<font face="mangal" size="3">ఆర్థిక అక్షరాస్యత కేంద్రాలు – సవరించిన నివే - ఆర్బిఐ - Reserve Bank of India
ఆర్థిక అక్షరాస్యత కేంద్రాలు – సవరించిన నివేదిక నమూనా
RBI/2016-17/40 ఆగస్ట్ 25, 2016 చైర్‌మన్/ మేనేజింగ్ డైరెక్టర్/ అయ్యా/అమ్మా, ఆర్థిక అక్షరాస్యత కేంద్రాలు – సవరించిన నివేదిక నమూనా బ్యాంకుల యొక్క FLC లు, గ్రామీణ శాఖలపై నివేదికా విధానం జతపరుస్తూ (అనుబంధంIII – పార్ట్ A,B,and C), 'ఆర్థిక అక్షరాస్యత కేంద్రాలు (FLCs) - సవరించిన మార్గదర్శకాలపై' మేము జారీ చేసిన సర్క్యులర్ FIDD.FLC.BC.No.18/12.01.018/2015-16 తేదీ జనవరి 14, 2016, దయచేసి చూడండి. ఈ సందర్భంగా, నివేదిక నమూనాను అనుబంధం (పార్ట్ A, పార్ట్ B, పార్ట్ C మరియు పార్ట్ D) సూచించిన విధంగా మార్పుచేయాలని నిర్ణయించడం జరిగింది. ఉదాహరణకై, కొన్ని ఎంట్రీలు పూరించబడ్డాయి. సెప్టెంబర్ 2016 త్రైమాసికం చివరనుండి, SLBC/UTLBC లు, జత చేసిన ఎక్సెల్ షీట్ నమూనాలో త్రైమాసిక నివేదికలు, ఆయా రిజర్వ్ బ్యాంక్ కార్యాలయాలకు త్రైమాసికం పూర్తి అయిన 20 రోజుల లోపల సమర్పించవలెను. విధేయులు. (ఎ. ఉద్గత) |