RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S3

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78516209

వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్స్ మరియు ఓవర్-డ్రాఫ్ట్ నిబంధనల మధ్యంతర సడలింపు పొడిగింపు

సెప్టెంబర్ 29, 2020

వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్స్ మరియు ఓవర్-డ్రాఫ్ట్ నిబంధనల మధ్యంతర సడలింపు పొడిగింపు

COVID-19 కట్టడి మరియు ఉపశమన చర్యలను చేపట్టడంలో రాష్ట్ర ప్రభుత్వాలకు చేయూతనివ్వడం ఇంకా వారి మార్కెట్ ఋణాల ప్రణాళిక కు వీలు కల్పించే ఉద్దేశంతో, రాష్ట్రాల/కేంద్రీయ ప్రాంతాల WMA లిమిట్స్ ను మార్చి 31, 2020 నాటి వాటి స్థాయి మీద 60 శాతం పెంపుదలను ఆర్బీఐ ఏప్రిల్ 17, 2020 నాటి పత్రికా ప్రకటన ద్వారా ప్రకటించింది.

అంతేగాకుండా, రాష్ట్ర ప్రభుత్వాలకు వారి నగదు సరణిలో ఒడుదుడుకులను తట్టుకునే సౌలభ్యం అందించడానికి, ఓవర్‌డ్రాఫ్ట్ (OD) నిబంధనలు ఏప్రిల్ 7, 2020 నుండి సడలించబడి అమల్లోకి వచ్చాయి; వీటి ప్రకారం (అ) రాష్ట్రాల / కేంద్రీయ ప్రాంతాలు ఎన్ని రోజులు ఒకేతూరులో ఓవర్డ్రాఫ్ట్ క్రింద ఉండవచ్చో ఆ సంఖ్యను 14 పనిదినాల నుండి 21 పనిదినాల వరకు; మరియు (ఆ) త్రైమాసికంలో ఒక రాష్ట్రం గాని/ కేంద్రీయ ప్రాంతం గాని ఓవర్‌డ్రాఫ్‌లో ఉండగల రోజుల సంఖ్యను 36 పనిదినాల నుండి 50 పనిదినాల వరకు పెంచాలని నిర్ణయించబడింది.

ఈ సడలింపులు రెండూ సెప్టెంబర్ 30, 2020 వరకు లభ్యమౌతాయి.

సమీక్షానంతరం, పైన ఉటంకించిన ఏప్రిల్ 17, 2020 మరియు ఏప్రిల్ 07, 2020 నాటి వరుసగా రాష్ట్రాల/కేంద్రీయ ప్రాంతాల WMA లిమిట్ ను మరియు ఓవర్‌డ్రాఫ్ట్ (OD) నిబంధనల సడలింపును మరో 6 మాసాల పాటు మార్చి 31, 2021 వరకు పొడిగించాలని నిర్ణయించబడింది.

మిగతా అన్ని నిబంధనలలో ఎటువంటి మార్పులేదు.

(యోగేశ్ దయాళ్) 
చీఫ్ జనరల్ మేనేజర్

పత్రికా ప్రకటన: 2020-2021/405

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?