RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S3

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78521522

ఆర్ధిక సమీకరణం – బ్యాంకింగ్ సేవల సౌలభ్యం – ప్రాధమిక పొదుపు బ్యాంక్ డిపాజిట్ ఖాతా (బియస్బిడిఏ)

ఆర్.బి.ఐ/2018-19/206
డిబిఆర్. యల్ఈజి.బీసీ.నం.47/09.07.005/2018-19.

జూన్ 10, 2019

అన్ని షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు (ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు కలుపుకుని)
అన్ని చెల్లింపు బ్యాంకులు
అన్ని చిన్న ఋణ బ్యాంకులు
అన్ని లోకల్ ఏరియా బ్యాంకులు

డియర్ సర్/మేడమ్,

ఆర్ధిక సమీకరణం – బ్యాంకింగ్ సేవల సౌలభ్యం – ప్రాధమిక పొదుపు బ్యాంక్ డిపాజిట్ ఖాతా (బియస్బిడిఏ)

శీర్షిక మీది అంశంపై తేదీ ఆగష్టు 10, 2012 నాటి మా సర్క్యులర్ డిబిఓడి నం.యల్ఈజి.బిసి.35/09.07.005/2012-13 ను ఒకతూరు పరికించండి.

2. ప్రాధమిక పొదుపు బ్యాంక్ డిపాజిట్ ఖాతా (బియస్బిడిఏ) అటువంటి ఖాతాలను కలిగి ఉన్నవారికి ఎటువండి చార్జీలు లేకుండా కొన్ని కనీస సేవలు అందించే ప్రాతిపదికన రూపొందించబడింది. ఖాతాదార్లకు మెరుగైన సేవలను అందించే దృష్టితో, ఈ ఖాతాలకున్న వొసగులకు కొన్ని మార్పులను తీసుకురావాలని నిర్ణయించబడింది. తదనుగుణంగా, కనీస నిల్వ అవసరం లేకుండానే బియస్బిడి ఖాతాలకు ఈ క్రింద సూచించబడిన కనీస ప్రాధమిక సేవలను ఎటువంటి చార్జీలు లేకుండా కల్పించాలని బ్యాంకులను ప్రస్తుతం ఆదేశించడం జరిగింది:-

అ) బ్యాంకు బ్రాంచిలతో పాటుగా ఏటియం/సీడియం లలో నగదు జమ చేయుటo ఉచితం

ఆ) కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీలు మరియు డిపార్టుమెంట్లు డ్రా చేసిన చెక్కులను సేకరించడం/జమచేయడం ద్వారా గాని ఎటువంటి ఎలక్ట్రానిక్ మాధ్యమo ద్వారాగాని నగదు ప్రాప్తి/వసూళ్లు;

ఇ) నెలలో ఎన్నిసార్లు, ఎంతమొత్తంలో అయినా బియస్బిడి ఖాతాల్లో నగదు జమచేయొచ్చు.

ఈ) నెలకు 4 సార్లు నగదు ఉపసంహరణకు అనుమతి , ఏటియం ఉపసంహరణలతో కలుపుకుని.

ఉ) ఏటియం కార్డు గాని ఎటియం/డెబిట్ కార్డు గాని ఉచితంగా అందించాలి.

అందరికి అందుబాటులోయున్న మామూలు బ్యాంకింగ్ సేవ గానే బియస్బిడి ఖాతాను పరిగణించాలి.

3. ప్రస్తుతం బేసిక్ ఖాతాలకు అమలవుతున్న సేవలకు అదనంగా చెక్ బుక్ వంటి మరిన్ని సేవలను బ్యాంకులు అందించవచ్చు, వాటికి చార్జీలు ఉన్నాయో లేదో అనేది బ్యాంకులు వెల్లడించాల్సి ఉంటుంది. ఈ అదనపు సేవలు ఖాతాదార్ల ఇష్టతతో మాత్రమే వారికి అందించవచ్చు. ఈ సదుపాయాలు కల్పించాము కనుక, ఖాతాలలో కనీస నగదు నిల్వ చేయాలని ఖతాదార్లపై బ్యాంకులు ఒత్తిడి చేయకూడదు. ఈ సేవలు అందించినంతమాత్రాన అవి బియస్బిడి ఖాతాలు కాకుండా పోవు. అందువల్ల ఎంతకాలమైనా ఉచిత కనీస సేవలు ఆ ఖాతాలకు అమలు కావాల్సిందే.

4. అదే బ్యాంకులో మరే ఇతర సేవింగ్స్ బ్యాంకు ఖాతాను తెరవడానికి బియస్బిడి ఖాతాదార్లు అర్హులు గారు. ఒకవేళ ఇపుడున్న బ్యాంకులో మరే ఇతర సేవింగ్స్ బ్యాంకు ఖాతాఐనా ఉన్నట్లయితే, బియస్బిడి ఖాతా తెరిచిన తేదీ నుంచి ముప్పై రోజుల లోపున ఆ ఖాతాను మూయాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా, బియస్బిడి ఖాతా తెరిచే ముందుగా బ్యాంకు ఆ కస్టమర్ నుండి మరే ఇతర బ్యాంకుల్లోగూడ ఆయనకు/ఆమెకు బియస్బిడి ఖాతా లేదని ద్రువపత్రం తీసుకోవాలి.

5. ఫిబ్రవరి 25, 2016 తేదీ న ఆర్బీఐ చే “మాస్టర్ డైరెక్షన్- మీ వినియోగదారుని తెలుసుకోండి (కేవైసి) నిర్దేశం 2016” రూపేణా మాస్టర్ డైరెక్షన్ డిబిఆర్.ఏయంయల్.బిసి.నం.81/14.01.001/2015-16 సర్కులర్ ద్వారా జారీఅయి కాలక్రమంలో సవరణబొంది, బ్యాంకు ఖాతాలు తెరవడానికై ఉన్నటువంటి ఆర్బీఐ కేవైసి/ఏయంయల్ నిబంధనలకు బియస్బిడి ఖాతా అనేది లోబడి ఉండాలి.

6. సాధారణ బ్యాంకు ఖాతాలకు వారి బ్యాంకు ఏటియం లేదా ఇతర బ్యాంకు ఏటియం ల నుండి జరిపే ఉచిత లావాదేవీలపై ఆగష్టు 14, 2014 తేదీ నాటి సర్కులర్ డిపియస్యస్.సిఓ.పిడి.నం.316/02.10.002/2014-15 మరియు అక్టోబర్ 10, 2014 తేదీనాటి సర్కులర్ డిపియస్యస్.సిఓ.పిడి.నం.659/02.10.002/2014-15 ల ద్వారా జారీ అయిన నిబంధనలు ఈ బియస్బిడి ఖాతాలకు వర్తింపవు. బియస్బిడి ఖాతాదార్లు ఏ బ్యాంకు ఏటియం ద్వారానైనా పరిమితకనిష్టసంఖ్యవరకు చార్జిలులేకుండా నగదును విత్-డ్రా చేయొచ్చు.

7. గతంలో ఆగష్టు 10, 2012 తేదీన “ఆర్ధిక సమీకరణం – బ్యాంకింగ్ సేవల సౌలభ్యం – ప్రాధమిక పొదుపు బ్యాంక్ డిపాజిట్ ఖాతా (బియస్బిడిఏ) శీర్షిక మీద” సర్కులర్ నం. డిబిఆర్. యల్ఈజి.బీసీ.నం.35/09.07.005/2012-13 ద్వారా, ఆ తరువాత సెప్టెంబర్ 11, 2013 తేదీన “ఆర్ధిక సమీకరణం – బ్యాంకింగ్ సేవల సౌలభ్యం – ప్రాధమిక పొదుపు బ్యాంక్ డిపాజిట్ ఖాతా (బియస్బిడిఏ) - తరచూ అడిగే ప్రశ్నలు శీర్షిక మీద” సర్కులర్ నం.డిబిఆర్.యల్ఈజి.బీసీ.నం.52/09.07.005/2013-14 ద్వారా, జారీ ఆయిన నిబంధనలను ఈ సర్కులర్ అధిక్రమితం చేస్తున్నది.

8. ఈ నిబంధనలు జులై 1, 2019 వ తేదీ నుండి అమలులోకి వస్తాయి. ఈ సందర్భంగా తగు వ్యవస్థను మరియు విధి విధానాలను బోర్డు ఆమోదంతో యేర్పరచాలని బ్యాంకులకు సలహా ఇవ్వడమైనది.

మీ విధేయులు

(శ్రీమోహన్ యాదవ్)
చీఫ్ జనరల్ మేనేజర్

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?