<font face="mangal" size="3">ముధోల్ సహకార బ్యాంకు లిమిటెడ్, ముధోల్ - బ్యాం - ఆర్బిఐ - Reserve Bank of India
ముధోల్ సహకార బ్యాంకు లిమిటెడ్, ముధోల్ - బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (సహకార సంఘాలకు వర్తించేది) సెక్షన్ 35A క్రింద నిర్దేశాలు - కాలపరిమితి పొడిగింపు
తేది: 11/10/2019 ముధోల్ సహకార బ్యాంకు లిమిటెడ్, ముధోల్ - బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 ఏప్రిల్ 2, 2019 నాటి భారతీయ రిజర్వు బ్యాంకు ఆదేశం ప్రకారం, ముధోల్ సహకార బ్యాంకు లిమిటెడ్, ముధోల్, జిల్లా బాగల్కోట్, కర్ణాటక, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (సహకార సంఘాలకు వర్తించేది) సెక్షన్ 56 తో కలిపి సెక్షన్ 35A క్రింద నిర్దేశాల క్రింద ఉంచబడింది. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా సంతృప్తి చెందినదై, ఏప్రిల్ 2, 2019 నాటి ముధోల్ సహకార బ్యాంకు లిమిటెడ్, ముధోల్, జిల్లా బాగల్కోట్, కర్ణాటక పై విధించిన నిర్దేశాలను పొడిగించాలని భారతీయ రిజర్వు బ్యాంకు నిర్ణయించింది. తదనుసారంగా, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949, సెక్షన్ 56 తో కలిపి సెక్షన్ 35A యొక్క సబ్ సెక్షన్ (1) లో ఉన్న అధికారాలను వినియోగించుకుని, ఏప్రిల్ 2, 2019 నాటి ముధోల్ సహకార బ్యాంకు లిమిటెడ్, ముధోల్, జిల్లా బాగల్కోట్, కర్ణాటక పై విధించిన నిర్దేశాలు మరో ఆరు నెలల కాలానికి అక్టోబర్ 08, 2019 నుండి ఏప్రిల్ 7, 2020 వరకు, సమీక్షకు లోబడి భారతీయ రిజర్వు బ్యాంకు పొడిగించింది. పై నిర్దేశాల ఇతర నియమ నిబంధనలలో ఎట్టి మార్పులు వుండవు (యోగేష్ దయాళ్) పత్రికా ప్రకటన: 2019-2020/919 |