<font face="Mangal" size="3">పసిడి నగదీకరణ పథకం, 2015 – వడ్డీ రేటు </font> - ఆర్బిఐ - Reserve Bank of India
పసిడి నగదీకరణ పథకం, 2015 – వడ్డీ రేటు
RBI/2015-16/220 నవంబర్ 3, 2015 అన్ని షెడ్యూల్డ్ బ్యాంకులు (గ్రామీణ బ్యాంకులు మినహా) అయ్యా/అమ్మా, పసిడి నగదీకరణ పథకం, 2015 – వడ్డీ రేటు పసిడి నగదీకరణ పథకంపై రిజర్వ్ బ్యాంక్ అక్టోబర్ 22, 2015 తేదీన జారీ చేసిన మాస్టర్ డైరెక్షన్ No.DBR.IBD.No.45/23.67.003/2015-16, దయచేసి చూడండి. 2. ఈ సందర్భంగా, పైన తెల్పిన మాస్టర్ డైరెక్షన్, సెక్షన్ 2. 2. 2. (iv) లో సూచించిన విధంగా, కేంద్ర ప్రభుత్వం, పసిడి నగదీకరణ పథకం క్రింద చేసిన మధ్యమ/దీర్ఘకాలిక ప్రభుత్వ డిపాజిట్ల పై (Medium and Long Term Government Deposit (MLTGD) వడ్డీ రేటు ఈ క్రింది విధంగా నిశ్చయించింది. i. మధ్యమకాల డిపాజిట్ పై – సాలీనా 2. 25% ii. దీర్ఘ కాల డిపాజిట్ పై – సాలీనా 2. 50% 3. GMS క్రింద, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సేకరణ, శుద్ధత పరీక్షా కేంద్రాల [Collection and Purity Testing Centres (CPTC s)], మరియు శుద్ధి కేంద్రాల (refiners) జాబితా, అనుబంధం లో ఇవ్వబడినది. రాజిందర్ కుమార్ అనుబంధం: పైన సూచించినది |