<font face="mangal" size="3px">వసంత్‌దాదా నగరి సహకారి బ్యాంక్ లి., ఒస్మానాబ&# - ఆర్బిఐ - Reserve Bank of India
వసంత్దాదా నగరి సహకారి బ్యాంక్ లి., ఒస్మానాబాద్, మహారాష్ట్రపై విధించిన నిర్దేశాల కాలపరిమితి పొడిగింపు
తేదీ: 18/09/2019 వసంత్దాదా నగరి సహకారి బ్యాంక్ లి., ఒస్మానాబాద్, మహారాష్ట్రపై విధించిన బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (కోఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు), సెక్షన్ 35 A, సబ్-సెక్షన్ (1) క్రింద తమకు దఖలుపరచబడిన అధికారాలతో, రిజర్వ్ బ్యాంక్, ప్రజాక్షేమం దృష్ట్యా, వసంత్దాదా నగరి సహకారి బ్యాంక్, ఒస్మానాబాద్, మహరాష్ట్రకు, నవంబర్ 13, 2017, పనివేళల ముగింపునుండి, నిర్దేశాలు జారీచేసింది. ఆ తరువాత, ఈనిర్దేశాల కాల పరిమితి, సెప్టెంబర్ 13, 2019 వరకు పొడిగించబడింది. రిజర్వ్ బ్యాంక్ ఇప్పుడు, ఈనిర్దేశాలను మరొక నెల, అనగా - సెప్టెంబర్ 14, 2019 నుండి అక్టోబర్ 13, 2019 వరకు పొడిగించింది. ఈ నిర్దేశాల అనుసారంగా, డిపాజిట్ల ఉపసంహరణ (withdrawal) / స్వీకారంపై (acceptance) కొన్ని నిబంధనలు / పరిమితులు విధించబడ్డాయి. ఈ నిర్దేశాల పూర్తి వివరాలు, ప్రజల సమాచారంకోసం, వసంత్ దాదా నగరి సహకారి బ్యాంక్, ఆవరణలో ప్రదర్శించబడ్డాయి. పరిస్థితులనుబట్టి, రిజర్వ్ బ్యాంక్ ఈఆదేశాలలో మార్పులు చేయవచ్చు. నిర్దేశాలు జారీ చేసినంత మాత్రాన రిజర్వ్ బ్యాంక్, వారి లైసెన్సును రద్దుచేసినట్లు భావించరాదు. బ్యాంకు, వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడేవరకు, కొన్ని నిబంధనలకు కట్టుబడి, బ్యాంకింగ్ కార్యకలాపాలు కొనసాగిస్తుంది. యోగేశ్ దయాల్ పత్రికా ప్రకటన: 2019-2020/724 |