వస్తు మరియు సేవల ఎగుమతులు – ఎగుమతుల విలువ పొందవలసిన గడువు సడలింపు
RBI/2019-20/206 ఏప్రిల్ 01, 2020 అన్ని ఆతరైజ్డ్ డీలర్ క్యాటగిరి – I బ్యాంకులకు అమ్మా / అయ్యా, వస్తు మరియు సేవల ఎగుమతులు – కోవిడ్-19 మహామారి విజృంభణ కారణంగా, ఎగుమతుల విలువ పొందవలసిన గడువు పెంచవలసిందిగా భారత ప్రభుత్వానికి, రిజర్వ్ బ్యాంకుకు, ఎగుమతి వాణిజ్య సంఘాలనుండి అనేక అభ్యర్థనలు వస్తున్నాయి. అందువల్ల, భారత ప్రభుత్వంతో సంప్రదించి, వస్తువులు లేక సాఫ్ట్ వేర్ లేక సేవల ఎగుమతుల పూర్తి విలువ పొందుటకు, ప్రస్తుతం అమలులో ఉన్న 9 నెలల గడువును 15 నెలలకు పెంచడం జరిగింది. ఈ సౌకర్యం, జులై 31, 2020 వరకు చేసే ఎగుమతులకు వర్తిస్తుంది. 2. భారతదేశం బయట నెలకొల్పబడిన వేర్ హౌసులకు చేసిన ఎగుమతుల పూర్తి విలువ పొందవలసిన కాలపరిమితిలో ఎట్టి మార్పు లేదు. 3. ఏ డి క్యాటగిరి – I బ్యాంకులు, ఈ సర్క్యులర్ లోని అంశాలు, సంబంధిత వర్గాలకు తెలియచేయవలెను. 4. ఈ సర్క్యులర్ లోని ఆదేశాలు, విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం, 1999 (1999 లో 42 వది), సెక్షన్ 10 (4) మరియు 11 (1) క్రింద, ఇతర చట్ట పరమైన ఉత్తరువులు / అనుమతులకు భంగం కానివిధంగా, జారీచేయబడ్డాయి. మీ విశ్వాసపాత్రులు, (అజయ్ కుమార్ మిశ్రా) |
పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ: