<font face="mangal" size="3">ప్రకృతి వైపరీత్యాలు జరిగిన ప్రాంతాల్లో సహా - ఆర్బిఐ - Reserve Bank of India
ప్రకృతి వైపరీత్యాలు జరిగిన ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాలు – బీమా నిధుల వినియోగం
RBI/2015-16/436 జూన్ 30, 2016 చైర్‌మన్/మానేజింగ్ డైరెక్టర్/ అమ్మా/అయ్యా, ప్రకృతి వైపరీత్యాలు జరిగిన ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాలు – బీమా నిధుల వినియోగం పేరా 6. 13 మాస్టర్ సర్క్యులర్ FIDD.No.FSD.BC.01/05.10.001/2015-16 తేదీ జులై 1, 2015 ప్రకారం, ప్రకృతి వైపరీత్యాలు జరిగిన ప్రాంతాల్లో, రుణ పునర్వ్యవస్థీకరణ (loan restructuring) చేసేసమయంలో, బీమా కంపెనీ నుండి ఏమయినా నిధులు రావలసి ఉంటే, వాటిని పునర్వ్యవస్థీకరించిన ఖాతాలకు (restructured Accounts) జమ చెయ్యలి (ఒకవేళ క్రొత్త రుణాలు మంజూరు చేసినట్లయితే) 2. ప్రకృతి విపత్తుల సంభవించినప్పుడు, వ్యవసాయదారులు ఎదుర్కొనే కష్టాల దృష్ట్యా, బ్యాంకులు సానుభూతితో వ్యవహరించి, బీమా సొమ్ము నమ్మకంగా వస్తుంది అన్న సందర్భాల్లో, దానికై వేచి ఉండకుండా, రుణాలు పునర్వ్యవస్థీకరించవచ్చు / క్రొత్త రుణాలు మంజూరు చెయ్యవచ్చు. విధేయులు (ఉమా శంకర్) |