<font face="mangal" size="3">గోల్డ్ ముద్రీకరణ (మోనిటైజేషన్) పథకం, 2015</font> - ఆర్బిఐ - Reserve Bank of India
గోల్డ్ ముద్రీకరణ (మోనిటైజేషన్) పథకం, 2015
ఆర్.బి.ఐ/2019-20/43 ఆగష్టు 16, 2019 అన్ని షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు (ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు మినహాయించి) మేడమ్/డియర్ సర్, గోల్డ్ ముద్రీకరణ (మోనిటైజేషన్) పథకం, 2015 బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 సెక్షన్ 35 ఎ క్రింద భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) కు సంక్రమించిన అధికారాలతో, ఆర్బీఐ అక్టోబర్ 22,2015 వ తేదీ నాటి ‘భారతీయ రిజర్వు బ్యాంకు [గోల్డ్ ముద్రీకరణ (మోనిటైజేషన్) పథకం, 2015] – మాస్టర్ డైరెక్షన్ నం.డిబిఆర్. ఐబిడి.నం.45/23.67.003/2015-16 నందు తక్షణo అమలుజరిగేలా ఈ క్రింది సవరణలను చేస్తున్నది: 1. ఇపుడున్న ఉప-పేరా 2.1.1. (v) ను ఈ క్రింది విధంగా చదవబడేలా సవరణజేయాలి: “ ఈ పథకం క్రింద డిపాజిట్లు అన్నింటినీ CPTC లో జమచేయాలి. ఈ షరతుకు లోబడి, బ్యాంకులు వారి అభీష్టం మేరకు, తమ నిర్దేశిత శాఖల ద్వారా బంగారం డిపాజిట్ల ను ముఖ్యంగా దిగ్గజ డిపాజిటర్లనుంచి అంగీకరించవచ్చు. తమ ఉనికి ఎక్కడుందో ఆయా రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతాలలో కనీసంగా ఒకశాఖను ఈ పథకం క్రింద డిపాజిట్లను అంగీకరించడాని కోసమై నిర్ధారించాలి. షరతుకు లోబడి, ఇంకా బ్యాంకులు వారి అభీష్టం మేరకు డిపాజిటర్లను తుది నిర్ధరింపు నిర్వహణ జేయగలిగి మరియు 995 శుద్ధితత్వ గోల్డ్ ప్రామాణికత తో డిపాజిట్ రశీదు జారీ చేయగల సౌకర్యలభ్యత గల శుద్ధికర్మాగారాలలో కూడా నేరుగా బంగారం జమ చేయడానికై అనుమతించవచ్చు”. 2. కొత్తగా ఉప-పేరా 2.1.1 (xi) ను ఈ క్రింది విధంగా చదవబడేలా చేర్చాలి: “నియుక్తులైయున్న బ్యాంకులన్ని ఈ పథకం గురించి వారి శాఖలు, వెబ్సైట్లు మరియు ఇతర చానళ్ళ ద్వారాను తగినంత ప్రచారం కల్పించాలి”. 3. అక్టోబర్ 22,2015 వ తేదీ నాటి ‘భారతీయ రిజర్వు బ్యాంకు [గోల్డ్ ముద్రీకరణ (మోనిటైజేషన్) పథకం, 2015] – మాస్టర్ డైరెక్షన్ నం. డిబిఆర్. ఐబిడి.నం.45/23.67.003/2015-16 పై మార్పులతో కూర్చబడి నవీకరించబడింది. మీ విధేయులు (సౌరవ్ సిన్హా) |