హర్దోయి జిల్లా సహకారి బ్యాంక్ లిమిటెడ్, హర్దోయి, ఉత్తరప్రదేశ్ పై జరిమానా విధింపు.
అక్టోబర్ 11, 2018 హర్దోయి జిల్లా సహకారి బ్యాంక్ లిమిటెడ్, హర్దోయి, ఉత్తరప్రదేశ్ పై జరిమానా విధింపు. బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 సెక్షన్ 47A(1) (c) రెడ్ విత్ సెక్షన్ 46 (4) (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు) నిబంధనల ప్రకారం, భారతీయ రిజర్వు బ్యాంకు తమకు దఖలుపరచబడిన అధికారములతో హర్దోయి జిల్లా సహకారి బ్యాంక్ లిమిటెడ్, హర్దోయి, ఉత్తరప్రదేశ్ పై, సదరు చట్టం లోని సెక్షన్ 19 క్రింద ఇతర కో-ఆపరేటివ్ సొసైటీలలో షేర్ల హోల్డింగ్ పరిమితిపై ఆర్బిఐ సూచనలను / మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు మరియు సదరు చట్టం లోని సెక్షన్ 31 క్రింద, ఆడిటర్ రిపోర్ట్ తో అకౌంట్లు మరియు బ్యాలెన్స్ షీట్ ను ప్రచురించకపోవడం / దాఖలు చేయకపోడం తో, ₹ 1,00,000/- (ఒక లక్ష రూపాయలు) నగదు జరిమానా విధించింది. 2. భారతీయ రిజర్వు బ్యాంకు జారీ చేసిన షోకాజ్ నోటీసుకు, బ్యాంక్ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చిoది. ఈ సందర్భంగా కేసు సంబంధిత నిజానిజాలను పరిశీలించిన తరువాత, ఈ ఉల్లంఘనలు నిరూపించబడినవై, అవి నగదు జరిమానా విధించదగినవేనని, భారతీయ రిజర్వు బ్యాంకు నిర్ధారణకు వచ్చినది. అజిత్ ప్రసాద్ పత్రికా ప్రకటన: 2018-2019/857 |
పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ: