RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S1

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78526128

గవర్నర్ ప్రకటన

మే 04, 2022

గవర్నర్ ప్రకటన

ఏప్రిల్ 08, 2022 నాటి నా ప్రకటనలో, ఐరోపాలో యుద్ధం కారణంగా ఏర్పడిన (టెక్టోనిక్) నిర్మాణక్రమ మార్పులను నేను ప్రస్తావించాను, ఇది ప్రపంచ వృద్ధికి మరియు ద్రవ్య విధానం యొక్క ప్రవర్తనకు కొత్త సవాళ్లను విసిరింది. యుద్ధం పురోగమిస్తున్నప్పుడు మరియు ఆంక్షలు మరియు ప్రతిఘటనలు తీవ్రతరం కావడంతో, వస్తువుల మరియు ఆర్థిక మార్కెట్లలో అస్థిరత, కొరత, సరఫరా అంతరాయాలు మరియు అత్యంత భయంకరంగా, స్థిరమైన మరియు పెరుగుతున్న ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు ప్రతి రోజూ గడిచేకొద్దీ మరింత తీవ్రమవుతున్నాయి. మూలధన ప్రవాహాలు(ఔట్-ఫ్లోలు) మరియు కరెన్సీ తరుగుదల మధ్య అభివృద్ధి చెందుతున్న దేశాలలో రుణ సంక్షోభం పెరుగుతోంది. ఇటీవలి GDP డేటా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ ఊపందుకుంటున్నదని సూచిస్తున్నది.

2. ఈ సవాళ్ల మధ్య, నేను నా ఏప్రిల్ ప్రకటనలో భారత ఆర్థిక వ్యవస్థ బ్రహ్మాండమైనదిగా పేర్కొన్నాను; కారణం దాని అంతర్లీన మూలాధారాల యొక్క స్వాభావిక బలం వల్ల మరియు వివేకవంతమైన ఇంకా సర్దుబాటు విధాన మిశ్రమ మద్దతు ఇవ్వడం మూలాన. మానిటరీ పాలసీని నిర్వహించడంలో, మేము ఎలాంటి రూల్‌బుక్‌కు కట్టుబడి ఉండకూడదనే మా సంకల్పాన్ని మరియు పూర్తి స్థాయి లో సంప్రదాయ మరియు సాంప్రదాయేతర సాధనాలను నిర్ణయాత్మకంగా ఉపయోగించేందుకు మా సంసిద్ధతను ప్రదర్శించాము. సర్దుబాటు ధోరణి ప్రదర్శించినప్పటికీ, ద్రవ్య విధానం అభివృద్ధికి మద్దతు ఇవ్వడానికి మరియు భౌగోళిక రాజకీయ సంక్షోభం యొక్క ప్రతికూల ప్రభావాలను తగ్గించడానికి అనుకూల ఆర్థిక పరిస్థితులను పెంపొందించడం కొనసాగిస్తున్నది. ఫలితంగా, భారత ఆర్థిక వ్యవస్థ ఇప్పటివరకు ఆర్ధికంగా దెబ్బ(షాక్)ను తట్టుకుంది. నిశ్చయంగా, కమోడిటీ ధరలు, సరఫరా అంతరాయాలు మరియు యుద్ధం కారణంగా ఉత్పన్నమయ్యే అధిక ద్రవ్యోల్బణంపై ఏకకాలంలో షాక్‌లు ఉన్నప్పటికీ మేము స్థూల-ఆర్థిక స్థిరత్వాన్ని కొనసాగించగలిగాము. ద్రవ్యోల్బణం యొక్క భవిష్యత్తు పథాన్ని పైకి మార్చగల అధిక ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను ఎదుర్కొన్నందున, ద్రవ్యోల్బణం లక్ష్యానికి అనుగుణంగా ఉండేలా చూసుకోవడానికి సర్దుబాటువసతిని ఉపసంహరించుకోవాలనే మా ఉద్దేశాన్ని మేము ప్రకటించాము. ఏప్రిల్ మానిటరీ పాలసీ స్టేట్‌మెంట్‌లో నేను చెప్పినట్లుగా, వృద్ధి వేగాన్ని సంరక్షించడానికి మరియు బలోపేతం చేయడానికి మా చర్యలు వేగంగాఅభివృద్ధి చెందుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఉంటాయి. ప్రసిద్ధ గ్రీకు తత్వవేత్త ఎపిక్టెటస్ మాటల్లో మా ప్రయాణం ఉత్తమంగా ప్రతిబింబిస్తుంది: “మీరు ఎదుర్కోవాల్సిన అన్ని పరీక్షలు మీ బలాన్ని మీకు తెలియజేస్తాయి. పట్టుదలతో ఉండండి… మరియు ఒక రోజు మీరు శాశ్వతంగా ఉండేదాన్ని సృష్టిస్తారు.”1

3. ఈ కష్ట సమయాల్లో మనం ప్రయాణిస్తున్నప్పుడు, కొత్త వాస్తవాలకు సున్నితంగా ఉండటం మరియు వాటిని మన ఆలోచనల్లో చేర్చుకోవడం చాలా అవసరం. ఏప్రిల్ 2022 కోసం తన వరల్డ్ ఎకనామిక్ ఔట్‌లుక్‌లో, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ - IMF) ఇలా పేర్కొంది: "యుద్ధం యొక్క ఆర్థిక ప్రభావాలు చాలా విస్తృతమైనవి - ఇవి భూకంపం యొక్క కేంద్రం నుండి ప్రసరించే భూకంప తరంగాల వంటివి - ప్రధానంగా వస్తువుల మార్కెట్లు, వాణిజ్యం మరియు ఆర్థిక వ్యవస్థలను ప్రభావితం చేస్తాయి.”2 అయినప్పటికీ, మన బలాలు మరియు బఫర్‌లు తగినంతగా ఉన్నప్పటికీ, భారతదేశం అంతర్జాతీయoగా అనుసంధానించబడిన లోకం నుండి ఒంటరిగా లేదని గుర్తించడం చాలా ముఖ్యం. ఏప్రిల్ పాలసీ ప్రకటనలో అంచనా వేసినట్లుగా, మార్చి 2022లో ప్రధాన CPI ద్రవ్యోల్బణం పెరిగింది. ఏప్రిల్ నెల ప్రచురణల అంచనా కూడా ద్రవ్యోల్బణం పెరుగుతుందనే. ఇంతేగాకుండా అనుషంగిక నష్టo ఏమిటంటే ద్రవ్యోల్బణo ఈ స్థాయిలలో ఎక్కువకాలం కొనసాగితే, ద్రవ్యోల్బణ అంచనాలు అణగదొక్కబడి స్వయంచాలితమయి మరియు అభివృద్ధికి మరియు ఆర్థిక స్థిరత్వానికి హానికరమవుతాయి. కాబట్టి, ఆర్థిక వ్యవస్థ యొక్క స్థితిస్థాపకతను పెంపొందించేటప్పుడు స్థూల ఆర్థిక మరియు విత్త పరంగా స్థిరత్వాన్ని కాపాడేందుకు అన్ని పాలసీ ఉపకరణాలను ఉపయోగించడానికి మనం సంసిద్ధతతో ఉండాలి. పరిస్థితి వేగవంతం గా ఉంది; మార్పు తీవ్రంగా ఉంటున్నది అందువల్ల వీటికి అనుగుణంగా మన చర్యలను నేర్పుగా కూర్చుకోవాలి.

ద్రవ్య విధాన కమిటీ యొక్క నిర్ణయాలు మరియు చర్చలు

4. ఈ నేపథ్యంలో, ద్రవ్య విధాన కమిటీ (MPC) మే 2 మరియు 4, 2022 తేదీలలో, పరిణామం చెందుతున్న ద్రవ్యోల్బణం-వృద్ధి గతిశీలత (డైనమిక్స్)ను మరియు ఏప్రిల్ 6-8, 2022 ఎంపీసీ- MPC సమావేశం తరువాయి కార్యకలాపాలను సమీక్షించి, ప్రభావాన్ని తిరిగి మూల్యాంకనం చేయడానికి అపరివృత్త(ఆఫ్-సైకిల్) సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. స్థూల ఆర్థిక పరిస్థితి మరియు ఔట్‌లుక్ యొక్క ఈ అంచనా ఆధారంగా, MPC పాలసీ రెపో రేటును 40 బేసిస్ పాయింట్లు పెంచి 4.40 శాతానికి తక్షణమే అమలు చేయడానికి ఏకగ్రీవంగా ఓటు వేసింది. పర్యవసానంగా, స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ (SDF) రేటు 4.15 శాతానికి సవరించబడింది; మరియు మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ (MSF) రేటు మరియు బ్యాంక్ రేటు 4.65 శాతానికి పెంచబడ్డాయి. వృద్ధికి తోడ్పాటునందిస్తూ ద్రవ్యోల్బణం లక్ష్యంలోపే ఉండేలా చూసుకోవడానికి సర్దుబాటువసతిని ఉపసంహరించుకోవడంపై దృష్టి సారిస్తూనే MPC ఏకగ్రీవంగా సర్దుబాటుతో ఉండాలని నిర్ణయించింది.

5. నేను ఇప్పుడు MPC యొక్క నిర్ణయం మరియు వైఖరి (స్టాండ్) వెనుక ఉన్న హేతుబద్ధతను వివరించాలనుకుంటున్నాను. ప్రపంచవ్యాప్తంగా, ద్రవ్యోల్బణం ఆందోళనకరంగా పెరుగుతోంది మరియు వేగంగా విస్తరిస్తోంది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో ద్రవ్యోల్బణాన్ని గత 3 నుండి 4 దశాబ్దాలలో గరిష్ట స్థాయికి పెంచుతున్నాయి, అదే సమయంలో ఎక్స్టర్నల్ డిమాండ్‌ను తగ్గించాయి. గ్లోబల్ క్రూడ్ ఆయిల్ ధరలు బ్యారెల్‌కు US$ 100 కంటే ఎక్కువగా ట్రేడవుతున్నాయి మరియు అస్థిరంగా ఉన్నాయి. గ్లోబల్ ఫుడ్ ధరలు మార్చిలో కొత్త రికార్డును తాకాయి మరియు అప్పటి నుండి మరింత పెరిగాయి. ఐరోపాలో యుద్ధం మరియు ప్రధాన ఉత్పత్తిదారుల ఎగుమతులపై ఆంక్షల కారణంగా భారతదేశానికి సంబంధించిన ద్రవ్యోల్బణ-సున్నితమైన వస్తువులు, వంట నూనె (ఎడిబుల్ ఆయిల్) వంటివి కొరతను ఎదుర్కొంటున్నాయి. ఎరువుల ధరలు మరియు ఇతర ఇన్‌పుట్ ఖర్చుల పెరుగుదల భారతదేశంలో ఆహార ధరలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతున్నది. అదనంగా, ప్రధాన అధునాతన ఆర్థిక వ్యవస్థలలో ద్రవ్య విధాన సాధారణీకరణ ఇప్పుడు గణనీయమైన ఊపందుకుంటున్నదని అంచనా వేయబడింది(రేటుపెంపు మరియు పరిమాణాత్మక సడలింపు మరియు పరిమాణాత్మక బిగుతును ప్రారంభించడం రెండింటి పరంగాను). ఈ పరిణామాలు భారతదేశంతో సహా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలపై హానికరమైన ప్రభావాలను కలిగించుతాయి. ఇట్లా ఉండగా, కోవిడ్-19 ఇన్‌ఫెక్షన్ మరియు ప్రధాన గ్లోబల్ ప్రొడక్షన్ సెంటర్‌లలో లాక్‌డౌన్‌లు గ్లోబల్ సప్లై చైన్ అంతరాయాలకు తోడ్పడతాయని, అదే సమయంలో వృద్ధి మందగించవచ్చని భావిస్తున్నారు. వాస్తవానికి, ఈ క్యాలెండర్ సంవత్సరానికి సంబంధించిన ప్రపంచ వృద్ధి అంచనాలు 100 బేసిస్ పాయింట్ల దిగువకు సవరించబడ్డాయి. ఈ డైనమిక్స్ ఏప్రిల్ 2022 కొరకు MPC యొక్క తీర్మానంలో నిర్దేశించిన భారతదేశ ద్రవ్యోల్బణ పథానికి తలకిందులయ్యే ప్రమాదాలను కలిగిస్తున్నది.

6. ఇంకా, ఏప్రిల్‌లో ఆశించిన రీతిలో దేశీయ ఆర్థిక కార్యకలాపాలు విస్తృతంగా పురోగమిస్తున్నాయని MPC పేర్కొన్నది. అణిగి యున్నడిమాండ్ నుండి కాంటాక్ట్-ఇంటెన్సివ్ సేవలు ప్రయోజనం పొందుతున్నాయి మరియు పెట్టుబడి కార్యకలాపాలు ఊపందుకున్నాయని కొన్ని సంకేతాలు చూపెడుతున్నాయి. ఇంకా, MPC ద్రవ్యోల్బణం దృక్పథానికి సరైన మరియు సమయానుకూల ప్రతిస్పందన అవసరమని నిర్ణయించింది. ఆర్థిక వ్యవస్థపై సరఫరా-వైపు షాక్‌ల యొక్క రెండవ రౌండ్ ప్రభావం పరిమితంగా మరియు దీర్ఘకాలిక ద్రవ్యోల్బణం మధ్యస్థంగా ఉండేలా నిర్ధారించడానికి దృఢమైన మరియు క్రమాంకనం చేసిన చర్యల ద్వారా ఇది సాధ్యపడుతుంది. MPC దృష్టిలో, ఆర్థిక మార్కెట్లలో పెరుగుతున్న అస్థిరత మధ్య, ఈ సమయంలో స్థిరమైన ద్రవ్య విధాన ప్రతిస్పందన స్థూల-ఆర్థిక స్థిరత్వాన్ని కొనసాగించడంలో సహాయపడుతుంది. దీని ప్రకారం, MPC ఈరోజు జరిగిన సమావేశంలో పాలసీ రెపో రేటును 40 బేసిస్ పాయింట్లు పెంచాలని నిర్ణయించింది; ద్రవ్యోల్బణం లక్ష్యంలోనే ఉండేలా చూసుకోవడం కోసం సర్దుబాటువసతి ఉపసంహరణపై దృష్టి సారించి, మరింత వృద్ధికి తోడ్పాటునందిస్తూ సర్దుబాటుఅనుకూలతను కొనసాగించాలని నిర్ణయించింది.

అభివృద్ధి మరియు ద్రవ్యోల్బణం అంచనా

అభివృద్ధి

7. ఈ విధమైన అత్యంత ఒత్తిడితో కూడిన ప్రపంచ వాతావరణంలో, దేశీయ స్థూల ఆర్థిక మరియు విత్తీయ పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవడం ఉపయోగకరంగా ఉంటుంది. ఓమిక్రాన్ వేవ్ క్షీణించడంతో దేశీయ ఆర్థిక కార్యకలాపాలకు తిరిగి ఊతం రావడం అన్ని రంగాలలోను కనిపిస్తున్నది. సంప్రదింపు-ఇంటెన్సివ్ సేవలు మరియు పెరుగుతున్న విచక్షణ వ్యయం కారణంగా ప్రైవేట్ వినియోగం మళ్లీ పెరుగుతోంది. 2022 సంవత్సరానికి సాధారణ నైరుతి రుతుపవనాల అంచనా, వరుసగా నాల్గవ సంవత్సరం వ్యవసాయ అవకాశాలకు మంచి సూచన మరియు గ్రామీణ వినియోగానికి మద్దతును ఇస్తున్నది. పెట్టుబడి పధం విషయంలో ముందస్తు రికవరీ సంకేతాలు బాగా ఉన్నాయి. అవేమిటంటే, మూలధన వస్తువుల దిగుమతి మరియు ఉత్పత్తి; అనుకూలమైన ఆర్థిక పరిస్థితుల మద్దతుతో పెరిగిన సామర్థ్య వినియోగం; మరియు బలమైన కార్పొరేట్ బ్యాలెన్స్ షీట్‌ల వంటి అధిక ఫ్రీక్వెన్సీ సూచికలలో ప్రతిబింబిస్తున్నాయి. ఎగుమతి వృద్ధి చెప్పుకోదగ్గ రీతిలో ఉంది, అయితే చమురుయేతర నాన్-గోల్డ్ దిగుమతులలో అధిక వృద్ధి కొనసాగడం దేశీయ గిరాకీ లో మన్నికైన రికవరీని ప్రతిబింబిస్తున్నది.

8. దేశీయ ఆర్థిక కార్యకలాపాల నిర్వాహకాలు బలపడుతున్నప్పటికీ, సుదీర్ఘమైన మరియు తీవ్రతరం చేసే భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల రూపంలో గ్లోబల్ స్పిల్‌ఓవర్‌లు; పెరిగిన వస్తువుల ధరలు; కొన్ని ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో COVID-19 సంబంధిత లాక్‌డౌన్‌లు లేదా పరిమితులు; ఎక్స్టర్నల్ డిమాండ్ పడిపోవడం; మరియు అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలలో ద్రవ్య విధానం యొక్క సాధారణీకరణ కారణంగా ప్రపంచ ఆర్థిక పరిస్థితులు కఠినతరం కావడం వల్ల, ఎదురుగాలిని ఎదుర్కొంటున్నాయి. ఈ నష్టభయాలు ఏప్రిల్ 2022 స్టేట్‌మెంట్‌లో ఊహించిన విధంగా అభివృద్ధి చెందుతున్నాయి మరియు అలాగే స్థిరంగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి.

ద్రవ్యోల్బణం

9. మార్చి 2022లో ప్రధాన CPI ద్రవ్యోల్బణం 7 శాతానికి పెరిగింది, ప్రత్యేకించి, అసాధారణ ప్రపంచ ఆహార ధరల నుండి ప్రతికూల స్పిల్‌ఓవర్ ప్రభావాల కారణంగా ఆహార ద్రవ్యోల్బణం నడపబడింది. ఆహార సంబంధ పన్నెండు సబ్-గ్రూప్ లలో తొమ్మిది సబ్-గ్రూప్ లు మార్చిలో ద్రవ్యోల్బణ పెరుగుదలను నమోదు చేశాయి. ఏప్రిల్‌లో అధిక ఫ్రీక్వెన్సీ ధర సూచికలు ఆహార ధరలు ఒత్తిడిలో ఉన్నాయని సూచిస్తున్నాయి. అలాగే, మార్చి ద్వితీయ పక్షంలో ప్రారంభమైన పెట్రోలియ ఉత్పత్తుల దేశీయ పంపు ధరల పెరుగుదల ప్రత్యక్ష ప్రభావం ప్రధాన ద్రవ్యోల్బణం యొక్క ప్రచురణ (ప్రింట్‌ల) లో ప్రతిబింబిస్తున్నది మరియ ఏప్రిల్‌ నెలలో మరింత పెరుగుతుందని అంచనా.

10. ముందువైపుకు చూచినట్లయితే, ఆహార ద్రవ్యోల్బణం ఒత్తిళ్లు కొనసాగే అవకాశం ఉంది. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (FAO) మరియు ప్రపంచ బ్యాంక్ ఆహార ధరల సూచికలు మార్చిలో చారిత్రాత్మక గరిష్ట స్థాయిని తాకాయి మరియు అత్యధికంగానే ఉన్నాయి. గ్లోబల్ గా గోధుమల కొరత కారణంగా దేశీయ సరఫరాలు సౌకర్యవంతంగా ఉన్నప్పటికీ దేశీయ ధరలపై వాటి ప్రభావం చూపుతోంది. ప్రధాన ఉత్పత్తి దేశాలచే ఎగుమతి ఆంక్షలు మరియు యుద్ధం కారణంగా పొద్దుతిరుగుడు నూనె ఉత్పత్తిని తగ్గించడం వలన ఆహార చమురు ధరలు మరింత పెరగవచ్చు. ఆహార ధరల పెరుగుదల పౌల్ట్రీ, పాలు మరియు పాల ఉత్పత్తుల ధరల పెరుగుదలలోనూ ప్రతిబింబిస్తుంది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు బ్యారెల్‌కు US$ 100 కంటే ఎక్కువగానే ఉన్నాయి; ఈ పరిస్థితి దేశీయ చమురు పంపులవద్ద ధరలను పెంచుతోంది. అసాధారణ ఇన్‌పుట్ వ్యయ ఒత్తిళ్ల వల్ల ప్రాసెస్ చేయబడిన ఆహారం, ఆహారేతర తయారీ ఉత్పత్తులు మరియు సేవల యొక్క ధరల ద్విగుణీకృతమునకు దోహదంచేసే ప్రమాదాలు ఇప్పుడు గతంలో కంటే బలంగా ఉన్నాయి. మార్జిన్లు చాలా తక్కువగాగనుక ఉంటే, ఆ పరిస్థితి కార్పొరేట్ సంస్థల ధర నిర్ధారణ శక్తిని బలోపేతం చేస్తుంది. మొత్తానికి, ప్రతికూల గ్లోబల్ షాక్ ల నిలకడ తో జతకట్టి ద్రవ్యోల్బణ ప్రేరణలు బలపడడం ఏప్రిల్ MPC రిజల్యూషన్‌లో అంచనా వేయబడిన ద్రవ్యోల్బణ పథానికి నష్టభయం పెంచేందుకు దోహదపడుతున్నాయి.

11. ఈ పరిస్థితులలో, సర్దుబాటును ఉపసంహరించుకోవడంపై ద్రవ్య విధానo దృష్టి పెట్టడం అవసరం. ఇక్కడ ఒక విషయం గుర్తుచేసుకోవాలి. మహమ్మారికి ప్రతిస్పందనగా, మానిటరీ పాలసీ తన విధానచర్యలను అత్యంత సర్దుబాటు (అల్ట్రా-అకమోడేటివ్) మోడ్‌లోకి మార్చిందని, మార్చి 27, 2020 న పాలసీ రెపో రేటులో 75 బేసిస్ పాయింట్ల మేర కోత విధించబడిందని, ఆ తర్వాత మే 22, 2020న మరొక కోత విధించబడి 40 బేసిస్ పాయింట్లు తగ్గాయన్న విషయాన్ని గుర్తుచేసుకోవాలి. దీని ప్రకారం, ఏప్రిల్ 2022 న షెడ్యూల్ చేయబడిన పాలసీ వైఖరి యొక్క ఉపసంహరణ ప్రకటనను పరిగణనలోకి తీసుకొని పాలసీ రెపో రేటును 40 బేసిస్ పాయింట్ల తో’ 4.40 శాతానికి పెంచుతూ MPC యొక్క నేటి నిర్ణయం మే 22, 2020 నాటి రేట్ చర్య యొక్క రివర్సల్‌గా పరిగణించవచ్చు.

లిక్విడిటీ మరియు ఫైనాన్షియల్ మార్కెట్ పరిస్థితులు

12. ఏప్రిల్‌లో, పాలసీ రెపో రేటు చుట్టూ సౌష్టవమైన LAF కారిడార్‌ను పునరుద్ధరించడం మరియు స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ (SDF) పరిచయంతో సహా ద్రవ్య విధాన వైఖరిలో మార్పుకు అనుగుణంగా అనేక ద్రవ్య నిర్వహణ చర్యలు చేపట్టబడ్డాయి. ఈ చర్యలు వృద్ధి లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని ధరల స్థిరత్వ కొనసాగింపు ప్రాధాన్యతా లక్ష్యంతో పనిచేస్తాయి. ద్రవ్యోల్బణం నిలకడ విచ్ఛిన్నమయ్యే విధంగా మరియు ద్రవ్యోల్బణం అంచనాలను తిరిగి పునఃస్థాపించే వాతావరణాన్ని ద్రవ్య విధానం సృష్టించాలి. ఆర్థిక కార్యకలాపాలు పునఃప్రారంభించబడి, మహమ్మారి పూర్వ స్థాయికి మించి కదులుతున్నప్పుడు, మహమ్మారి క్షీణత మరియు స్థిరమైన విస్తృత స్థావరంతో ప్రాధాన్యతల యొక్క ఈ క్రమాన్ని మార్చడానికి తగిన ప్రధానుకూలత(హెడ్‌రూమ్) అందుబాటులోకి వస్తున్నది.

13. లిక్విడిటీ పరిస్థితులను, మిగిలిన ఆర్థిక వ్యవస్థలకు పూర్తి గానూ మరియు సమర్ధవంతంగా ప్రసారం చేయడానికి, విధానపర చర్యలు మరియు వైఖరికి అనుగుణంగా వాటిని సవరించాలి. ఏప్రిల్ లో పాలసీ ప్రకటించినప్పటి నుండి, బ్యాంకింగ్ వ్యవస్థ లో లిక్విడిటీ సౌకర్యవంతంగా ఉంది. బ్యాంకింగ్ వ్యవస్థలో సగటు మిగులు లిక్విడిటీ - SDF మరియు వేరియబుల్ రేట్ రివర్స్ రెపో (VRRR) వేలం ద్వారా మొత్తం శోషణలో ఇది ప్రతిబింబిస్తుంది - ఏప్రిల్ 8-29, 2022 మధ్య 7.5 లక్షల కోట్లుగా ఉంది. SDF (ఏప్రిల్ 8-29, 2022 మధ్య కాలంలో సగటున 2.0 లక్షల కోట్లు) కింద ఉంచబడిన రోజువారీ మిగులు నిధుల రూపంలో అధిక లిక్విడిటీ కారణంగా వెయిటెడ్ యావరేజ్ కాల్ మనీ రేట్ (WACR) - ద్రవ్య విధానం యొక్క నిర్వహణ లక్ష్యం – SDF రేటు కన్నా దిగువకు పడిపోయిందిద. 14-రోజుల మరియు 28-రోజుల VRRR వేలం యొక్క బిడ్-కవర్ నిష్పత్తులు అలాగే ఏప్రిల్ 26న జరిగిన USD/INR యొక్క అమ్మకం-కొనుగోలు స్వాప్ వేలం కూడా సిస్టమ్ - స్థాయి లిక్విడిటీ పుష్కలంగా కలిగి ఉన్నట్లు బ్యాంకుల అనుకూల ప్రతిస్పందనల వల్ల తెలుస్తున్నది. అందువల్ల, సర్దుబాటువసతి ఉపసంహరణ వైఖరి ని దృష్టిలో ఉంచుకుని మరియు పలుసంవత్సర కాల వ్యవధిలో లిక్విడిటీని క్రమంగా ఉపసంహరించుకునే ముందస్తు ప్రకటనకు అనుగుణంగా, టార్గెట్ చేరుకోవడానికి నగదు నిల్వల నిష్పత్తి (CRR) ని 50 బేసిస్ పాయింట్లతో నెట్ డిమాండ్ మరియు టైం లయబిలిటీల పై (NDTL) 4.5 శాతానికి, మే 21, 2022 తేదీ నుండి ప్రారంభమయ్యే పక్షం నుండి అమలులోకి వచ్చే విధంగా పెంచాలని నిర్ణయించబడింది. CRR లో ఈ పెరుగుదల ద్వారా సంబంధిత లిక్విడిటీ శోషణ మొత్తం 87,000 కోట్లకు చేరుకుంటుంది.

14. ద్రవ్యోల్బణం నిరంతరం పెరగడం వల్ల పొదుపు, పెట్టుబడి, పోటీతత్వం మరియు ఉత్పత్తి వృద్ధి అనివార్యంగా దెబ్బతింటాయి. ఇది వారి కొనుగోలు శక్తిని తగ్గించడం ద్వారా జనాభాలోని పేద వర్గాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేసింది. అందువల్ల, ద్రవ్యోల్బణాన్ని తగ్గించడం మరియు ద్రవ్యోల్బణ అంచనాలను స్థిరీకరించడం లక్ష్యంగా ఈనాటి మా ద్రవ్య విధాన చర్యలు ఆర్థిక వ్యవస్థ యొక్క మధ్యకాలిక వృద్ధి అవకాశాలను బలోపేతం చేస్తాయని మరియు ఏకీకృతం చేస్తాయని నేను నొక్కివక్కాణించాలనుకుంటున్నాను. అవుట్‌పుట్‌పై అధిక వడ్డీ రేట్ల యొక్క సంభావ్య సమీప-కాల ప్రభావం గురించి కూడామనం గుర్తుంచుకోవాలి. కాబట్టి, మా చర్యలు క్రమాంకనం చేయబడతాయి. ద్రవ్యవిధానం సర్దుబాటువసతి వైఖరిలో ఉన్నందున; ద్రవ్యోల్బణం-వృద్ధి గతిశీలతను పరిగణనలోకి తీసుకొని మహమ్మారి-సంబంధిత అసాధారణ సర్దుబాటును జాగ్రతతో క్రమాంకనం చేసి, ఉపసంహరణపై దృష్టి పెట్టడమే మా విధానం అని నేను మరింత నొక్కివక్కాణించాలనుకుంటున్నాను. ఋణ అవసరాలు మొదలయ్యాయి, ఇంక అభివృద్ధికి తోడ్పడటానికి ఆర్థిక వ్యవస్థ యొక్క ఉత్పాదక అవసరాలను తీర్చడానికి వ్యవస్థలో తగినంత లిక్విడిటీని RBI తప్పక నిర్ధారిస్తుంది అని పునరుద్ఘాటించబడింది.

విదేశీ రంగం

15. భారతదేశ ఎక్స్టర్నల్ రంగం బలీయమైన ప్రపంచ పరిమితుల మధ్య స్థితిస్థాపకంగా ఉంది. ఏప్రిల్ 2022లో భారతదేశ సరుకుల ఎగుమతులు బలంగా ఉన్నాయని మరియు మార్చి 2022లో సేవల ఎగుమతులు కొత్త గరిష్ట స్థాయికి చేరుకున్నాయని తాత్కాలిక(ప్రోవిజనల్) డేటా వల్ల తెలుస్తున్నది. భౌగోళిక రాజకీయ పరిస్థితులు మరియు ఇటీవలి వాణిజ్య ఒప్పందాలు సంభావ్య మార్కెట్ అవకాశాలను తెరిచాయి. ప్రధాన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) కంపెనీల ద్వారా రాబళ్ళు బలపడి 2022-23 సంవత్సరంలో లో మొత్తంగా విదేశీ రంగంయొక్క అవకాశాలను మెరుగుపరుస్తాయి. అధిక కమోడిటీ ధరల కారణంగా వాణిజ్య నిబంధనలు జటిలమై 2022-23లో కరెంట్ ఖాతా లోటుపై ప్రభావం చూపవచ్చు, కానీ సజావు వాణిజ్య వృద్ధి మూలంగా లోటు పూడుతుందని భావిస్తున్నారు. ఇటీవల కొంత మందగమనం ఉన్నప్పటికీ, నికర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రవాహం బలంగానే ఉంది. విదేశీ వాణిజ్య రుణాలు వంటి దీర్ఘకాలిక ప్రవాహాలు కూడా స్థిరంగా ఉన్నాయి. నికర ఫార్వర్డ్ ఆస్తులు బలమైన బ్యాకప్ అందించడంతో భారతదేశ విదేశీ మారక ద్రవ్య నిల్వలు చెప్పుకోదగ్గ రీతిలో ఉన్నాయి. GDP తో విదేశీ రుణ నిష్పత్తి 20 శాతం వద్ద, తక్కువలోనే ఉంది.

ముగింపు వ్యాఖ్యలు

16. గత రెండు సంవత్సరాలుగా మహమ్మారి మరి ఇప్పుడు యుద్ధం ద్వారా ఎదురయ్యే నిరుత్సాహపరిచే సవాళ్లకు వ్యతిరేకంగా మా దృఢమైన పోరాటం కోనసాగుతున్నది. ఫైనాన్షియల్ సిస్టం ను మరియు ఆర్థికవ్యవస్థను షాక్‌ల సుడిగుండం నుండి రక్షించడానికి మేము ఈ సవాళ్లను హుందాగా స్వీకరించాము. మనం ఇప్పుడు మరోసారి సంక్లిష్ట మలుపు తిరిగాం. మేము, RBI వద్ద, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి మరియు వృద్ధిని ప్రోత్సహించడానికి నిబద్ధతకు కట్టుబడి ఉన్నాము. భారత ఆర్థిక వ్యవస్థను స్థిరమైన మరియు సమ్మిళిత వృద్ధి మార్గంలో దృఢంగా ఉంచడానికి ద్రవ్యోల్బణాన్ని నియంత్రించాలి. మొత్తం స్థూల ఆర్థిక మరియు ఆర్థిక స్థిరత్వానికి అలాగే స్థిరమైన వృద్ధికి; ధర స్థిరత్వాన్ని కొనసాగించడానికి తగిన సహకారం మా ప్రయత్నాల నుండి తప్పక వస్తుంది.

17. అనేక తుఫానులు ఒకేసారి వచ్చాయి కాబట్టి, ఈరోజు మన చర్యలు జీవనావ ను స్థిరంగా ఉంచడానికి ముఖ్యమైన అడుగులు గా గ్రహించాలి. మేము నిరంతరం, లభ్యమవుతున్న డేటా మరియు సమాచారం తో పరిస్థితులను మరియు అవకాశాలను తిరిగి మూల్యాంకనం చేయడానికి అప్రమత్తంగా ఉంటాం. మేము మా విధానంలో ముందుచూపుతోను మరియు మార్పులకు అనుగుణంగా మసలుకుంటాము. సవాళ్లు అనేకం ఉన్నప్పటికీ, మన ఆర్థిక వ్యవస్థ యొక్క పునాది అంశాలు పటిష్టంగా ఉన్నాయని మరియు ప్రపంచ విషయాలనుండి ఉత్పన్నాలను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉన్నామని తెలుసుకోవడం భరోసానిస్తుంది. భారతదేశంలో మహమ్మారి యొక్క స్థూల ఆర్థిక నిర్వహణ బలమైన పునరుద్ధరణకు దారితీసిందని మరియు ప్రస్తుత ఎక్స్టర్నల్ షాక్‌ను ఎదుర్కోవడానికి దేశం మoచి స్థితిలో ఉందని IMF ఇటీవల పేర్కొంది.3 నేను ఇంతకు ముందు చెప్పినదాన్ని పునరావృతం చేస్తాను - నేను ఎల్లప్పుడూ ఆశావాదినే. RBI లోని నా సహోద్యోగులు, మరియు నేను ఎంచుకున్న మార్గం మనల్ని మంచి మరియు ప్రకాశవంతమైన రేపటికి నడిపిస్తుందని, నేను విశ్వసిస్తున్నాను. మహాత్మా గాంధీ చెప్పినట్లుగా: "నా వంతు గా నిరుత్సాహాలు, అత్యంత అంధకార పరిస్థితులు నాకున్నాయి. కానీ విశ్వాస చిత్తం తో చెప్పగలను నా ధృఢమైన విశ్వాసం ఈ ప్రతి వొక్క కష్టాన్నిఅధిగమించిందని నేను చెప్పగలను.” 4

ధన్యవాదాలు. సురక్షితంగా ఉండండి. ఆరోగ్యంగా ఉండవలసినది. నమస్కారం.

(యోగేష్ దయాల్) 
చీఫ్ జనరల్ మేనేజర్

పత్రికా ప్రకటన: 2022-2023/153


1 మూలం: ఎపిక్టెటస్, గ్రీక్ ఫిలాసఫర్ 55-135 AD [ది ఆర్ట్ ఆఫ్ లివింగ్]

2 వరల్డ్ ఎకనామిక్ ఔట్‌లుక్, ఏప్రిల్ 2022, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్.

3 https://www.thehindu.com/news/national/india-in-much-better-place-to-face-ukrainian-crisis-imf-official/article65340653.ece

4 Young India, 20-12-1928, p. 420

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?