RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S3

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78528507

గవర్నర్ యొక్క ప్రకటన – ఆగస్ట్ 06, 2021

ఆగస్ట్ 06, 2021

గవర్నర్ యొక్క ప్రకటన – ఆగస్ట్ 06, 2021

ద్రవ్య విధాన కమిటీ (ఎంపిసి) 4, 5 మరియు ఆగస్ట్ 6, 2021 తేదీలలో సమావేశమైంది. దేశీయ మరియు ప్రపంచ స్థూల ఆర్ధిక మరియు ఫైనాన్షియల్ పరిణామాలు మరియు దృక్పథం ఆధారంగా పాలసీ రెపో రేటును 4 శాతం వద్ద మారకుండా ఉంచడానికి ఎంపిసి(MPC) ఏకగ్రీవంగా ఓటు వేసింది. ఇంకా, రాబోయేకాలంలో ద్రవ్యోల్బణం ను అనుకున్న లక్ష్యం లో ఉంచేందుకు, ఆర్ధిక పరిస్థితి మీద కోవిడ్-19 యొక్క ప్రభావం ను పరిమితం చేసేందుకు, వృద్ధిని ప్రేరేపించి మన్నికైన స్థిరత్వాన్ని తీసుకొచ్చే వరకు అవసరమైనంతమేరకు సర్దుబాటు విధాన వైఖరి నే కొనసాగించాలని కూడా ఎంపిసి(MPC), 5 నుండి 1 మెజారిటీతో, నిర్ణయించింది. మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ (ఎంఎస్‌ఎఫ్) రేటు మరియు బ్యాంకు రేటు 4.25 శాతంలో మార్పులేదు. రివర్స్ రెపో రేటు 3.35 శాతంలో మార్పులేదు.

2. జూన్ 2021 లో MPC సమావేశ సమయంలో కంటే మనం ఈరోజున, చాలా మెరుగైన స్థితిలో ఉన్నాము. మహమ్మారి యొక్క రెండవ వేవ్ తగ్గుతున్నందువల్ల, కట్టడి సడలుతున్నది మరియు నెమ్మదిగా పూర్వపు స్థితికి చేరువ అవుతున్నాము, టీకా తయారీ మరియు పరిపాలన క్రమంగా మెరుగుపడుతున్నది. మన తక్షణ కర్తవ్యం ఉదాసీనత ను విడిచి మూడవ తరంగం (వేవ్) సంభావ్యతకు వ్యతిరేకంగా అప్రమత్తంగా ఉండడమేకాక, ముఖ్యంగా దేశపు కొన్ని ప్రాంతాలలో ప్రబలుతున్న అంటువ్యాధులు పెరుగుతున్ననేపధ్యంలో తగు జాగరూకత వహించడమే.

3. మా చర్యలు, ప్రభుత్వ చర్యలతో పాటుగా, ఆర్థిక వ్యవస్థను స్వస్థoగా మరియు స్థిరంగా ఉంచేందుకు, ఒత్తిడిని తగ్గించడం మరియు వృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడం లక్ష్యంగా ఉన్నాయి. మార్టిన్ లూధర్ కింగ్ జూనియర్1 యొక్క రెండు ఉద్దారణలను ఒకసారి మననం చేయడం ద్వారా మా విధానాన్ని చక్కగా వర్ణించవచ్చు “కానీ నాకు తెలుసు, ఏదోఒకవిధంగా, చీకటిగాఉన్నప్పుడు మాత్రమే మీరు తగినన్ని నక్షత్రాలను చూడగలరని. అందువల్ల ముందుకు సాగిపో. ఏదీ నిన్ను నిదానించ లేదు. ముందుకే పద.......”

4. MPC నిర్ణయo విషయంలో అంతర్లీనంగా ఉన్న హేతుబద్ధతను నిర్దేశించడం, నేను ముందు మొదలిడతాను. ద్రవ్యోల్బణం ఇటీవల రెండు సార్లు లక్ష్యం యొక్క టార్గెట్ బ్యాండు పైకిఎదిగిన నేపద్యంలో MPC కలుసుకుంది. జూన్‌లో MPC అంచనాల మేరకు ఆర్థిక కార్యకలాపాలు విస్తృతంగా అభివృద్ధి చెందాయని మరియు రెండవ వేవ్ ఎదురుదెబ్బ నుండి ఆర్థిక వ్యవస్థ కోలుకుంటుందని MPC గుర్తించింది. రుతుపవనాలు స్వల్ప విరామం తర్వాత తిరిగి పుంజుకున్నాయి మరియు ఖరీఫ్ లో విత్తనాలు చల్లడం ఊపందుకున్నాయి. కొన్ని హై-ఫ్రీక్వెన్సీ సూచికలు కూడా జూన్-జూలైలో మళ్లీ పైకి చూస్తున్నాయి. మా అంచనా ఏంటంటే వ్యాక్సినేషణ్ ప్రక్రియ లో పురోగతి, నిరంతరo తగినంత పాలసీ మద్దతు, ఉల్లాసమైన ఎగుమతులు, కోవిడ్ సంబంధిత ప్రోటోకాల్‌ల అనుసరణలు మరియు అనుకూల ద్రవ్య మరియు ఫైనాన్షియల్ పరిస్థితులతో కార్యకలాపాలు ఇక వేగవంతం అయ్యే అవకాశం ఉంది.

5. ప్రతికూల సరఫరా షాక్‌లు, పెరిగిన లాజిస్టిక్స్ ఖర్చులు, పెరిగిన గ్లోబల్ కమాడిటీ ధరలు మరియు దేశీయ ఇంధన పన్నుల కాంబినేషన్ ను ప్రతిబింబించుతూ వినియోగదారుల ధరల ద్రవ్యోల్బణం మే నెలలో పైకెగసి అందరిని ఆశ్చర్యపరిచింది. జూన్‌లో, హెడ్‌లైన్ ద్రవ్యోల్బణం ఎగువ టాలరెన్స్ స్థాయికి మించి ఉంది, కానీ ధరల కదలికలు పెద్దగాలేవు. అలాగే, ప్రధాన ద్రవ్యోల్బణం మేలో గరిష్ట స్థాయి నుండి మెత్తబడింది. అంతర్జాతీయ ముడి చమురు ధరలు అస్థిరంగా ఉన్నాయి; OPEC ప్లస్ ఒప్పందం మూలంగా ధరలలో ఎటువంటి మోడరేషన్ జరిగినా, ద్రవ్యోల్బణ ఒత్తిడిని తగ్గించడానికి దోహదం చేస్తుంది.

6. మొత్తం గిరాకీ పరంగా దృక్పథం మెరుగుపడుతోంది, కాని అంతర్లీనoగా పరిస్థితులు ఇప్పటికీ బలహీనంగా ఉన్నాయి. మొత్తం సరఫరా కూడా ప్రీ-పాండమిక్ స్థాయిల కంటే వెనుకబడి ఉంది. సరఫరా పరిమితులను తగ్గించడానికి అనేక చర్యలు తీసుకోబడినప్పటికీ, ఆర్థిక వ్యవస్థలోని అనేక రంగాలలో సరఫరా-డిమాండ్ సమతుల్యతను పునరుద్ధరించడానికి మరిన్ని చేయాల్సి ఉంది. ఇటీవలి ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు ఆందోళన కలిగిస్తున్నాయి; కానీ ప్రస్తుత అంచనా ప్రకారం ఈ ఒత్తిళ్లు తాత్కాలికమైనవి మరియు ప్రతికూల సరఫరా కారకాల ద్వారా ఇవి లాగబడుతున్నాయి. మహమ్మారి నుండి ఉత్పన్నమయ్యే అసాధారణ పరిస్థితుల మధ్యలో మనం ఉన్నాము. మహమ్మారి సమయంలో ద్రవ్య విధానం యొక్క పాలసీ వృద్ధిని పెంపొందించి మరియు పునరుజ్జీవనం కలుగచేసే అనుకూలమైన ఆర్థిక పరిస్థితులను నిర్వహించడానికి రూపొందించబడింది. కాబట్టి, ఈ దశలో నవజనిత మరియు ఊగిసలాడే రికవరీని పెంపొందించడానికి అన్ని వైపుల నుండి నిరంతర పాలసీ - విత్తీయ, ద్రవ్య మరియు సెక్టోరల్ - మద్దతు అవసరం. ధృడమైన మరియు స్థిరమైన వృద్ధికి ఊతమిచ్చేందుకు, MPC ద్రవ్యోల్బణ అంచనాలను దృష్టిలోయుంచుకుని, కార్యక్రమ నిర్వాహ సంధానకర్త గా తన సంకల్పానికి కట్టుబడి ఉంది. దీని ప్రకారం, MPC ప్రస్తుతం ఉన్న రెపో రేటును 4 శాతం వద్ద ఉంచాలని మరియు అవసరమైనంతమేరకు సర్దుబాటు విధాన వైఖరి నే కొనసాగించాలని నిర్ణయించింది.

సంవృద్ది మరియు ద్రవ్యోల్బణం ల అంచనా

దేశీయంగా అభివృద్ధి

7. వైరస్ యొక్క రెండవ వేవ్ క్షీణించడం మరియు ఆర్థిక వ్యవస్థ దశలవారీగా తిరిగి తెరవబడడంతో దేశీయ ఆర్థిక కార్యకలాపాలు సాధారణీకరించడం ప్రారంభించాయి. అధిక-ఫ్రీక్వెన్సీ సూచికలు అన్నీ - (i) వినియోగం (ప్రైవేట్ మరియు ప్రభుత్వ వినియోగం రెండూ), (ii) పెట్టుబడి మరియు (iii) బాహ్య డిమాండ్ - తిరిగి గాడిలో పడే మార్గంలో ఉండడాన్ని సూచిస్తున్నాయి. ఈ మూడు అంశాలలో ప్రతిదాని గురించి నేను వివరించదలచాను. ఆంక్షలను మరింత సడలించడం మరియు టీకాల యొక్క కవరేజీని పెంచడం వల్ల ప్రయాణం, పర్యాటకం మరియు వినోద కార్యకలాపాలతో సహా, వస్తువులు మరియు సేవలపై ప్రైవేట్ వ్యయాన్ని బాగా పెంచేందుకు మరియు మొత్తం గిరాకీ లో విస్తృత-ఆధారిత పునరుద్ధరణను ప్రోత్సహించేందుకు అవకాశం బాగా ఉంది. వ్యవసాయం మరియు గ్రామీణ గిరాకీ యొక్క ధృఢమైన దృక్పథం, ప్రైవేట్ వినియోగానికి మద్దతునిస్తూనే ఉంటుంది. తయారీ మరియు నాన్-కాంటాక్ట్ ఇంటెన్సివ్ సర్వీసెస్ రికవరీ, మరుగుపడ్డ గిరాకీ విడుదల మరియు టీకా వేగం వంటి వాటితో పట్టణ డిమాండ్ వేగవంతం అయ్యే అవకాశం ఉంది. ఇది అనేక హై-ఫ్రీక్వెన్సీ ఇండికేటర్ల లోని ప్రోత్సాహకరమైన కదలికల ద్వారా ధృవీకరించబడింది, అవి ఏమిటంటే, ఆటోమొబైల్స్ రిజిస్ట్రేషన్లు, విద్యుత్ వినియోగం, చమురు-బంగారేతర దిగుమతులు, మన్నికైన కన్స్యూమర్ వస్తువుల వినియోగం మరియు అర్బన్ వర్కర్లను కూలికి బెట్టుకోవడం పెరగడం మొదలైనవి. రిజర్వు బ్యాంకు వారి వినియోగదారుల విశ్వాస సర్వే(రాబోయే సంవత్సర కాలo) జూలై రౌండ్ ఫలితాలు, సెంటిమెంట్లు చారిత్రాత్మక కనిష్టాల నుండి ఆశావాద అవధిలోకి తిరిగిరావడాన్ని సూచిస్తున్నాయి. ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థల నేతృత్వంలో కార్పొరేట్ సంస్థల అమ్మకాలు, వేతనాల్లో పెరుగుదల మరియు లాభదాయకతలో తమ ఆరోగ్యకరమైన వృద్ధిని కొనసాగించగలిగాయని లిస్టెడ్ సంస్థల ప్రారంభ ఫలితాలు చూపుతున్నాయి. ఇది వినియోగదారుల, మొత్తం-పునర్వినియోగపరచదగిన-ఆదాయానికి మద్దతునిస్తుంది.

8. పెట్టుబడి డిమాండ్ ఇంకా బలహీనతతో ఉన్నప్పటికీ, సామర్థ్య వినియోగం, పెరుగుతున్న ఉక్కు వినియోగం, అధిక మూలధన వస్తువుల దిగుమతులు, అనుకూల ద్రవ్య మరియు ఆర్థిక పరిస్థితులు మరియు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీలు దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న పునరుజ్జీవనాన్ని(రివైవల్) ప్రారంభిస్తాయని భావిస్తున్నారు. రిజర్వు బ్యాంకు సర్వేలలో ఎన్నికచేయబడిన కంపెనీలు ఉత్పత్తి వాల్యూమ్‌లలో విస్తరణ మరియు Q2: 2021-22 లో కొత్త ఆర్డర్‌ల విస్తరణను అంచనా వేశాయి, ఇంకా ఈ విస్తరణ Q4: 2021-22 వరకు కొనసాగవచ్చని, పెట్టుబడికి బాగా ఉపయోగపడుతుందని కూడా అంచనా వేశాయి. మహమ్మారి సమయంలో వ్యాపారాలు అనుసరించిన ఆవిష్కరణలు మరియు పని నమూనాలు (వర్కింగ్ మోడల్స్) మహమ్మారి తగ్గిన తర్వాత కూడా సమర్థత మరియు ఉత్పాదకత లాభాలను పొందుతూనే ఉంటాయి. ఇది పెట్టుబడి, ఉపాధి మరియు సంవృద్ధి యొక్క సూచకచక్రాన్ని ప్రేరేపించడానికి సహాయపడుతుంది.

9. Q1: 2021-22 సమయంలో విదేశీ గిరాకీ ఉత్సాహంగా ఉంది మరియు ఎగుమతులు పెరగడాన్ని ప్రతిబింబిస్తుంది, మొత్తం డిమాండ్‌కు కీలక మద్దతును అందిస్తోంది. బలమైన విదేశీ గిరాకీ భారతదేశానికి ఒక అవకాశం మరియు దీనిని మరింతగా సద్వినియోగం చేసుకోవడానికి మరింత పాలసీ సాయం అవసరముంది. గ్లోబల్ కమోడిటీ ధరలు మరియు కొత్త రూపు అంటువ్యాధుల హానిభేద్యత తో పాటు ఫైనాన్షియల్ మార్కెట్లలో అస్థిరత యొక్క కధనాల వంటివి ఆర్థిక కార్యకలాపాలకు నష్టాలను కలిగిస్తాయి. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని, రియల్ జిడిపి వృద్ధి అంచనా 2021-22లో 9.5 శాతంగానే ఉంచబడింది – ఇందులో Q 1 లో 21.4 శాతం, Q 2 లో 7.3 శాతం, Q 3 లో 6.3 శాతం, ఇంకా Q 4 లో 6.1 శాతం కూడి ఉంది. Q1: 2022-23 లో రియల్ జిడిపి వృద్ధి 17.2 శాతం గా ప్రొజెక్ట్ చేయబడింది.

ద్రవ్యోల్బణం

10. ప్రతికూల సరఫరా షాక్‌లు, ప్రధాన రంగాలలో డిమాండ్-సప్లై అసమతుల్యత మరియు పెరుగుతున్న గ్లోబల్ కమోడిటీ ధరల స్పిల్-ఓవర్ తో అన్ని ప్రధాన గ్రూపుల నుండి బాహుళ్యమైన పిక్-అప్ మూలంగా, హెడ్‌లైన్ సిపిఐ ద్రవ్యోల్బణం మే నెలలో గణనీయంగా 6.3 శాతానికి చేరుకుంది. ఇది జూన్‌లో కూడా 6.3 శాతంగానే ఉంది; అయితే, ప్రధాన ద్రవ్యోల్బణం గణనీయమైన పరిమితిని (మోడరేషన్‌ని) నమోదు చేసింది.

11. నైరుతి రుతుపవనాల పునరుజ్జీవనం మరియు ఖరీఫ్ లో నాట్లు పుంజుకోవడం, తగినంత ఆహార నిల్వల తాటస్థ్యం రాబోయే నెలల్లో ధాన్యం ధరల ఒత్తిడిని తట్టుకునేందుకు సహాయపడతాయి. ప్రభుత్వం సరఫరా పరంగా జోక్యం చేసుకున్న నేపథ్యంలో, హై-ఫ్రీక్వెన్సీ ఆహార ధర సూచికలు జులైలో వంట నూనెలు మరియు పప్పుల ధరలు కొంత నియంత్రణలో ఉన్నట్లు సూచిస్తున్నాయి. గృహాల అద్దెలు వంటి ప్రధాన సేవలలో ద్రవ్యోల్బణం చారిత్రక సగటు కంటే తక్కువగా ఉండి, డిమాండ్ తగ్గిన పరిస్థితులను ప్రతిబింబిస్తున్నది. ముడిచమురు ధరల అస్థిరత ద్రవ్యోల్బణం మీద వ్యయ ఒత్తిడి దిగుమతికి ప్రోది అవుతుంది. గిరాకీ మందగింపు వల్ల ఉత్పత్తి ధరలు మరియు ప్రధాన ద్రవ్యోల్బణం సర్దుబాటుకు లోనైనప్పటికీ, పారిశ్రామిక ముడి సరకుల ధరల్లో పెరుగుదల, పెట్రోల్ మరియు డీజిల్ పంపుల్లో అధిక ధరల కాంబినేషన్ మరియు లాజిస్టిక్ ఖర్చులు, తయారీ మరియు సేవల రంగాలలో వ్యయ పరిస్థితులపై ప్రతికూలంగా ప్రభావం చూపుతూనే ఉన్నాయి.

12. మహమ్మారి ప్రారంభానికి ముందు, హెడ్‌లైన్ ద్రవ్యోల్బణం మరియు ద్రవ్యోల్బణ అంచనాలు 4 శాతం వద్ద బాగా నిలబెట్టబడడంతో, వీటిఫలితాలను ఏకీకృతం చేసి సంరక్షించాల్సిన అవసరముంది. ద్రవ్యోల్బణ రేటులో స్థిరత్వం అనేది, ద్రవ్య విధాన ఫ్రేమ్‌వర్క్ విశ్వసనీయతను పెంపొందించి మరియు ద్రవ్యోల్బణ అంచనాలను సంధానంచేయడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇది పెట్టుబడిదారులకు అనిశ్చితిని తగ్గిస్తుంది, టర్మ్ మరియు రిస్క్ ప్రీమియాను తగ్గిస్తుంది, బాహ్య పోటీతత్వాన్ని పెంచుతుంది మరియు తద్వారా వృద్ధిని ప్రోత్సహిస్తుంది. మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి, MPC మహమ్మారి ప్రభావాన్ని తగ్గించడo కోసం వృద్ధి పునరుద్ధరణకే ప్రాధాన్యతనిచ్చింది. బాహ్య పరిస్థుతులు మరియు ఎక్కువగా సప్లై షాక్ లు ద్రవ్యోల్బణం ప్రాసెస్ ను నడిపించుతూ, MPC నిర్ణయాన్నిద్రువీకరించుతూ ఒక పరి పరిశీలన చేసుకోవాల్సిందని, అందుబాటులో ఉన్న డేటా బహిర్గతం చేస్తున్నది. సరఫరా-సైడ్ తాత్కాలికంగా మళ్లింపులు ఉండవచ్చు, అయితే డిమాండ్-పుల్ ఒత్తిళ్లు అచలనంగానే ఉంటాయి, ఆర్థిక వ్యవస్థలో మందగింపు కారణంగా. ఈ దశలో ముందస్తు మానిటరీ పాలసీ ప్రతిస్పందన చాలా క్లిష్ట పరిస్థితుల్లో పట్టు సాధించడానికి ప్రయత్నిస్తున్న కొత్త మరియు సంకోచ రికవరీని మట్టుపెట్టవచ్చు.

13. ద్రవ్యోల్బణం Q2: 2021-22 వరకు ఎగువ టాలరెన్స్ బ్యాండ్‌కు దగ్గరగా ఉండవచ్చు, కానీ, ఖరీఫ్ పంట రాక కారణంగా మరియు సరఫరా పరంగా కూడా చర్యలు అమలులోకి వచ్చి ఈ ఒత్తిళ్లు Q3: 2021-22 లో తగ్గుతాయి. పైన పేర్కొన్న కారకాలు పరిగణనలోకి తీసుకుని సిపిఐ (CPI) ద్రవ్యోల్బణం అంచనా 2021-22 సంవత్సారానికి 5.7 శాతంగా అంచనా వేయబడింది; త్రైమాసికం:2 కి 5.9 శాతం, త్రైమాసికం:3 కి 5.3 శాతం గా, మరియు త్రైమాసికం:4 కి 5.8 శాతం గా, సమతౌల్యమైన నష్టభయంతో, ఇపుడు ప్రొజెక్ట్ చేయబడింది. సిపిఐ (CPI) ద్రవ్యోల్బణం త్రైమాసికం:1 2022-23 కు 5.1 శాతం గా ప్రొజెక్ట్ చేయబడింది.

లిక్విడిటీ మరియు ఫైనాన్షియల్ మార్కెట్ పరిస్థితులు

14. జూన్-జూలైలో, అనేక దేశాలలో అధిక ద్రవ్యోల్బణ నంబర్లకు ప్రతిస్పందనగా మరియు కొన్ని అభివృద్ధి చెందిన దేశాలలో ఆర్థిక పునరుద్ధరణ కృశించడంతో ముందస్తు విధాన సాధారణీకరణ భయం వల్ల, ప్రపంచ ఆర్థిక మార్కెట్లు అస్థిరంగా మారాయి. గ్లోబల్ స్పిల్‌ఓవర్ల పరిస్థితుల నుండి ఆర్థిక వ్యవస్థను కాపాడటం మరియు ఆర్ధిక స్థిరత్వాన్ని నెలకొల్పడం రిజర్వు బ్యాంకుకు అత్యంత ప్రాధాన్యత కాబట్టి, పైన వివరించిన పరిణామాలకు తగ్గ విధానాన్ని రూపొందించడానికి వీటిని మన పాలసీ మాట్రిక్స్ లో చేర్చాలి. ఏదేమైనా, దేశీయ స్థూల ఆర్థిక పరిస్థితి మరియు ఏర్పడుతున్నవృద్ధి ద్రవ్యోల్బణ డైనమిక్స్, మన ద్రవ్య విధాన చర్యలకు ముఖ్యమైన కీలకాలుగా కొనసాగుతాయి.

15. రిజర్వు బ్యాంకు తన, సంప్రదాయ మరియు అసంప్రదాయ, మార్కెట్ కార్యకలాపాల, ద్వారా దేశీయ డిమాండ్‌కి మద్దతుగా ఆర్థిక పరిస్థితులను సడలించడం కోసం మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి తగినంత మిగులు ద్రవ్యతను నెలకొల్పింది. మూలధన ప్రవాహాల పునరుద్ధరణ మరియు రిజర్వు బ్యాంకు సెకండరీ మార్కెట్‌లో ప్రభుత్వ సెక్యూరిటీలను కొనుగోలు చేయడం ద్వారా, రివర్స్ రెపోల ద్వారా మొత్తం శోషణ (గ్రహింపు) జూన్‌లో సగటున 5.7 లక్షల కోట్ల నుండి జూలై 2021 లో 6.8 లక్షల కోట్లకు మరియు ఆగస్టు 2021 లో ఇప్పటివరకు 8.5 లక్షల కోట్లకు (ఆగస్టు 4 వరకు) పెరిగింది.

16. ఫిబ్రవరి 06, 2020 న ప్రకటించిన సవరించిన లిక్విడిటీ మేనేజ్‌మెంట్ ఫ్రేమ్‌వర్క్ కింద, రిజర్వ్ బ్యాంక్ 14 రోజుల వేరియబుల్ రేట్ రివర్స్ రెపో (VRRR) వేలాన్ని తన ప్రధాన లిక్విడిటీ ఆపరేషన్‌గా నిర్వహిస్తోంది. సాధారణ లిక్విడిటీ కార్యకలాపాల ప్రారంభంతో, మహమ్మారి సమయంలో తాత్కాలికంగా నిలిపివేయబడిన VRRR, జనవరి 15, 2021 నుండి తిరిగి ప్రవేశపెట్టబడింది మరియు ప్రారంభపు శోషణ (గ్రహింపు) 2 లక్షల కోట్లు తరువాతి పక్షాల వేలాల్లో రోల్-ఓవర్ చేయబడింది. సమాంతరంగా, ఫిక్స్‌డ్ రేట్‌ ఓవర్నైట్ రివర్స్ రెపో అందుబాటు తెరిచి ఉంచబడింది. ఓవర్‌నైట్ రివర్స్ రెపో కంటే ఫిక్స్‌డ్ రేట్‌లో ఎక్కువగా రెమ్యూనరేషన్‌ రావడాన్ని దృష్టిలో ఉంచుకుని మార్కెట్లు VRRR ని స్వీకరించి, కూడా స్వాగతించాయి. VRRR యొక్క పునఃప్రారంభమంటే, లిక్విడిటీని కట్టడి చేయడంతో సమానమనే భయాలు తొలగిపోయాయి. వేలంలో బిడ్-కవర్ నిష్పత్తి పరంగా VRRR కోసం అధిక కామనను మేము గమనించాము. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని, ఇప్పుడు ఆగస్టు 13, 2021 న 2.5 లక్షల కోట్లు; ఆగస్టు 27, 2021 న 3.0 లక్షల కోట్లు; సెప్టెంబర్ 9, 2021 న 3.5 లక్షల కోట్లు; సెప్టెంబర్ 24, 2021 న 4.0 లక్షల కోట్లు 14 రోజుల VRRR వేలం నిర్వహించాలని నిర్ణయించారు. ఫిక్సెడ్ రేట్ రివర్స్ రెపో కింద గ్రహించిన మొత్తం సెప్టెంబర్, 2021 చివరి నాటికి 4.0 లక్షల కోట్లకు పైగా ఉంటుందని భావిస్తున్నందున, ఈ మెరుగైన VRRR వేలం ను, సర్దుబాటు విధాన వైఖరికి రివర్సల్ గా భావించగరాదు. VRRR విండో కింద ఆమోదించబడిన మొత్తం ను, సిస్టమ్ లిక్విడిటీలో వొక భాగంగానే పరిగణించాలి.

17. రిజర్వు బ్యాంకు సెకండరీ మార్కెట్ G-sec సముపార్జన కార్యక్రమం (G-SAP) మార్కెట్ భాగస్వాముల నుండి తీవ్రప్రతిస్పందనను పొందుతూ దిగుబళ్ళ అంచనాలను స్థిరం చేయడంలో విజయవంతమైంది. G-SAP 2.0 కింద ఆగస్టు, 12 మరియు ఆగస్టు 26, 2021 న ఒక్కొక్క వేలం 25,000 కోట్ల చొప్పున రెండు వేలంలను నిర్వహించాలని మేము ప్రతిపాదించాము. మేము ఇటువంటి వేలంలను మరియు బహిరంగ మార్కెట్ కార్యకలాపాలు (OMO లు) మరియు ఆపరేషన్ ట్విస్ట్ (OT) వంటి ఇతర కార్యకలాపాలను చేపట్టడం కొనసాగిస్తాము మరియు మారుతున్న స్థూల ఆర్థిక మరియు ఫైనాన్షియల్ పరిస్థితులకు అనుగుణంగా వాటిని క్రమాంకనం చేస్తాము.

18. దిగుబడి రేఖ వ్యవస్థీకృత వికాసం కొరకు, దీని అన్ని సెగ్మెంట్లలోనూ ట్రేడింగ్ చురుకుగా జరగాల్సిన అవసరంఉంది. మెచ్యూరిటీ స్పెక్ట్రం మొత్తం సెక్యూరిటీలపై దృష్టి సారించిన మా ఇటీవలి G-SAP వేలంలు, దిగుబడి రేఖ అన్ని సెగ్మెంట్లు లిక్విడ్ గా ఉండేలా చూడడానికి ఉద్దేశించబడ్డాయి. ఇంకా, G-SAP వేలం మరియు ఆపరేషన్ ట్విస్ట్‌ ల ఆప్షన్స్ లో చెలామణి లో యున్న లేదా చెలామణి బాగాలేని అన్ని సెక్యూరిటీలకు ఎప్పుడూ స్థానంఇవ్వబడింది. సెకండరీ మార్కెట్ వాల్యూమ్‌లు పెరిగి, ఇంక మార్కెట్ పార్టిసిపెంట్‌లు పొజిషన్లు తీసుకోవడం మూలంగా దిగుబళ్ళ రేఖకు ఇరువైపులా గమనానికి (మూవ్మెంట్లకు) వీలు కలిగింది.

19. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల డెట్-మేనేజర్‌గా మా ప్రయత్నం ఏమిటంటే, రోల్‌ఓవర్ రిస్కులను సాధ్యమైనంత స్వల్పస్థితికి తెచ్చి సహేతుకమైన ఖర్చుతో వారి రుణ కార్యక్రమాలను సక్రమంగా పూర్తి చేయడం. ఇంతకు మునుపటి నా ప్రకటనలలో, నేను ప్రజాహితం కొరకు దిగుబడి రేఖ (యీల్డ్ కర్వ్) వ్యవస్థీకృత వికాస ప్రాముఖ్యతను నొక్కి చెప్పాను, ఎందుకంటే దీన్లో మార్కెట్ భాగస్వాముల మరియు రిజర్వు బ్యాంకు ఇద్దరికీ భాగస్వామ్య బాధ్యత ఉన్నది. G-sec దిగుబడి (యీల్డ్) వొక బెంచ్‌మార్క్‌ గా పనిచేస్తున్నందున మరియు రుణ మార్కెట్‌లోని ఇతర విభాగాలకు విలువైన సంకేతాలను ఇచ్చే వీలు కలిగి ఉన్నందున, ప్రాథమిక మార్కెట్ కార్యకలాపాలలో వేలం కట్-ఆఫ్‌లు, డెవలప్‌మెంట్‌లు, రద్దులు మరియు గ్రీన్ షూ ఆప్షన్‌ల నిర్వహణ ద్వారా దిగుబళ్ళ వ్యవస్థీకృత పధం నకు సంబంధించి మార్గదర్శకత్వం అందించబడుతుంది. 14 సంవత్సరాల వరకు సెక్యూరిటీల జారీ కోసం ఇటీవల ప్రకటించిన ఏకరీతి ధర వేలం పరిచయం, ప్రాథమిక విభాగంలో బిడ్డర్లు ఎదుర్కొనే ప్రమాదాలను తగ్గించగలదని భావిస్తున్నారు. జీఎస్‌టీ పరిహారం చెల్లింపును ఏడాది మొదటి అర్ధ భాగంలో ప్రస్తుతమున్నటువంటి నగదు బ్యాలెన్సువరకు, రాష్ట్రాలకు కల్పించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, ఈ ఏడాది ప్రభుత్వ రుణ కార్యక్రమం పరిమాణంపై మార్కెట్ ఆందోళనలకు ఉపశమనం కలిగించాలి.

20. RBI యొక్క ద్రవ్య విధాన చర్యలు మరియు చర్యల ప్రభావశీలతలు, వర్తమానo సడలింపు సంచరణ ప్రసారంలో, గణనీయమైన మెరుగుదలను ప్రతిబింబిస్తున్నది. ఫిబ్రవరి, 2019 నుండి, రెపో రేటును 250 బేసిస్ పాయింట్లు తగ్గించడం వలన తాజా రుపీ రుణాలపై వెయిటెడ్ యావరేజ్ రుణ రేటు (WALR) లో మొత్తానికి (క్యూములేటివ్ గా) 217 బేసిస్ పాయింట్లు తగ్గాయి కార్పొరేట్ బాండ్లు, డిబెంచర్లు, సిపిలు, సిడిలు మరియు టి-బిల్లులు వంటి మార్కెట్ పరికరాలపై వడ్డీ రేట్లతో సహా దేశీయ రుణ వ్యయాలు బాగా సడలినవి. ఇక క్రెడిట్ మార్కెట్లో; MSME లు, హౌసింగ్ మరియు పెద్ద పరిశ్రమలకు రుణ రేట్ల ట్రాన్స్మిషన్ (ప్రసరణ) బలంగా ఉంది. తక్కువ వడ్డీ రేటు హయాం హౌసింగ్ సెక్టార్ లోన్-సర్వీసింగ్ భారాన్ని తగ్గించడంలో కూడా సహాయపడింది. వ్యక్తిగత గృహ రుణాలు మరియు కమర్షియల్ రియల్ ఎస్టేట్ రంగానికి వడ్డీ రేట్లు గణనీయంగా తగ్గించడం ఆర్థిక వ్యవస్థకు బాగా వర్తిస్తుంది, ఎందుకంటే ఈ రంగాలు ఊర్ధ్వగతి గాని అధోగతి గాని వ్యాపించు సహలగ్నతను కలిగి ఉండి మరియు ఉపాధి కల్పించే స్తోమతతో ఉంటాయి.

అదనపు చర్యలు

21. మహమ్మారి ప్రారంభమైన తర్వాత, దాని ప్రభావాన్ని తగ్గించడానికి రిజర్వు బ్యాంకు 100 కి పైగా చర్యలను ప్రకటించింది. భవిష్యత్తులో, మా అన్ని చర్యల ప్రయోజనం లక్షిత వాటాదారులందరికి చేరువ అయ్యేలా చూడడానికోసం, ఇప్పటికీ అమలులో ఉన్న చర్యల పర్యవేక్షణను కొనసాగించాలనేది మా ప్రయత్నం. ఈ నేపథ్యంలో మరియు స్థూల ఆర్ధిక పరిస్థితి మరియు ఫైనాన్షియల్ మార్కెట్ల స్థితిగతులపై మా యొక్క నిరంతర అంచనా ఆధారంగా, ఈరోజు కొన్ని అదనపు చర్యలు ప్రకటించబడుతున్నాయి. ఈ చర్యల వివరాలు, ద్రవ్య విధాన ప్రకటన యొక్క అభివృద్ధి మరియు నియంత్రణ విధానాలపై (పార్ట్-బి) ఇచ్చిన ప్రకటనలో పేర్కొనబడ్డాయి. ఈ చర్యల గురించి ప్రస్తుతం నన్ను తెలియజేయనివ్వండి.

టిఎల్‌టిఆర్‌ఓ (TLTRO) లక్షిత-దీర్ఘకాల (ఆన్-ట్యాప్) స్కీం – చివరి గడువు పొడిగింపు

22. ఐదు విభాగాల (సెక్టార్లు) కోసం తొలుత అక్టోబర్ 9, 2020 న ప్రకటించిన ఆన్-ట్యాప్ TLTRO స్కీమ్ యొక్క పరిధి, డిసెంబర్, 2020 లో కామత్ కమిటీ వారు గుర్తించిన ఒత్తిడి రంగాలకు మరియు ఫిబ్రవరి, 2021 లో NBFC లకు బ్యాంక్ రుణాలు అందించడం కోసం మరింతగా విస్తరించబడింది. సెప్టెంబర్ 30, 2021 వరకు కూడా ఈ స్కీం అమలు పరిధి దశల వారీగా పొడిగించబడింది. నవజనిత ఆర్ధిక పునరుద్ధరణ ఇపుడిపుడే తేరుకుంటున్న కారణంగా, ఇప్పుడు ఆన్-ట్యాప్ TLTRO స్కీమ్‌ను మూడు నెలల కాలానికి, అంటే డిసెంబర్ 31, 2021 వరకు పొడిగించాలని నిర్ణయించారు.

పరిమిత స్థాయీ సౌకర్యం (మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ- ఎంఎస్ఎఫ్) – సడలింపుల యొక్క పొడిగింపు

23. పరిమిత స్థాయీ సౌకర్యం (మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ- ఎంఎస్ఎఫ్) క్రింద నిధులను పొందడానికి చట్టబద్ధ ద్రవ్య నిష్పత్తి (యస్ యల్ ఆర్-SLR) నిదులలోంచి ఎన్‌డిటిఎల్ (Net Demand and Time Liabilities) అదనంగా ఒక శాతం వరకు, అంటే మొత్తం ఎన్‌డిటిఎల్ లో మూడు (3) శాతం వరకు నిధులను వినియోగించుకోవడానికి మార్చి 27, 2020 న బ్యాంకులు అనుమతించబడినవి. లిక్విడిటీ కవరేజ్ రేషియో (LCR) అవసరాలను తీర్చడంతోపాటు, బ్యాంకులకు వారి లిక్విడిటీ అవసరాలపై సౌలభ్యాన్ని అందించడానికి, ప్రస్తుతం సెప్టెంబర్ 30, 2021 వరకు అందుబాటులో ఉన్న ఈ సడలింపు మరో మూడు నెలల పాటు అంటే డిసెంబర్ 31 వరకు, 2021 పొడిగించబడింది. ఈ సౌకర్యం 1.62 లక్షలకోట్ల మేరకు నిధులు అందుబాటుగా ఉంచడమే గాకుండా లిక్విడిటీ కవేరేజ్ నిష్పత్తి (యల్ సీ ఆర్ – LCR) కోసం ఉన్నత-శ్రేణి ద్రవ్య ఆస్తులు (హెచ్ క్యూ యల్ ఎ – HQLA) గా అర్హత పొందుతుంది.

లైబర్ (LIBOR) పరివర్తన - మార్గదర్శకాలపై సమీక్ష - విదేశీ కరెన్సీలో ఎగుమతి (ఎక్స్పోర్ట్) క్రెడిట్ మరియు డెరివేటివ్ కాంట్రాక్టుల పునర్నిర్మాణం (రీస్ట్రక్చరింగ్‌).

24. లండన్ ఇంటర్‌బ్యాంక్ ఆఫర్ రేట్ (LIBOR) నుండి దూరమవడం అనేది బ్యాంకులు మరియు ఆర్థిక వ్యవస్థకు కొన్ని సవాళ్లను ఎదుర్కొనే ముఖ్యమైన సంఘటన. ముందస్తు చర్యలు తీసుకోవడానికి బ్యాంకులు మరియు మార్కెట్ సంస్థలతో రిజర్వు బ్యాంకు చర్చలు జరుపుతూ నిమగ్నమై ఉంది. నియంత్రిత సంస్థలు మరియు ఫైనాన్షియల్ మార్కెట్లకు సజావుగా పరివర్తన చెందడానికి రిజర్వు బ్యాంకు సలహాలను కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలో, (i) విదేశీ కరెన్సీలో ఎగుమతి క్రెడిట్ మరియు (ii) ఉత్పన్న ఒప్పందాల (డెరివేటివ్ కాంట్రాక్టుల) పునర్నిర్మాణానికి (రీస్ట్రక్చరింగ్‌) సంబంధించిన మార్గదర్శకాలను సవరించాలని నిర్ణయించారు. సంబంధిత కరెన్సీలో విస్తృతంగా ఆమోదించబడిన ఏవైనా ప్రత్యామ్నాయ సూచన రేటును (ARR) ఉపయోగించి విదేశీ కరెన్సీలో ఎగుమతి క్రెడిట్‌ను పొడిగించడానికి బ్యాంకులకు అనుమతి ఇవ్వబడుతుంది. లైబర్ (LIBOR) నుండి రిఫరెన్స్ రేట్‌లో రాబోయే మార్పు అప్రత్యాశిత ("ఫోర్స్-మేజర్") ఘటన (ఈవెంట్) కాబట్టి, LIBOR/LIBOR-సంబంధిత బెంచ్‌మార్క్‌ల నుండి రిఫరెన్స్ రేట్‌ను ప్రత్యామ్నాయ రిఫరెన్స్ రేట్‌గా మార్చడాన్ని రీస్ట్రక్చరింగ్‌గా పరిగణించరాదని బ్యాంకులకు సలహా కూడా ఇవ్వడమైనది.

ఉపశమన ప్రణాళిక 1.0 (రిజల్యూషన్ ఫ్రేమ్‌వర్క్ 1.0) కింద ఫైనాన్షియల్ పరామితుల సాధనకు గడువును వాయిదా వేయడం

25. ఆగష్టు 6, 2020 న ప్రకటించిన కోవిడ్ -19 సంబంధిత ఒత్తిడి ఉపశమనం కోసం ఉపశమన ప్రణాళిక (రిజల్యూషన్ ఫ్రేమ్‌వర్క్) కింద అమలు చేయబడిన రిజల్యూషన్ ప్రణాళికలో నిర్దిష్ట ఆర్ధిక పరామితులకు సంబంధించి సెక్టార్ నిర్దిష్ట పరిమితులను చేరుకోవాలి. ఈ పరామితులలో, నాలుగు పరామితులు రుణాలు తీసుకునే సంస్థల కార్యాచరణ పనితీరుతో సంబంధం కలిగి ఉంటాయి, అవేమిటంటే - EBIDTA నిష్పత్తికి మొత్తం అప్పు, ప్రస్తుత నిష్పత్తి (కరెంట్ రేషియో), రుణ సేవా కవరేజ్ నిష్పత్తి మరియు సగటు రుణ సేవల కవరేజ్ నిష్పత్తి. ఈ నిష్పత్తులు మార్చి 31, 2022 లోపు చేరబడాలి. వ్యాపారాల పునరుజ్జీవనంపై COVID-19 యొక్క రెండవ వేవ్ యొక్క ప్రతికూల ప్రభావాన్ని మరియు కార్యాచరణ పరామితులను చేరుకోవడంలో ఎదురయ్యే ఇబ్బందులను గుర్తించి, పైన పేర్కొన్న నాలుగు పరామితులకు సంబంధించి లక్ష్య తేదీని అక్టోబర్ 1, 2022 వరకు వాయిదా వేయాలని నిర్ణయించారు.

ముగింపు వాక్యాలు

26. COVID-19 సెకండ్ వేవ్ తరిగిపోతున్నందున, ఒక వేళ మూడో వేవ్ సంభవించినట్లయితే, మహమ్మారికి తగిన ప్రోటోకాల్‌లు పాటించడం మరియు టీకాకరణ ను వేగవంతం చేయడంతో ఆ వేవ్ ను అధిగమించగలమని ఆశిస్తున్నాము. ఒకే జాతిగా, మనం మన అప్రమత్తత ను కొనసాగించాలి; మరియు మహమ్మారి ఏ రూపులోనైనా మార్పుచెంది పునరుత్థానం అయితే అత్యంత వేగంతో ముందుగా వ్యవహరించి అరికట్టడానికి సిద్ధంగా ఉండాలి.

27. రికవరీ అసమానత రంగాలన్నింటిలోనూ ఉంది, సరిదిద్దడానికి పాలసీ మేకర్ల పూర్తి మద్దతు అవసరం. పాలసీ అస్త్రాలైన - మానిటరీ, ప్రుడెన్షియల్ or నియంత్రణ – “whatever it takes” మోడ్ లో అమలు చేయడానికి రిజర్వు బ్యాంకు సంసిద్ధతతో ఉంది, సమాంతరంగా, ఆర్థిక స్థిరత్వం పరిరక్షణపై మా దృష్టి కొనసాగుతుంది. ఇటువంటి సమయంలో, మా ప్రధాన ప్రాధాన్యత ఏమిటంటే, స్థిరత్వంతో స్థిరమైన వృద్ధి మార్గంలో మన్నికైన పునరుద్ధరణను నిర్ధారించడానికి వృద్ధి ప్రేరణలను పెంపొందించడం. ఈ ప్రయత్నంలో, సచేతనంతో ఉదాసీనతపై ఆశావాదాన్ని ఎంచుకున్నాము, మహాత్మాగాంధీ స్ఫూర్తితో: “నేను అదమ్య ఆశావాదిని, కానీ నేను ఎల్లప్పుడూ నా ఆశావాదిత్వానికి కఠినమైన వాస్తవాలపై ఆధారపడతాను"2

ధన్యవాదాలు. క్షేమంగా ఉండండి మరియు స్వస్థతతో ఉండండి. నమస్తే.

(యోగేష్ దయాళ్) 
చీఫ్ జనరల్ మేనేజర్

పత్రికా ప్రకటన: 2021-2022/643


1 Source: Speeches delivered at Bishop Charles Mason Temple in Memphis, Tennessee (3 April 1968) and at Prayer Pilgrimage for Freedom (Call to Conscience, 1957) in Washington, D.C USA.

2 సేకరణ: డి.జి.టెండుల్కర్ రచన “మహాత్మా” , వాల్యూం 2 నుండి. (Source: Book “Mahatma” by D.G. Tendulkar, Volume 2.)

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?