<font face="mangal" size="3">వస్తు మరియు సేవల దిగుమతులు – దిగుమతుల చెల్ల - ఆర్బిఐ - Reserve Bank of India
వస్తు మరియు సేవల దిగుమతులు – దిగుమతుల చెల్లింపులకు కాలపరిమితి పొడిగింపు
RBI/2019-20/242 మే 22, 2020 అందరు క్యాటగరి – I, ఆతరైజ్డ్ డీలర్లు అమ్మా / అయ్యా, వస్తు మరియు సేవల దిగుమతులు – దిగుమతుల చెల్లింపులకు కాలపరిమితి పొడిగింపు ఈ రోజు జారీచేసిన ‘వికాసాత్మక మరియు నియంత్రణా విధానాలపై నివేదిక’ లోని పేరా 5 దయచేసి చూడండి. వస్తు మరియు సేవల దిగుమతిపై జనవరి 01, 2016 తేదీన జారీచేసిన మాస్టర్ డైరెక్షన్ పేరా B.5.1 (i) లోని అంశాలను అందరు క్యాటగరి – I, ఆతరైజ్డ్ డీలర్లు గమనించవలెను. ఈ నిబంధనలక్రింద, సాధారణ దిగుమతులకు (అనగా- బంగారం /వజ్రాలు మరియు మణులు / ఆభరణాలు మినహా) చెల్లింపులు, ఎగుమతిజరిగిన ఆరు నెలలలోగా పూర్తిచేయవలెను (కార్యనిర్వహణ మొ. వాటికి హామీగా (పెర్ఫార్మెన్స్ గ్యారంటీ) ఉంచుకొన్న సొమ్ము తప్ప). 2. నావల్ కరోనా వైరస్ వ్యాధి (కోవిడ్-19) చెలరేగిన కారణంగా, కలిగిన అంతరాయాల దృష్ట్యా, జులై 31, 2020 తేదీ లేదా అంతకుముందు ఎగుమతి జరిగిన సాధారణ దిగుమతులకు సంబంధించి, పూర్తి చెల్లింపు చేయుటకు (కార్యనిర్వహణ మొ. వాటికి హామీగా (పెర్ఫార్మెన్స్ గ్యారంటీ) ఉంచుకొన్న సొమ్ము తప్ప), కాలపరిమితి ఆరు నెలలనుండి పన్నెండు నెలలకు పెంచాలని నిశ్చయించబడింది. 3. ఆతరైజ్డ్ డీలర్ బ్యాంకులు, ఈ సర్క్యులర్లోని విషయాలను, సంబంధిత ఖాతాదారులకు తెలియచేయవలెను. 4. ఈ సర్క్యులర్ లోని మార్గదర్శకాలు, విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం, 1999 (1999 లో 42 వది), సెక్షన్ 10 (4) మరియు 11 (1) క్రింద, ఇతర చట్ట పరమైన ఉత్తరువులు / అనుమతులకు భంగం కానివిధంగా, జారీచేయబడ్డాయి. మీ విశ్వాసపాత్రులు, (అజయ్ కుమార్ మిశ్రా) |