుకు, ఆ జిల్లా కేటాయించబడుతుంది. అట్టి బ్యాంకు ఒక సంవత్సరంలోపు జిల్లాలోని ప్రతి వ్యక్తి సురక్షితంగా, డిజిటల్‌గా సరసమైన మరియు అనుకూలమైన రసీదులు మరియు చెల్లింపులు పొందడానికి జిల్లాను 100% డిజిటల్‌గా చేయడానికి ప్రయత్నిస్తుంది. అటువంటి లావాదేవీలను నిర్వహించడానికి అవసరమైన మౌలిక సదుపాయాలు మరియు అక్షరాస్యతను అందించడం ఇందులో ఉంటుంది. 3. ఎస్‌ఎల్‌బిసిలు/యుటిఎల్‌బిసిలు భారత ప్రభుత్వం యొక్క ‘ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్’ కార్యక్రమంతో సాధ్యమైనంతవరకు గుర్తింపబడిన జిల్లాలు ఒకే చోట ఉండేలా కలపటానికి ప్రయత్నిస్తాయి. వీలైనంతవరకూ, పరస్పర సంప్రదింపులు మరియు స్వచ్ఛందంగా బ్యాంకు అంగీకరించడం ద్వారా గుర్తించిన జిల్లాను, బ్యాంకుకు కేటాయించడం చేయాలి. 4. ఇంకా, ఎస్‌ఎల్‌బిసి/యుటిఎల్‌బిసి కన్వీనర్ బ్యాంకులు త్రైమాసిక ప్రాతిపదికన ఈ విషయంలో సాధించిన పురోగతిని పర్యవేక్షించాలని మరియు భారతీయ రిజర్వు బ్యాంకు యొక్క సంబంధిత ప్రాంతీయ కార్యాలయాలు/ఉప కార్యాలయాలకు నివేదించాలని సూచించడమైనది. మీ విధేయులు, (గౌతమ్ ప్రసాద్ బోరా) |