RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S3

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78489721

స్పెసిఫైడ్ బ్యాంకు నోట్ల‌ చ‌ట్ట‌బ‌ద్ధ చ‌లామ‌ణి ల‌క్ష‌ణం ర‌ద్దు - న‌గ‌దు విత్ డ్రా మరియు డిపాజిట్ చేసే పంపిణీ కేంద్రాల‌ను విస్త‌రించ‌డం

RBI/2016-17/131
DCM (Plg). No. 1274/10.27.00/2016-17

న‌వంబ‌ర్ 14, 2016

ద ఛైర్మ‌న్‌/మేనేజింగ్ డైరెక్ట‌ర్‌/చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌,
ప్ర‌భుత్వ రంగ బ్యాంకులు/ప్రైవేట్ రంగ బ్యాంకులు/ విదేశీ బ్యాంకులు/
స్థానిక‌ గ్రామీణ బ్యాంకులు/ ప‌ట్ట‌ణ స‌హ‌కార బ్యాంకులు/ రాష్ట్ర‌ స‌హ‌కార బ్యాంకులు/
జిల్లా కేంద్ర‌ స‌హ‌కార బ్యాంకులు

డియ‌ర్ స‌ర్‌,

స్పెసిఫైడ్ బ్యాంకు నోట్ల‌ చ‌ట్ట‌బ‌ద్ధ చ‌లామ‌ణి ల‌క్ష‌ణం ర‌ద్దు - న‌గ‌దు విత్ డ్రా మరియు డిపాజిట్ చేసే పంపిణీ కేంద్రాల‌ను విస్త‌రించ‌డం

దయచేసి పైన పేర్కొన్న అంశానికి సంబంధించి మేము న‌వంబ‌ర్ 08, 2016న జారీ చేసిన సర్కులర్ నెం.DCM (Plg) NO. 1226/10.27.00/2016/17ను చూడ‌గ‌ల‌రు. స్పెసిఫైడ్ బ్యాంకు నోట్ల‌ను మార్చుకోవ‌డానికి/డిపాజిట్ చేయ‌డానికి ప్ర‌స్తుతం ఉన్న స‌దుపాయాల‌ను మ‌రింత విస్త‌రించ‌డానికి త‌ద్వారా ప్ర‌జ‌లు ఈ సౌక‌ర్యాన్ని మ‌రింత ఎక్కువ‌గా ఉప‌యోగించుకోవ‌డానికి ఈ క్రింది అద‌న‌పు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని బ్యాంకుల‌కు సూచించ‌డ‌మైన‌ది.

అదనపు సౌకర్యాలు:

i) కరెంటు అకౌంట్ ఖాతాదారులు (గత మూడు నెలలు లేదా అంత‌కు ముందు నుంచి వినియోగంలో ఉన్న ఖాతాలకు ఇది వర్తిస్తుంది) వారానికి రూ.50,000 వరకు నగదును విత్ డ్రా చేసుకోవచ్చు. ఇటువంటి చెల్లింపులను సాధ్య‌మైనంత‌గా 2000 రూపాయల నోట్లతో మాత్రమే చేయాలి.

ii) బ్యాంకులు తమ మైక్రో ఏటీఎంలను (బాలమిత్ర మొద‌.) గ్రామ పంచాయతీ కార్యాలయాలు, పోలీస్ స్టేషన్/పోలీస్ మ‌రియు మిల‌ట‌రీ అవుట్ పోస్టులు, ప్రభుత్వ శాఖలు, పబ్లిక్ సెక్టార్ యూనిట్ కార్యాల‌యాలు, పెట్రోల్ పంపులు మొద‌లైన వాటి వ‌ద్ద‌కు పంప‌వ‌చ్చు. దీని వ‌ల్ల ఎక్కువ ప‌రిమాణంలో న‌గ‌దు అవ‌స‌ర‌మ‌వుతుంది కాబ‌ట్టి, బ్యాంకులు మైక్రో ఏటీఎంల ప‌రిమితిని క‌నీసం రూ.50000కు పెంచి, త‌ర‌చుగా వాటిని భ‌ర్తీ చేస్తూ ఉండాలి.

iii) మారుమూల‌/ బ్యాంకులు లేని ప్రాంతాల‌లో ఉంటున్న ప్ర‌జ‌ల న‌గ‌దు మార్పిడి/డిపాజిట్ /న‌గ‌దు ఉప‌సంహ‌ర‌ణ స‌దుపాయాల కొర‌కు బ్యాంకులు మొబైల్ వ్యాన్ల‌ను ఉప‌యోగించుకునే అవ‌కాశాన్ని ప‌రిశీలించాలి.

iv) బ్యాంకులు తేయాకు/కాఫీ ఇత‌ర ప్లాంటేష‌న్ కార్మికులు, చ‌క్కెర స‌హ‌కార సంఘాల ఉద్యోగులు, పాడి ప‌రిశ్ర‌మ ఉద్యోగులు, ఇత‌ర కార్మిక బృందాల కోసం ఎక్కువ మంది ఉండే ప్ర‌దేశాల‌ను ఎంపిక చేసుకుని అక్క‌డ క్యాంపు త‌ర‌హాలో ఏర్పాటు చేసి, వారికి అకౌంట్ల‌ను తెరిచి, త‌ద్వారా వారు త‌మ అకౌంట్ల‌లోకి డిపాజిట్ చేసుకోవ‌డం, విత్ డ్రా చేసుకోవ‌డంలాంటి సౌక‌ర్యాలు క‌ల్పించాలి.

v) పెరిగిన పని భారాన్ని దృష్టిలో ఉంచుకుని, ప‌దవీ విరమణ చేసిన ఉద్యోగుల‌ను కొంత‌కాలం పాటు తిరిగి విధుల్లోకి తీసుకునే వెసులుబాటును కల్పించాల‌ని పునరుద్ఘాటిస్తున్నాం.

ప‌ర్య‌వేక్ష‌ణ‌:

vi) ఖాతాదారులు స్పెసిఫైడ్ బ్యాంకు నోట్ల‌ను మ‌రియు ఇత‌ర చ‌ట్ట‌బ‌ద్ధంగా చ‌లామ‌ణి అయ్యే నోట్ల‌ను డిపాజిట్ చేసేందుకు వేర్వేరు పే-ఇన్-స్లిప్‌ల‌ను ఉప‌యోగించేలా బ్యాంకులు జాగ్ర‌త్త వ‌హించాలి. (ఒక డిపాజిట‌ర్ వ‌ద్ద స్పెసిఫైడ్ బ్యాంకు నోట్లు, ఇత‌ర చ‌ట్ట‌బ‌ద్ధంగా చ‌లామ‌ణి అయ్యే నోట్లు క‌లిసి ఉంటే అత‌ను వాటిని వేరుప‌ర‌చి, వేటిక‌ది ప్ర‌త్యేక‌మైన పే-ఇన్-స్లిప్ ల ద్వారా వాటిని డిపాజిట్ చేయాలి). బ్యాంకులు త‌దుప‌రి కాలంలో, అవి మార్పిడి కోస‌మైనా లేదా డిపాజిట్ కోస‌మైనా, తాము స్వీక‌రించిన SBNలను ధృవీక‌ర‌ణ‌ కొర‌కు ఖాతాదారుల వారీగా, నోట్ల విలువ వారీగా ఒక ఫ్లాగ్ ద్వారా వాటిని గుర్తిస్తూ ప్ర‌త్యేక‌మైన రికార్డు నిర్వ‌హించే వ్య‌వ‌స్థ‌ను, CBS ప‌రిధిలో, ఏర్పాటు చేయాలి.

మీ విశ్వ‌స‌నీయులు,

(పి. విజ‌య్ కుమార్‌)
చీఫ్‌ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్‌

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?