<font face="mangal" size="3">గోమతి నగరియా సహకారి బ్యాంక్ లిమిటెడ్, జౌన్‌ప - ఆర్బిఐ - Reserve Bank of India
గోమతి నగరియా సహకారి బ్యాంక్ లిమిటెడ్, జౌన్పూర్, ఉత్తర ప్రదేశ్ – జరిమానావిధింపు
తేదీ: 26/06/2019 గోమతి నగరియా సహకారి బ్యాంక్ లిమిటెడ్, జౌన్పూర్, ఉత్తర ప్రదేశ్ – జరిమానావిధింపు బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (సహకార సంఘాలకు వర్తించే విధంగా) సెక్షన్ 46(4) తో కలిపి, సెక్షన్ 47A(1)(c) క్రింద ప్రదానం చేసిన అధికారాలను వినియోగించుకొని, ఆదాయ గుర్తింపు, ఆస్తి వర్గీకరణ, ప్రొవిజనింగ్ మరియు ఇతర సంబంధిత విషయాలు - యుసిబిలు, అసురక్షిత అడ్వాన్సులపై గరిష్ట పరిమితిని మించడము, ‘మీ వినియోగదారుని తెలుసుకోండి’ (KYC)/యాంటీ మనీ లాండరింగ్ (AML) మార్గదర్శకాల పై భారతీయ రిజర్వు బ్యాంకు యొక్క సూచనలు/మార్గదర్శకాలు ఉల్లంఘించినందుకు, గోమతి నగరియా సహకారి బ్యాంక్ లిమిటెడ్, జౌన్పూర్, ఉత్తర ప్రదేశ్ ఫై, భారతీయ రిజర్వు బ్యాంకు ₹ 2,00,000 (రెండు లక్షల రూపాయలు మాత్రమే) జరిమానా విధించింది. భారతీయ రిజర్వు బ్యాంకు జారీచేసిన షో-కాజ్ నోటీసుకు ప్రతిస్పందనగా బ్యాంక్ ఒక లిఖిత పూర్వక సమాధానాన్ని సమర్పించింది. కేసులోని వాస్తవాలను, బ్యాంక్ ప్రత్యుత్తరం మరియు వ్యక్తిగత విచారణ లోని అంశాలను పరిశీలించిన తరువాత, ఈ విషయంలో బ్యాంకు యొక్క ఉల్లంఘన వాస్తవమని మరియు జరిమానా విధించదగినదిగా భారతీయ రిజర్వు బ్యాంకు నిర్ధారణకు వచ్చింది. యోగేష్ దయాళ్ పత్రికా ప్రకటన: 2018-2019/3045 |