<font face="mangal" size="3">అస్సాం రాష్ట్రంలో క్రొత్త జిల్లాల ఏర్పాటు &ndas - ఆర్బిఐ - Reserve Bank of India
అస్సాం రాష్ట్రంలో క్రొత్త జిల్లాల ఏర్పాటు – లీడ్ బ్యాంకు బాధ్యతల అప్పగింత
ఆర్.బి.ఐ/2017-18/122 జనవరి 18, 2018 చైర్మెన్ & మేనేజింగ్ డైరెక్టర్లు/చీఫ్ ఎక్సిక్యూటివ్ ఆఫీసర్లు డియర్ సర్/మేడమ్, అస్సాం రాష్ట్రంలో క్రొత్త జిల్లాల ఏర్పాటు – లీడ్ బ్యాంకు బాధ్యతల అప్పగింత అస్సాం ప్రభుత్వం, జనవరి 25, 2016, ఫిబ్రవరి 26, 2016 మరియు ఆగష్టు 5, 2016 తేదీలనాడు తమ గెజిట్ నోటిఫికేషన్ ల ద్వారా ఎనిమిది క్రొత్త జిల్లాలు ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. ఈ క్రొత్త జిల్లాల లీడ్ బ్యాంకు బాధ్యతలను క్రింద వివరించిన విధంగా అప్పగించాలని నిశ్చయింపబడినది.
2. ఫిబ్రవరి 26, 2016 తేదీ గెజెట్ నోటిఫికేషన్ లో “తూర్పు కామరూప్” మరియు “దక్షిణ కామరూప్” పేర్లతో రెండు క్రొత్త జిల్లాలు ప్రకటించినప్పటికీ, అస్సాం ప్రభుత్వం నుంచి వచ్చిన సమాచారం ప్రకారం ఈ జిల్లాలు ఇంకా క్రియాశీలం కాలేదు. అందుచేత, ఈ జిల్లాల లీడ్ బ్యాంక్ బాధ్యత వేరుగా అప్పగించబడుతుంది. 3. క్రొత్త జిల్లాల “వర్కింగ్ కోడ్” లు బ్యాంకుల BSR నివేదికల కొరకై ఈయబదినవి. 4. అస్సాం రాష్ట్రంలోని ఇతర జిల్లాల లీడ్ బ్యాంక్ బాధ్యతలలో ఏ మార్పు లేదు. మీ విధేయులు (అజయ్ కుమార్ మిశ్రా) |