<font face="mangal" size="3px">ఇండియన్‌ మర్కంటైల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., ల - ఆర్బిఐ - Reserve Bank of India
ఇండియన్ మర్కంటైల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., లక్నో, ఉత్తర్ ప్రదేశ్ – రిజర్వ్ బ్యాంక్ జారీచేసిన నిర్దేశాల ఉపసంహరణ
తేదీ: 11/09/2019 ఇండియన్ మర్కంటైల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., లక్నో, ఉత్తర్ ప్రదేశ్ – రిజర్వ్ బ్యాంక్, సెక్షన్ 35 A, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు) క్రింద, జూన్ 04, 2014 తేదీన, ఇండియన్ మర్కంటైల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., లక్నోకు, నిర్దేశాలు జారీచేసినది. ఈ నిర్దేశాలు ఎప్పటికప్పుడు పొడిగించబడుతూ, మార్చ్ 05, 2019 తేదీన జారీచేసిన చివరి నిర్దేశాలద్వారా, సెప్టెంబర్ 11, 2019 వరకు పొడిగించబడినవి. రిజర్వ్ బ్యాంక్ ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్దేశాలను ఉపసంహరించుట అవసరమని భావించి, సెక్షన్ 35A, సబ్-సెక్షన్ (2), బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు) తమకు దఖలుపరచిన అధికారాలతో, ఇండియన్ మర్కంటైల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి, లక్నో, ఉత్తర్ ప్రదేశ్కు జారీచేయబడి, తదుపరి మార్చబడుతూవచ్చిన నిర్దేశాలను, ఇందుమూలముగా ఉపసంహరించినది. ఈ సందర్భంగా జారీచేసిన ఆదేశాల నకలు, ఇండియన్ మర్కంటైల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ ఆవరణలో, ప్రజల సమాచారంకొరకు ప్రదర్శింపబడినది. ఇకనుంచి, బ్యాంకు అన్ని బ్యాంకింగ్ లావాదేవీలు యథావిధిగా కొనసాగిస్తుంది. యోగేశ్ దయాల్ పత్రికా ప్రకటన: 2019-2020/669 |