<font face="mangal" size="3">చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు</font> - ఆర్బిఐ - Reserve Bank of India
చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు
RBI/2016-17/267 ఏప్రిల్ 6, 2017 చైర్‌మెన్/చీఫ్ ఎక్జెక్యూటివ్ ఆఫీసర్ అయ్యా, చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు పై విషయమై ఫిబ్రవరి 9, 2017 తేదీన మాచే జారీ చేయబడ్డ సర్క్యులర్ DGBA.GAD.2012/15.02.005/2016-17, దయచేసి చూడండి. భారత ప్రభుత్వం, వారి ఆఫీస్ మెమొరాండం (OM) No.F.No.1/4/2016-NS. II, తేదీ మార్చ్ 31, 2017 ద్వారా, ఆర్థిక సంవత్సరం 2017-18 మొదటి త్రైమాసికానికి వివిధ చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వర్తించే వడ్డీ రేట్లు తెలియబరిచింది. (నకలు జతపరచబడింది). 2. ఈ సర్క్యులర్‌లోని విషయాలు, అవసరమైన చర్యకోసం, ప్రభుత్వ చిన్న మొత్తాల పొదుపు పథకాలు నిర్వహించే మీ బ్యాంకు శాఖల దృష్టికి తేవలెను. ఈ పథకాల్లో మదుపు చేసేవారి సమాచారం కోసం, ఈ వివరాలు మీ శాఖలలోని నోటీస్ బోర్డులపై ప్రదర్శించలెను. మీ విధేయులు, (హర్ష వర్ధన్) జతపరచినవి: పైన సూచించినవి |