<font face="mangal" size="3">భారతీయ రిజర్వ్ బ్యాంక్ బ్యాంకులకు హిందీ వ్ķ - ఆర్బిఐ - Reserve Bank of India
భారతీయ రిజర్వ్ బ్యాంక్ బ్యాంకులకు హిందీ వ్యాసరచన పోటీ - 2016-17
ఆగస్ట్ 30, 2016 భారతీయ రిజర్వ్ బ్యాంక్ (Inter-bank Hindi Essay competition-2016-17) బ్యాంకింగ్ అంశాలపై హిందీలో వ్రాయడాన్ని ప్రోత్సహించేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్, ప్రతి సంవత్సరం బ్యాంకులకు హిందీలో వ్యాసరచన పోటీ నిర్వహిస్తుంది. అందరు అధికారులు, ఉద్యోగులు (రాజ్‌భాషా అధికారులు, అనువాదకులు తప్ప) ఈ పోటీలో పాల్గొనవచ్చు. తదనుసారంగా, 2016-17 సవత్సరం పోటీకై ఎంపిక చేసిన మూడు విషయాలు ఈక్రింద ఇవ్వబడ్డాయి:-
పాల్గొనగోరేవారు పైన ఏదేని ఒక విషయంపై వ్యాసం పంపవచ్చు. దాఖలు చేయవలసిన ఆఖరు తేదీ నవంబర్ 30, 2016 (బుధవారం). పోటీ నిబంధనలు అనుబంధం ‘A’ లో ఇవ్వబడ్డాయి. పాల్గొనే అధికారులు, ఉద్యోగులు సమర్పించవలసిన ధృవపత్రం నమూనా, అనుబంధం ‘B’ లో ఇవ్వబడింది. ప్రభుత్వ బ్యాంకులు (RRBల తో సహా) మరియు ఆర్థిక సంస్థలు, ఈ సర్క్యులర్‌లోని విషయాలు వారి ఉద్యోగుల దృష్టికి తేవలసినదిగా కోరడమైనది. బహుళ ప్రాచుర్యం కోసం, పై పోటీగురించి వారి సంస్థా పత్రికలలో/హిందీ సంచికలలో ప్రచురించడమేగాక వారి వెబ్‌సైట్‌లో కూడా అందుబాటులో ఉంచవలెను. అజిత్ ప్రసాద్ పత్రికా ప్రకటన: 2016-2017/540 |