RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S1

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78490444

గ్రేస్ పీరియ‌డ్‌లో స్పెసిఫైడ్ బ్యాంకు నోట్ల మార్పిడికి అవ‌కాశం - కేవైసీ మ‌రియు అకౌంట్ వివ‌రాల నిర్ధార‌ణ

RBI/2016-17/205
DCM (Plg) No.2170/10.27.00/2016-17

డిసెంబ‌ర్ 31, 2016

ద ఛైర్మన్ / మేనేజింగ్ డైరెక్టర్ /చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్,
ప్ర‌భుత్వ రంగ బ్యాంకులు/ప్రేవేట్ రంగ బ్యాంకులు/విదేశీ బ్యాంకులు/
స్థానిక గ్రామీణ బ్యాంకులు/పట్టణ సహకార బ్యాంకులు/ రాష్ట్ర సహకార బ్యాంకులు/
జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు

డియ‌ర్ స‌ర్‌,

గ్రేస్ పీరియ‌డ్‌లో స్పెసిఫైడ్ బ్యాంకు నోట్ల మార్పిడికి అవ‌కాశం - కేవైసీ మ‌రియు అకౌంట్
వివ‌రాల నిర్ధార‌ణ

దయచేసి భార‌త ప్ర‌భుత్వం డిసెంబ‌ర్ 30, 2016న స్పెసిఫైడ్ బ్యాంకు నోట్ల (పూచీక‌త్తు ప‌రిస‌మాప్తి)పై జారీ చేసిన ఆర్డినెన్స్ నెం. 10 ఆఫ్ 2016 ను గ‌మ‌నించండి.

2. పైన పేర్కొన్న అంశములోని పేరా 4.1 ప్రకారం, నవంబర్ 10 నుంచి డిసెంబర్ 30, 2016 మధ్య కాలంలో భారతదేశంలో లేని కారణంగా స్పెసిఫైడ్ బ్యాంకు నోట్లను మార్చుకోలేకపోయిన భారతదేశ పౌరులు మరియు ప్ర‌వాస భార‌తీయుల నిమిత్తం వాటిని మార్చుకొనేందుకు అవకాశం కల్పించడమైనది. మరీ ప్రత్యేకించి, కేవలం ఎవరి అకౌంట్లు కేవైసీ నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయో మరియు ఎవరైతే నవంబర్ 10 నుంచి డిసెంబర్ 30, 2016 మధ్యకాలంలో తమ అకౌంట్ లో స్పెసిఫైడ్ బ్యాంకు నోట్లను జమ చేయలేదో వారికి మాత్ర‌మే ఈ అవ‌కాశం లభిస్తుంది.

3. పైన పేర్కొన్న సమాచారం బ్యాంకుల వద్ద ఉన్న నేపథ్యంలో ఆర్ బీఐ యొక్క నిర్దిష్ట కార్యాలయాలు (i) కైవైసీ స్టేటస్ నిర్ధారించుకొనేందుకు (ii) స్పెసిఫైడ్ బ్యాంకు నోట్ల జమ సమాచారాన్ని తెలుసుకొనేందుకు, నోట్లను సమర్పిస్తున్న వారి అకౌంట్ లో జమ చేసి ఉన్నట్లయితే, బ్యాంకులను సంప్రదిస్తాయి. అందువల్ల బ్యాంకులు అలాంటి సమాచారం కోరుతూ తమకు విజ్ఞప్తి అందిన ఏడు రోజులలోగా సమాచారం ఇచ్చేందుకు అవసరమైన ఏర్పాట్లను చేసుకోవాల్సిందిగా సూచించడమైనది. మా కార్యాలయాలు సంప్రదించే నిమిత్తం బ్యాంకులు ఇందుకోసం జనరల్ మేనేజర్ స్థాయిలోని అధికారిని నోడల్ అధికారిగా నియమించాలి. నోడల్ అధికారి యొక్క పేరు, కాంటాక్ట్ వివరాలను (ఈమెయిల్ ఐడీ సహా) మెయిల్ చేయండి.

4. ద‌య‌చేసి అందిన‌ట్లు తెలుప‌గ‌ల‌రు.

మీ విశ్వ‌స‌నీయులు,

(పి. విజ‌య కుమార్‌)
చీఫ్ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్‌


రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
గ్రేస్ పీరియ డ్ లో స్పెసిఫైడ్ బ్యాంకు నోట్ల (SBN) మార్పిడికి అవకాశం

భారత ప్రభుత్వం డిసెంబర్ 30, 2016న జారీ చేసిన స్పెసిఫైడ్ బ్యాంకు నోట్ల (పూచీకత్తు పరిసమాప్తి) ఆర్డినెన్స్ , 2016లోని సెక్షన్ 4 (1) మరియు డిసెంబర్ 30, 2016న జారీ చేసిన నోటిఫికేషన్ S.O. 4251(E) ప్రకారం - నవంబర్ 09, 2016 నుండి డిసెంబర్ 30, 2016 మధ్య కాలంలో దేశంలో లేని కారణంగా గతంలో స్పెసిఫైడ్ బ్యాంకు నోట్లను మార్చుకోగలిగే అవకాశాన్ని పొందలేకపోయిన భారత పౌరుల నిమిత్తం రిజర్వ్ బ్యాంక్ పైన పేర్కొన్న సదుపాయాన్ని రూపొందించడం జరిగింది.

ఈ అవ‌కాశం కింద క‌ల్పించిన స‌దుపాయాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:

2. మార్చుకొనే ప్ర‌దేశాలు :

ఈ నోట్ల మార్పిడి స‌దుపాయాన్ని ముంబై, న్యూఢిల్లీ, చెన్నై, కోల్ క‌తా, నాగ్ పూర్ ల‌లోని రిజ‌ర్వ్ బ్యాంకు యొక్క 5 కార్యాల‌యాల వ‌ద్ద పొంద‌వ‌చ్చు.

3. అర్హ‌త క‌లిగిన వారు

3.1 ఈ సదుపాయాన్ని కేవలం వ్యక్తిగత స్థాయిలోని భారతీయ పౌరులు మాత్రమే, అదీ పేర్కొన్న స‌మ‌యంలో ఒకసారి మాత్రమే నోట్ల‌ను మార్చుకొన‌గ‌లిగే అవకాశముంది. ఈ అవకాశం కింద థర్డ్ పార్టీల‌కు మార్పిడి అవకాశం కల్పించరు.

3.2 స్పెసిఫైడ్ బ్యాంకు నోట్ల‌ను క‌లిగిన భార‌తీయ పౌరుల‌లో రెండు వ‌ర్గాల వారు ఈ అవ‌కాశాన్నిఉప‌యోగించుకోవ‌చ్చు.

i) నవంబ‌ర్ 09 నుంచి డిసెంబ‌ర్ 30, 2016 మ‌ధ్య‌కాలంలో భార‌త‌దేశంలో లేని భార‌త‌దేశ పౌరులు;

ii) నవంబ‌ర్ 09 నుంచి డిసెంబ‌ర్ 30, 2016 మ‌ధ్య‌కాలంలో భార‌త‌దేశంలో లేని ప్ర‌వాస భార‌తీయులు

3.3 ఈ అవకాశం నేపాల్‌, భూటాన్, పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌ల‌లో ఉన్న భార‌తీయ పౌరుల‌కు వ‌ర్తించ‌దు.

3.4 ఈ అవకాశం కింద విధించిన నియ‌మ నిబంధ‌న‌లు, పైన పేర్కొన్న రెండు వ‌ర్గాల వారి విష‌యంలో దీనిని ఏ విధంగా అమ‌లు చేస్తారు అన్న‌ది ఈ క్రింద పేర్కొన‌డం జ‌రిగింది.

ఎ. భార‌త‌దేశంలో ఉండే పౌరులు

i. నవంబ‌ర్ 9, 2016 నుంచి డిసెంబ‌ర్ 30, 2016 మ‌ధ్య కాలంలో దేశంలో లేని దేశ పౌరులు ఈ అవ‌కాశాన్ని ఈ ప‌థ‌కం అమ‌లులో ఉన్న కాలంలో కేవ‌లం ఒక్క‌సారి మాత్ర‌మే ఉప‌యోగించుకొనే అవ‌కాశం ఉంది.

ii. స్పెసిఫైడ్ బ్యాంకు నోట్ల‌ మార్పిడి విష‌యంలో ఎంత న‌గ‌దును మార్చుకోవ‌చ్చు అనే విష‌యంలో ఎలాంటి ప‌రిమితులూ లేవు.

iii. మార్చుకోద‌ల‌చిన నోట్ల వివ‌రాల‌ను Annex-1 లో పేర్కొన్న ఫామ్ లో పూర్తి చేసి, దానికి ఆ స‌మ‌యంలో మీరు విదేశాల‌లో ఉన్నార‌న‌డానికి త‌గిన సాక్ష్యాల‌ను జ‌త‌ప‌ర‌చి, స‌మ‌ర్పించాలి.

iv. నవంబ‌ర్ 9, 2016 నుంచి డిసెంబ‌ర్ 30, 2016 మ‌ధ్య కాలంలో మీరు దేశంలో లేరు అనడానికి సాక్ష్యంగా ఇమ్మిగ్రేష‌న్ స్టాంపు క‌లిగిన పాస్ పోర్టు కాపీని స‌మ‌ర్పించాలి. ప‌రిశీల‌న నిమిత్తం ఆర్బీఐ కౌంట‌ర్ వ‌ద్ద మీ అస‌లు పాస్ పోర్టును చూపించాలి.

v. నవంబ‌ర్ 10, 2016 నుంచి డిసెంబ‌ర్ 30, 2016 మ‌ధ్య కాలంలో ఎక్క‌డా స్పెసిఫైడ్ బ్యాంకు నోట్ల‌ను జ‌మ చేయ‌లేద‌న‌డానికి సాక్ష్యంగా అన్ని బ్యాంకుల స్టేట్ మెంట్లు స‌మ‌ర్పించాలి.

vi. మార్చుకొన‌ద‌ల‌చిన నోట్లను ఒక చెల్లుబాటయే గుర్తింపు ధృవపత్రం, వారి ఆధార్ సంఖ్యతో పాటు కేవైసీ నిబంధనలకు అనుగుణంగా ఉన్న ఖాతాదారు బ్యాంకు అకౌంట్ వివరాలను సమర్పించాలి.

vii. ఐటీ రూల్స్‌, 1962లోని సెక్ష‌న్ 114B కు అనుగుణంగా, త‌గిన ప‌త్రాలు స‌మ‌ర్పించాల్సి ఉంటుంది.

viii. నోట్లను సమర్పించే వారికి వారి అకౌంట్ లో జమ చేయాల్సిన నగదు విష‌యంపై, నోట్లను స్వీకరించినట్లు ఒక ధృవపత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది.

ix. నోట్లను సమర్పించే వారు నవంబర్ 10, 2016 నుంచి డిసెంబర్ 30, 2016 మధ్య కాలంలో విదేశాలలో ఉన్నారని, వారి అకౌంట్ కేవైసీ నిబంధనలకు అనుగుణంగా ఉందని, ఇతర నియ‌మ‌నిబంధ‌న‌ల‌ను పూర్తి చేయ‌డం జ‌రిగింద‌ని, మార్చుకొనేందుకు సమర్పించిన నోట్లు అసలైనవి అని నిర్ధారించుకున్న అనంత‌రం వారు సమర్పించిన నోట్లకు సమానమైన నగదును వారి అకౌంట్ లో జమ చేయడం జరుగుతుంది.

బి) ప్ర‌వాస భార‌తీయులు (NRIలు)

i. నవంబర్ 9, 2016 నుంచి డిసెంబర్ 30, 2016 మధ్య కాలంలో భార‌త‌దేశంలోని ప్ర‌వాస భార‌తీయులు మాత్ర‌మే ఈ అవ‌కాశాన్ని ఈ ప‌థ‌కం అమ‌లులో ఉన్న కాలంలో కేవ‌లం ఒక్క‌సారి మాత్ర‌మే ఉప‌యోగించుకొనే అవ‌కాశం ఉంది.

ii. మార్చుకోద‌ల‌చిన నోట్ల‌ను Annex- 2 లో సూచించిన ఫామ్ తో పాటు స‌మ‌ర్పించాలి.

iii. మార్చుకోద‌ల‌చిన నోట్ల‌ను ఫెమా నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా ఎప్పుడు భార‌త దేశం వెలుప‌లికి తీసుకెళ్ల‌డం జ‌రిగింది అన్న‌దానిని అనుస‌రించి, ఒక వ్య‌క్తి అత్య‌ధికంగా కేవ‌లం రూ.25,000 మాత్ర‌మే మార్చుకొన‌గ‌లిగే అవ‌కాశ‌ముంది.

iv. నవంబ‌ర్ 9, 2016 నుంచి డిసెంబ‌ర్ 30, 2016 మ‌ధ్య కాలంలో మీరు దేశంలో లేరు అనడానికి సాక్ష్యంగా ఇమ్మిగ్రేష‌న్ స్టాంపు క‌లిగిన పాస్ పోర్టు కాపీని స‌మ‌ర్పించాలి. ప‌రిశీల‌న నిమిత్తం ఆర్బీఐ కౌంట‌ర్ వ‌ద్ద మీ అస‌లు పాస్ పోర్టును చూపించాలి.

v. భార‌తీయ క‌స్ట‌మ్స్ అధికారులు డిసెంబ‌ర్ 30, 2016 అనంత‌రం దేశంలోకి వ‌చ్చిన SBN వివ‌రాలు, వాటి విలువ‌ను పేర్కొంటూ రెడ్ ఛానెల్ ద్వారా జారీ చేసిన స‌ర్టిఫికేట్ ను స‌మ‌ర్పించాలి.

vi. నవంబ‌ర్ 10, 2016 నుంచి డిసెంబ‌ర్ 30, 2016 మ‌ధ్య కాలంలో ఎక్క‌డా స్పెసిఫైడ్ బ్యాంకు నోట్ల‌ను జ‌మ చేయ‌లేద‌న‌డానికి సాక్ష్యంగా అన్ని బ్యాంకుల స్టేట్ మెంట్లు స‌మ‌ర్పించాలి.

vii. ఐటీ రూల్స్‌, 1962లోని సెక్ష‌న్ 114B కు అనుగుణంగా, త‌గిన ప‌త్రాలు స‌మ‌ర్పించాల్సి ఉంటుంది.

viii. నోట్లను సమర్పించే వారికి వారి అకౌంట్ లో జమ చేయాల్సిన నగదు విష‌యంపై, నోట్లను స్వీకరించినట్లు ఒక ధృవపత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది.

ix. నోట్లను సమర్పించే వారు నవంబర్ 10, 2016 నుంచి డిసెంబర్ 30, 2016 మధ్య కాలంలో విదేశాలలో ఉన్నారని, వారి అకౌంట్ కేవైసీ నిబంధనలకు అనుగుణంగా ఉందని, ఇతర నియ‌మ‌నిబంధ‌న‌ల‌ను పూర్తి చేయ‌డం జ‌రిగింద‌ని, మార్చుకొనేందుకు సమర్పించిన నోట్లు అసలైనవి అని నిర్ధారించుకున్న అనంత‌రం వారు సమర్పించిన నోట్లకు సమానమైన నగదును వారి అకౌంట్ లో జమ చేయడం జరుగుతుంది.

4. కాల‌ప‌రిమితి

ఈ స‌దుపాయం భార‌త పౌరుల‌కు జ‌న‌వ‌రి 2, 2017 నుంచి మార్చి 31, 2017 వ‌ర‌కు మ‌రియు ప్ర‌వాస భార‌తీయుల‌కు జ‌న‌వ‌రి 2, 2017 నుంచి జూన్ 30, 2017 వ‌ర‌కు అందుబాటులో ఉంటుంది.

5. నివేద‌న‌లు

ఎవరైనా వ్యక్తులు సమర్పించిన స్పెసిఫైడ్ బ్యాంకు నోట్లకు సమానమైన నగదును వారి అకౌంట్ లో జమ చేయడానికి రిజర్వ్ బ్యాంక్ నిరాకరించినట్లయితే, అట్టివారు అలాంటి నిరాకరణకు సంబంధించిన వివరాలు తమకు అందిన పధ్నాలుగు రోజుల లోపు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ రిజర్వ్ భ్యాంకుకు తమ నివేదన అందజేయవచ్చు.అలాంటి నివేదలను సెంట్రల్ బోర్డ్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెక్రటరీస్ డిపార్ట్ మెంట్, సెంట్రల్ ఆఫీస్ బిల్డింగ్, 16వ అంతస్తు, షహీద్ భగత్ సింగ్ మార్గ్, ముంబై- 400 001కు పంపుకోవాలి. నివేదనలను ఈమెయిల్ ద్వారా కూడా పంపవచ్చు.

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?