<font face="mangal" size="3px">ఎచ్ సి బి ఎల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., లక్నో, (యు &# - ఆర్బిఐ - Reserve Bank of India
ఎచ్ సి బి ఎల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., లక్నో, (యు పి) – జరిమానా విధింపు
తేదీ: 20/02/2019 ఎచ్ సి బి ఎల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., లక్నో, (యు పి) – జరిమానా విధింపు రిజర్వ్ బ్యాంక్, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949, (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించే మేరకు), సెక్షన్ 47A(1)(c) [సెక్షన్ 46 (4) తో కలిపి], తమకు దఖలు పరచిన అధికారాలతో, ఎచ్ సి బి ఎల్ కో- అపరేటివ్ బ్యాంక్ లి., లక్నో (యు పి) పై, రూ. 1.00,000/- (కేవలం ఒక లక్ష రూపాయిలు) నగదు జరిమానా విధించింది. బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949 (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించే మేరకు) సెక్షన్ 35A (సెక్షన్ 56 తోకలిపి), క్రింద రిజర్వ్ బ్యాంక్ జారీచేసిన ఆదేశాలు / మార్గదర్శకాలు; ఎక్స్పోజర్ నిబంధనలు; చట్టబద్ధ ఆవశ్యకతలు మరియు ఇన్‌స్పెక్షన్ / ఆడిట్ విధానం, ఉల్లంఘించిన కారణంగా ఈ జరిమానా విధించడమైనది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పైన తెలిపిన బ్యాంకుకు షోకాజ్ నోటీస్ జారీచేసింది. దీనికి, బ్యాంకు లిఖితపూర్వక జవాబు ఇచ్చింది. ఈవిషయమై వాస్తవాలు, బ్యాంక్ సమర్పించిన జవాబు, ప్రత్యక్ష విజ్ఞాపనలను పరిశీలించిన తరువాత, ఉల్లంఘనలు నిరూపితమైనట్లు, అవి జరిమానా విధింపతగినవేనని రిజర్వ్ బ్యాంక్, నిర్ధారణకు వచ్చినది. అజిత్ ప్రసాద్ పత్రికా ప్రకటన: 2018-2019/1980 |