<font face="mangal" size="3">ఆర్థిక అక్షరాస్యతా సప్తాహము – 2019</font> - ఆర్బిఐ - Reserve Bank of India
ఆర్థిక అక్షరాస్యతా సప్తాహము – 2019
తేదీ: 31/05/2019 ఆర్థిక అక్షరాస్యతా సప్తాహము – 2019 ఆర్థిక అక్షరాస్యతా సప్తాహం, ప్రతి సంవత్సరం, ఒకొక్క అంశంపై ప్రత్యేక ప్రచారంద్వారా అవగాహన పెంపొందించడానికి, రిజర్వ్ బ్యాంక్ తీసుకొంటున్న చొరవ. ఆర్థిక అక్షరాస్యతా సప్తాహం 2019, 'వ్యవసాయదారులు' ఇతివృత్తంగా జూన్ 3 నుండి 7 వరకు పాటించబడుతుంది. వ్యవసాయదారులు, బ్యాంకింగ్ వ్యవస్థలో భాగం కావడంద్వారా వారికి చేకూరే ప్రయోజనాలగురించి ప్రత్యేక అవగాహన కల్పించబడుతుంది. వ్యవసాయ రంగంలో అభివృద్ధి, ఆర్థిక పురోగతికి కీలకం. వ్యవసాయ రంగ అభివృద్ధికి, ద్రవ్య సహాయం ఎంతో అవసరం. రిజర్వ్ బ్యాంక్, వ్యవసాయదారులకు రుణ లభ్యత మెరుగుపరచే విధానాలు రూపొందించుటలో క్రియాశీలమైన పాత్ర పోషిస్తున్నది. ఇటీవలి కాలంలో, రుణ బట్వాడా ప్రక్రియ బలోపేతంచేయుటకు మరియు వ్యవసాయదారుల ఆర్థిక సంఘటితమునకు, బ్యాంక్ అనేక చర్యలు చేపట్టింది. వ్యవసాయదారులకు, ఆర్థిక అక్షరాస్యతా సందేశాలపై అవగాహన పెంచుటకు, విస్తృత ప్రచారముచేయుటకు, పోస్టర్లు, కరపత్రాలు తయారుచేయబడ్డాయి. వీటిని బ్యాంకుల గ్రామీణ శాఖలలో, ఆర్థిక అక్షరాస్యతా కేంద్రాలలో, ఏ టి ఎమ్‌లలో, వెబ్‌సైట్లలో ప్రదర్శించవలెనని, బ్యాంకులు ఆదేశించబడ్డాయి. ఇంతేగాక, దూర్‌దర్శన్, ఆల్ ఇండియా రేడియో ద్వారా, ముఖ్యమైన ఆర్థిక అక్షరాస్యతా సందేశాలు విస్తరింపచేయడానికి, జూన్ నెలలో రిజర్వ్ బ్యాంక్, కేంద్రీకృత ప్రచారం చేపడుతుంది. ఇది, వ్యవసాయ రంగానికి చేరువకావడానికి, రిజర్వ్ బ్యాంక్ చేస్తున్న కృషి. భాగస్వాములందరూ సహకరించి, ఈ ఆర్థిక అక్షరాస్యతా ప్రచారాన్ని, విజయవంతం చేయవలెనని మనవి. యోగేశ్ దయాల్ పత్రికా ప్రకటన: 2018-2019/2816 |