RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
ODC_S3

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78515781

స్వల్పకాలిక పంట ఋణాలపై, 2018-19 మరియు 2019-20 సంవత్సరాలలో, వడ్డీ రాయితీ (ఇంటరెస్ట్ సబవెన్షన్, IS) మరియు సకాల ఋణ చెల్లింపునకు (పి ఆర్ ఐ, PRI) ప్రోత్సాహకాలు: కోవిడ్–19 కారణంగా గడువు పొడిగింపు

RBI/2019-20/224
FIDD.CO.FSD.BC.No.24/05.02.001/2019-20

ఏప్రిల్ 21, 2020

చైర్‌మన్‌ / మానేజింగ్ డైరెక్టర్ / చీఫ్ ఎక్జెక్యూటివ్‌ ఆఫీసర్
అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు

అమ్మా / అయ్యా,

స్వల్పకాలిక పంట ఋణాలపై, 2018-19 మరియు 2019-20 సంవత్సరాలలో, వడ్డీ రాయితీ (ఇంటరెస్ట్ సబవెన్షన్, IS) మరియు సకాల ఋణ చెల్లింపునకు (పి ఆర్ ఐ, PRI) ప్రోత్సాహకాలు: కోవిడ్–19 కారణంగా గడువు పొడిగింపు

స్వల్పకాలిక పంట ఋణాలపై, 2018-19 మరియు 2019-20 సంవత్సరాలలో, వడ్డీ రాయితీ (ఐ ఎస్, ఇంటరెస్ట్ సబవెన్షన్, IS) మరియు సకాల ఋణ చెల్లింపునకు ప్రోత్సాహకాలపై (పి ఆర్ ఐ, PRI) మా సర్క్యులర్ FIDD.CO.FSD.BC.No.15/05.02.001/2018-19 తేదీ మార్చి 7, 2019 దయచేసి చూడండి.

2. కోవిడ్–19 మహామారి ప్రబలుటవల్ల విధించిన ‘లాక్ డౌన్’ కారణంగా ప్రజల కదలికలపై గల నిర్బంధాలవల్ల, అనేకమంది వ్యవసాయదారులు వారి స్వల్పకాలిక పంట రుణాల బకాయిలు చెల్లించుటకు, బ్యాంకులకు రాలేకపోతున్నారు. కోవిడ్-19, రెగ్యులేటరీ ప్యాకేజీకి సంబంధించి మార్చి 27, 2020 తేదీన రిజర్వ్ బ్యాంక్ జారీ చేసిన సర్క్యులర్ అనుసరించి, మార్చి 31, 2020 – మే 31,2020 మధ్య చెల్లించవలసిన నియమితకాల రుణాల (స్వల్పకాలిక పంట ఋణాలతోసహా) వాయిదాలపై, మూడు నెలల మారటోరియం అనుమతించబడింది.

3. తదనుసారంగా, వ్యవసాయదారులు ఒకప్రక్క వడ్డీ జరిమానా చెల్లిస్తూ, మరొకప్రక్క వడ్డీ రాయితీ పొందే పరిస్థితి నివారించడానికి, ప్రభుత్వం 2% ఐ ఎస్, 3% పి ఆర్ ఐ సౌకర్యాన్ని 31.05.2020 వరకు లేదా గడువు తేదీవరకు (ఏది ముందువస్తే అది) కొనసాగించాలని నిశ్చయించింది. ఈ సౌకర్యం, రూ. 3 లక్షల వరకు గల స్వల్పకాలిక పంట రుణాలపై, మార్చి 31, 2020 – మే 31, 2020 మధ్య చెల్లించవలసిన బకాయిలకు వర్తిస్తుంది.

4. కాబట్టి, 3 లక్షల వరకు గల స్వల్పకాలిక పంట రుణాలపై, మార్చి 31, 2020 – మే 31, 2020 మధ్య చెల్లించవలసిన బకాయిలకు, 2 % ఐ ఎస్, 3% పి ఆర్ ఐ సౌకర్యాన్ని అందించాలని, బ్యాంకులకు తెలుపుతున్నాము.

5. ఇతర నియమ నిబంధనలలో ఎట్టి మార్పూ లేదు.

మీ విశ్వాసపాత్రులు,

(సోనాలీ సేన్ గుప్తా)
చీఫ్ జనరల్ మానేజర్

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?