<font face="mangal" size="3">ఎంఎస్ఎంఇలకు వడ్డీ రాయితీ సహాయ పథకం</font> - ఆర్బిఐ - Reserve Bank of India
ఎంఎస్ఎంఇలకు వడ్డీ రాయితీ సహాయ పథకం
ఆర్ బి ఐ/2018-19/125 ఫిబ్రవరి 21, 2019 అధ్యక్షుడు/నిర్వాహక సంచాలకుడు మరియు ముఖ్య కార్యనిర్వహణ అధికారి మేడమ్/సర్, ఎంఎస్ఎంఇలకు వడ్డీ రాయితీ సహాయ పథకం మీకు తెలిసినట్లుగా, నవంబర్ 2, 2018 న భారత ప్రభుత్వం ‘ఎంఎస్ఎంఇలకు వడ్డీ రాయితీ సహాయ పథకం 2018’, ప్రకటించింది. 2. సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ (ఎంఎస్‌ఎంఇ), భారత ప్రభుత్వం ద్వారా విడుదల చేసిన పైన ఉదహరించిన పథకం అమలుకు సంబంధించిన ముఖ్య లక్షణాలు మరియు కార్యాచరణ మార్గదర్శకాల యొక్క నకలు జతచేయబడింది. స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్ఐడిబిఐ) ఈ పథకానికి ఒక జాతీయ స్థాయి నోడల్ అమలు సంస్థ. 3. పథకం అమలుకు బ్యాంకులను ఉద్దేశించి జారీ చేసిన ముఖ్య లక్షణాలు మరియు కార్యాచరణ మార్గదర్శకాలపై తగిన విధంగా చర్యలు తీసుకోవాలని మరియు పథకాన్ని విజయవంతంగా అమలు చేయడానికి మీ శాఖలకు/నియంత్రణ కార్యాలయాలకు అవసరమైన సూచనలను జారీ చేయాలని అభ్యర్ధించడమైనది. 4. దయచేసి ప్రాప్తిని తెలియజేయండి మీ విధేయులు, (సోనాలి సేన్ గుప్తా) ఎంఎస్ఎంఇలకు వడ్డీ రాయితీ సహాయ పథకం 2018 1. నేపధ్యం సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా (ఎంఎస్ఎంఇ) రంగాలు బలమైన మరియు స్థిరమైన జాతీయ ఆర్థిక వ్యవస్థను నిర్మించడంలో గణనీయమైన సహకారి. ఎంఎస్ఎంఇ రంగం ప్రజల వద్దకు తీసుకు వెళ్లే కార్యక్రమాన్ని నవంబర్ 2, 2018 న గౌరవనీయులైన ప్రధాన మంత్రి ప్రారంభించినప్పుడు, క్రెడిట్ యాక్సెస్, మార్కెట్ యాక్సెస్, టెక్నాలజీ అప్‌గ్రేడేషన్, సులభంగా వ్యాపారం చేయడం మరియు ఉద్యోగులకు భద్రతా భావం అనే ఐదు ముఖ్య అంశాలు ఎంఎస్‌ఎంఇ రంగాన్ని సులభతరం చేస్తాయని ప్రత్యేకంగా ఉటంకించారు. ఈ ఐదు వర్గాలలో ప్రతి ఒక్కటి పరిష్కరించడానికి పన్నెండు ప్రకటనలు చేయబడ్డాయి. క్రెడిట్ యాక్సిస్ లో భాగంగా, అన్ని జిఎస్‌టి రిజిస్టర్డ్ ఎంఎస్ఎంఇలకు తాజా లేదా పెరుగుతున్న రుణాలపై 2% వడ్డీ రాయితీ సహాయాన్ని ప్రధాని ప్రకటించారు. సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ (ఎంఎస్‌ఎంఇ), భారత ప్రభుత్వం ఒక కొత్త “ఎంఎస్‌ఎంఇల పెంపు రుణాల కోసం వడ్డీ రాయితీ సహాయ పథకం 2018” 2018-19 మరియు 2019-20 సంవత్సరాల్లో అమలు చేయాలని నిర్ణయించింది. 2. పథకం యొక్క ముఖ్య లక్షణాలు 2.1 ఉద్దేశ్యం, పరిధి మరియు వ్యవధి ఉత్పాదకతను పెంచడానికి ఉత్పాదక మరియు సేవా సంస్థలను ప్రోత్సహించడం ఈ పథకం యొక్క లక్ష్యంగా ఉంది మరియు జిఎస్‌టి ప్లాట్‌ఫామ్‌లో ఆన్‌బోర్డింగ్ కోసం ఎంఎస్‌ఎంఇలకు ప్రోత్సాహకాలను అందిస్తుంది. ఇది ఆర్థిక వ్యయాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది మరియు రుణ వ్యయాన్ని తగ్గిస్తుంది. ఈ పథకం 2019 మరియు 2020, రెండు ఆర్థిక సంవత్సరాల కాలానికి అమలులో ఉంటుంది. 2.2 పథకం కోసం అర్హత (i) ఈ క్రింది ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న అన్ని ఎంఎస్ఎంఇలు, ఈ పథకం క్రింద లబ్ధిదారులుగా అర్హులు: ఎ. చెల్లుబాటు అయ్యే ఉద్యోగ్ ఆధార్ సంఖ్య [UAN] బి. చెల్లుబాటు అయ్యే GSTN సంఖ్య (ii) పెరిగిన టర్మ్ లోన్ లేదా క్రొత్త టర్మ్ ఋణం లేదా నవంబర్ 2018 నుండి మరియు తదుపరి ఆర్ధిక సంవత్సరానికి విస్తరించిన, పెరిగిన లేదా తాజా వర్కింగ్ క్యాపిటల్ కొరకు పథకం లో అర్హులు. (iii) టర్మ్ లోన్ లేదా వర్కింగ్ క్యాపిటల్, షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకుల ద్వారా మంజూరు చేయబడి ఉండాలి. (iv) పథకం యొక్క గరిష్ట విస్తరణ మరియు ప్రజల వద్దకు తీసుకు వెళ్లే కార్యక్రమంలో, అన్ని వర్కింగ్ క్యాపిటల్ లేదా టర్మ్ ఋణం కొరకు ₹100 లక్షల వరకు, పథకం అమలులో వున్న కాలానికి అర్హులు. (v) అర్హతగల సంస్థ ద్వారా వర్కింగ్ క్యాపిటల్ మరియు టర్మ్ లోన్ రెండింటినీ ఎంఎస్‌ఎంఇకి విస్తరించిన చోట, వడ్డీ రాయితీ గరిష్టంగా ₹100 లక్షల ఆర్థిక సహాయం కోసం అందుబాటులో ఉంటుంది. (vi) వాణిజ్య విభాగం క్రింద ప్రీ-షిప్మెంట్ లేదా పోస్ట్-షిప్మెంట్ ఋణం కోసం వడ్డీ రాయితీ సహాయం పొందే ఎంఎస్‌ఎంఇ ఎగుమతిదారులు, ‘ఎంఎస్‌ఎంఇ లకు పెంపు రుణాల కోసం వడ్డీ రాయితీ సహాయ పథకం 2018’ క్రింద సహాయం కోసం అర్హులు కారు. (vii) ఇప్పటికే రాష్ట్ర/కేంద్ర ప్రభుత్వ పథకాలలో ఏదైనా పథకం క్రింద వడ్డీ రాయితీ సహాయం పొందుతున్న ఎంఎస్‌ఎంఇలు, ప్రతిపాదిత పథకం క్రింద అర్హులు కావు. 2.3 కార్యాచరణ పద్ధతులు 1. వడ్డీ రాయితీ సహాయం సంవత్సరానికి రెండు శాతం పాయింట్ల వద్ద లెక్కించబడుతుంది (2% pa), ఎప్పటికప్పుడు బకాయిలు పంపిణీ/తీసుకున్న తేదీ నుండి లేదా ఈ పథకం నోటిఫికేషన్ తేదీ నుండి, ఏది తరువాత ఐతే అది, పెరుగుతున్నప్పుడు లేదా అర్హతగల సంస్థలచే పంపిణీ చేయబడిన వర్కింగ్ కాపిటల్ యొక్క తాజా మొత్తం లేదా పెరుగుతున్న లేదా కొత్త టర్మ్ ఋణం. 2. ఎంఎస్‌ఎంఇలకు వసూలు చేసే వడ్డీ రేట్లు సంబంధిత సంస్థలు ప్రచురించిన (ప్రస్తుతం ఉన్న భారతీయ రిజర్వు బ్యాంకు మార్గదర్శకాల ప్రకారం) కోడ్ ఆఫ్ ఎథిక్స్ మరియు ఫెయిర్ ప్రాక్టీసెస్ కోడ్‌కు అనుగుణంగా ఉండాలి మరియు వర్తించే వడ్డీ రేటు, సంస్థ యొక్క మార్గదర్శకాల ప్రకారం, ఎంఎస్‌ఎంఇల అంతర్గత/బాహ్య రేటింగ్‌తో అనుసంధానించబడి ఉంటుంది. 3. అమలులో ఉన్న మార్గదర్శకాల ప్రకారం, దావా దాఖలు చేసిన తేదీన ఉన్న రుణాలు, నిరర్ధక ఆస్తులు (ఎన్‌పిఎ) గా ప్రకటించి వుండకూడదు. ఖాతా ఎన్‌పిఎగా ఉన్న ఏ కాలానికైనా వడ్డీ రాయితీ సహాయం అనుమతించబడదు. 2.4 దావా సమర్పణ 1. అర్హతగల రుణ సంస్థల నోడల్ కార్యాలయం, అనుబంధం I లో ఇచ్చిన ఫార్మాట్ ప్రకారం సిడ్బి వారికి అర్ధ వార్షిక దావాలను సమర్పించాలి. పంపిణీ చేసిన రుణాలు మరియు వడ్డీ రాయితీ సహాయ దావాలకు (శాఖల వారీగా) సంబంధించిన సమాచారం సాఫ్ట్ కాపీలో ఎక్సెల్ ఫార్మాట్ లో సమర్పించాలి. ఫార్మాట్ అనుబంధం II లో ఇవ్వబడింది. 2. అర్హతగల సంస్థల శాఖల ద్వారా డేటాను సంకలనం చేసే ఫార్మాట్ అనుబంధం III లో ఇవ్వబడింది. అదే డేటాను, శాఖలు తమ నియంత్రణ కార్యాలయాలు/ప్రధాన కార్యాలయాలకు సమర్పించవచ్చు. 3. అన్ని దావాలు, అర్హతగల సంస్థల యొక్క చట్టబద్ధమైన ఆడిటర్లచే ధృవీకరించబడాలి. పెరుగుతున్న/తాజా రుణాలు, వడ్డీ వసూలు మరియు దావా చేసిన మొత్తానికి సంబంధించి వ్యక్తిగత ఖాతాల ధృవీకరణ, పై నివేదిక లో ఉండాలి. అనుబంధం I, II మరియు III లలో సూచించినట్లుగా, దావా చేసిన మొత్తం రాయితీకి సరిపోలినట్లు రుణ సంస్థలు నిర్ధారించుకోవాలి. 4. అర్ధ సంవత్సర దావాలను చీఫ్ జనరల్ మేనేజర్, ఇనిస్టిట్యూషనల్ ఫైనాన్స్ వర్టికల్, సిడ్బి, ముంబైకి సమర్పించాలి. 5. సంస్థలకు చెందిన ప్రతి దావాకు, నిధుల పంపిణీ, సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ ద్వారా నిధులు విడుదల చేసిన తర్వాతే ఉంటుంది. 2.5 ఇతర ఒప్పందాలు 1. వివిధ రుణ సంస్థలకు వడ్డీని తగ్గించే ఉద్దేశ్యంతో, వారి నోడల్ కార్యాలయం ద్వారా, సిడ్బి నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది. 2. ఖచ్చితమైన డేటాను సమర్పించడానికి మరియు పథకం పర్యవేక్షణకు అన్ని రుణ సంస్థలు బాధ్యత వహించాలి. 3. అర్హత కలిగిన సంస్థల యొక్క చట్టబద్ధమైన ఆడిటర్లు ధృవీకరించిన దావా ఆధారంగా మాత్రమే వడ్డీ రాయితీ సహాయం విడుదల చేయబడుతుంది. రుణాలు ఇచ్చే సంస్థల ద్వారా సరికాని డేటా సమర్పణకు, సిడ్బి బాధ్యత వహించదు. 4. భారత ప్రభుత్వం నుండి నిధుల లభ్యతకు లోబడి, వడ్డీ రాయితీ సహాయం మొత్తాన్ని సిడ్బి విడుదల చేస్తుంది. అలాగే, వడ్డీ రాయితీ సంబంధిత విషయాలకు సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం తుది అధికారం కలిగి ఉంటుంది మరియు వారి నిర్ణయం తుది మరియు కట్టుబడిగా ఉంటుంది. అర్హతగల సంస్థల నిధుల రసీదును, ఫండ్ యొక్క యుటిలైజేషన్ సర్టిఫికెట్‌గా పరిగణిస్తారు. |