<font face="mangal" size="3">అరుణాచల్ ప్రదేశ్‌రాష్ట్రంలో క్రొత్త జిల్ల&# - ఆర్బిఐ - Reserve Bank of India
అరుణాచల్ ప్రదేశ్రాష్ట్రంలో క్రొత్త జిల్లాల ఏర్పాటు - లీడ్ బ్యాంకు బాధ్యత అప్పగింత
RBI/2016-17/310 మే 25, 2017 చైర్మెన్ & మానేజింగ్ డైరెక్టర్లు అయ్యా/అమ్మా, అరుణాచల్ ప్రదేశ్రాష్ట్రంలో క్రొత్త జిల్లాల ఏర్పాటు - లీడ్ బ్యాంకు బాధ్యత అప్పగింత అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం, వారి గెజెట్ నోటిఫికేషన్ తేదీ మార్చ్ 3, 2014 ద్వారా, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో నాలుగు క్రొత్త జిల్లాలు ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. ఈ క్రొత్త జిల్లాల లీడ్ బ్యాంక్ బాధ్యత క్రింద సూచించిన విధంగా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు అప్పగించాలని నిశ్చయించబడింది:
2. గెజెట్ నోటిఫికేషన్లో "లోవర్ సియాంగ్" పేరుతో క్రొత్త జిల్లా ప్రకటించినా, దాని సరిహద్దులు, పరిపాలిత ప్రదేశాలు ఇంకా ఖరారు చేయబడలేదు. ఈ కారణంగా, అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వ సందేశం ప్రకారం ఈ జిల్లా క్రియాశీలము కాలేదు. అందువల్ల, ఈ జిల్లా లీడ్ బ్యాంక్ బాధ్యత వేరుగా అప్పగించబడుతుంది. 3. జిల్లా 'వర్కింగ్ కోడ్లు' బ్యాంకుల BSR నివేదికల కొరకై ఈయబడినవి. 4. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఇతర జిల్లాల లీడ్ బ్యాంక్ బాధ్యతలలో ఏ మార్పూ లేదు. మీ విధేయులు, (అజయ్ కుమార్ మిశ్రా) |