RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S2

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78515499

2018-19 మరియు 2019-20 సంవత్సరాలలో స్వల్ప కాలిక పంట రుణాల కోసం సహాయక (సబ్-వెన్షణ్) వడ్డీ పథకం

ఆర్.బి.ఐ/2018-19/137
యఫ్.ఐ.డి.డి./సీ.ఓ.యఫ్.యస్.డి.బీసీ.నం.15/05.02.001/2018-19.

మార్చి 07, 2019

ది చైర్మన్ / మేనేజింగ్ డైరెక్టర్ మరియు సీఈఓ లు
అన్ని ప్రభుత్వ & ప్రైవేట్ రంగ షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు

మేడమ్/డియర్ సర్,

2018-19 మరియు 2019-20 సంవత్సరాలలో స్వల్ప కాలిక పంట రుణాల కోసం సహాయక (సబ్-వెన్షణ్) వడ్డీ పథకం

తాత్కాలిక ప్రాతిపదికన సహాయక (సబ్-వెన్షణ్) వడ్డీ పథకం కొనసాగింపును తెలియజేయుచున్న జూన్ 7, 2018 వ తేదీ నాటి మా సర్కులర్ యఫ్.ఐ.డి.డి./సీ.ఓ./యఫ్.యస్.డి. బీసీ.నం.21/05.04.001/2017-18 ను దయచేసి చూడండి. ఈ సందర్భంగా 2018-19, 2019-20 సంవత్సరాలకు గాను స్వల్పకాలిక పంట రుణాలు ₹ 3 లక్షల వరకు సహాయక వడ్డీ పథకాన్ని కొన్ని సవరణలతో మరియు క్రింది నిబంధనలతో అమలు చేయడానికి భారత ప్రభుత్వం ఆమోదం తెలిపింది:

  1. 2018-19 మరియు 2019-20 సంవత్సరాల్లో రైతులకు సాలుకు 7 శాతం వడ్డీతో స్వల్పకాలిక పంట ఋణాలు అందించడానికి, ఋణాలిచ్చే సంస్థలకు అంటే ప్రభుత్వ రంగ బ్యాంకులు (పిఎస్‌బి) మరియు ప్రైవేట్ రంగ వాణిజ్య బ్యాంకులకు (వారి గ్రామీణ మరియు సెమీ అర్బన్ శాఖలు ఇచ్చిన రుణాలకు సంబంధించి) సాలుకు 2 శాతం సహాయక వడ్డీ ని అందించాలని నిర్ణయించారు. ఈ 2 శాతం సహాయక వడ్డీ రైతుకు ఇచ్చిన పంట ఋణం మొత్తం పై పంపిణి చేసిన / తీసుకున్న తేదీ నుంచి పంట ఋణాన్ని రైతు తిరిగి చెల్లించే తేదీ వరకు లేదా బ్యాంకులు నిర్ణయించిన ఋణం యొక్క గడువు తేదీ వరకు ఏది ముందుగా అవుతుందో అది గరిష్టంగా వొక సంవత్సర కాలానికి లోబడి, ధన సహాయ మొత్తం లెక్కగట్టబడుతుంది.

  2. ఋణాలను సకాలంలో తిరిగి చెల్లించే రైతులకు సాలుకు 3 % అదనపు సహాయక వడ్డీను అందించడం – అంటే పంట ఋణం పంపిణి చేసిన తేదీ నుంచి పంట ఋణాన్ని రైతు తిరిగి చెల్లించే తేదీ వరకు లేదా బ్యాంకులు నిర్ణయించిన ఋణం యొక్క గడువు తేదీ వరకు ఏది ముందుగా అవుతుందో అది పంపిణీ చేసిన తేదీ నుండి గరిష్టంగా ఒక సంవత్సరానికి లోబడి ఉండాలి. పైన పేర్కొన్న విధంగా సకాలంలో ఋణాలను తిరిగి చెల్లించే రైతులకు 2018-19 మరియు 2019-20 సంవత్సరాల్లో స్వల్పకాలిక పంట రుణాలు సాలుకు @ 4 శాతం నకే లభిస్తాయని కూడా ఇది సూచిస్తుంది. సాలు గడువు తీరిన తరువాత వారి పంట రుణాలను తిరిగి చెల్లించే రైతులకు ఈ ప్రయోజనం సిద్ధించదు.

  3. రైతులు దుస్థితితో చేసే విక్రయాలను నిరుత్సాహ పరిచేందుకు మరియు వారి ఉత్పత్తులను గిడ్డంగులలో నిల్వ చేయడానికై వారిని ప్రోత్సహించడానికి కిసాన్ క్రెడిట్ కార్డు కల్గిన చిన్న మరియు సన్న కారు రైతులకు పంట నూర్పిడి అనంతరం మరో ఆరు మాసాల వరకు పంట ఋణo అందించిన రేటుకే ఈ సహాయ వడ్డీ సదుపాయం లభిస్తుంది; ఈ సదుపాయం గిడ్డంగీకరణ అభివృద్ధి నియంత్రణ అథారిటీ (డబ్ల్యూడిఆర్ఏ) చే గుర్తించబడిన గిడ్డంగులలో ఉంచిన ఉత్పత్తినిల్వకు జారీచేసిన అన్యాక్రాంత యోగ్య (నేగోషియబుల్) గిడ్డంగి రిసీట్లకు మారుగా లభిస్తుంది.

  4. ప్రకృతి వైపరీత్యాలకు ప్రభావితమైన రైతులకు ఉపశమనం కలిగించడానికి, బ్యాంకులకు రీస్ట్రక్చర్డ్ చేసిన ఋణ మొత్తంపై సాలుకు 2% సహాయక వడ్డీ మొదటి సంవత్సరం అందుబాటులో ఉంటుంది. అటువంటి, రీస్ట్రక్చర్డ్ ఋణాలపై రెండవ సంవత్సరం నుంచి సాధారణ వడ్డీ అమలవుతుంది.

  5. అయితే, తీవ్రమైన ప్రకృతి వైపరీత్యాలకు ప్రభావితమైన రైతులకు ఉపశమనం కలిగించడానికి, బ్యాంకులకు రీస్ట్రక్చర్డ్ చేసిన ఋణ మొత్తంపై సాలుకు 2 శాతం సహాయక వడ్డీ మొదటి మూడు సంవత్సరాలు / మొత్తం గడువు (గరిష్టంగా ఐదు సంవత్సరాలకు లోబడి )అందుబాటులో ఉంటుంది. అంతేకాకుండా, అటువంటి సందర్భాలన్నింటిలోనూ, ప్రభావిత రైతులు వారు సకాలంలో ఋణాలు తిరిగి చెల్లించినందుకుగాను ప్రోత్సాహకంగా సాలుకు 3 శాతం ఉపశమనం అందించబడుతుంది. తీవ్రమైన ప్రకృతి వైపరీత్యాలకు లోనయినపుడు, ఇటువంటి సదుపాయాల మంజూరనేది, ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీం (ఐయంసిటి) మరియు జాతీయ కార్యనిర్వాహక కమిటీ వారి సబ్-కమిటీ (యస్సి-యన్ఈసి) సిఫారసుల ఆధారంతో ఉన్నత స్థాయి కమిటీ (హెచ్.యల్.సి) చే నిర్ణయించబడుతుంది.

  6. బహువిధ (మల్టిపుల్) ఋణాలను నివారించడానికి మరియు గోల్డ్ లోన్స్ మెకానిజం ద్వారా నిజ రైతులు మాత్రమే ఈ రాయితీ పంట రుణాన్ని పొందుతున్నారని నిర్ధారించగలగాలి; అందులకై ఋణదాత సంస్థలు యుక్తాయుక్త విచక్షణ నిర్వహించి, ఒకవేళ అటువంటి ప్రయోజనం కోసం రైతు బంగారం తాకట్టు ఋణాలను వినియోగిస్తే, భూమి వివరాలను నమోదు చేయడంతో సహా సరైన డాక్యుమెంటేషన్‌ను నిర్ధారించాలి.

  7. సహాయ వడ్డీ పథకం క్రింద రైతులకు అవాంతరాలేమి కలగకుండా చూసేందుకై, 2018-19 మరియు 2019-20 సంవత్సరాల్లో స్వల్పకాలిక పంట రుణాలు పొందటానికి ఆధార్ లింకేజీని తప్పనిసరి చేయాలని బ్యాంకులకు సూచిస్తున్నాము.

  8. ఇంకా, 2018-19 నుండి, ఈ సహాయ వడ్డీ పథకం DBT మోడ్ లో ‘ఇన్ కైండ్/సర్వీసెస్’ క్రమంలో ఉంచబడాలి; మరియు 2018-19 లో ప్రాసెస్ చేసిన అన్ని స్వల్ప కాలిక పంట ఋణాలను ISS పోర్టల్/ DBT ప్లాట్ ఫాం పైకి తీసుకురావాలి. ఈ పథకం కింద లబ్ధిదారుల డేటాను కేటగిరీల వారీగా సేకరించాలి మరియు దానిని ISS పోర్టల్ ప్రారంభించిన తర్వాత 2018-19 నుండి ఉత్పన్నమయ్యే క్లెయిమ్ లను పరిష్కరించడానికి, పోర్టల్లో వ్యక్తిగత రైతు వారీగా నివేదించాలీ.

2. పై పేర్కొనబడిన పథకం గురింది బ్యాంకులు తగినంత ప్రచారం ఇవ్వాలి, తద్వారా రైతులు ఇతోధిక ప్రయోజనాలను పొందగలుగుతారు.

3. 2017-18 లో ఆడిట్ చేయబడి పెండింగ్ లో యున్న యోగ్యతగల క్లయిము లన్నింటిని, ఋణదాత బ్యాంకులన్నీ ఆగస్ట్ 30, 2019 లోపు మాకు పంపించాలి. ఎటువంటి పరిస్థితులలోనూ ఈ విషయంలో గడువు మరింత పొడిగించబడదని దయచేసి గ్రహించగలరు.

4. ఇంకా ఈ క్రింద ఇచ్చిన సలహాలను కూడా పాటించాలి:

  1. 2% సహాయ వడ్డీ నకు మరియు 3% అదనపు సహాయ వడ్డీ నకు సంబంధించిన క్లయిములను వరుసగా ఫార్మాట్ I మరియు ఫార్మాట్ II లలో (దీనితో జతపరచబడినవి) సాఫ్ట్ కాపీ (ఎక్సెల్ ఫార్మేట్) ను ఈ-మెయిల్ ద్వారా మరియు హార్డ్ కాపీని చీఫ్ జనరల్ మేనేజర్, ఆర్ధిక సమగ్రత మరియు వికాస విభాగం, కేంద్రీయ కార్యాలయం, షహీద్ భగత్ సింగ్ మార్గ్, ఫోర్ట్, ముంబై-400001 కు పంపించాలి.

  2. 2019 మరియు 2020 సంవత్సరాలకు గాను 2% సహాయ వడ్డీ కు సంబంధించి, బ్యాంకులు తమ క్లయిములను అర్ధ సంవత్సర ప్రాతిపదికన అంటే సెప్టెంబర్ 30 తేదీ నాటి మరియు మార్చి 31వ తేదీ నాటి స్థితితో సమర్పించాలి. వీటిలో, ఉత్తరోత్తర క్లయిమునకు, స్టాట్యూటరి ఆడిటర్ సర్టిఫికేట్ తో, సహాయ వడ్డీ క్లెయిమ్ మార్చి 31 తో ముగిసిన సంబంధిత ఆర్థిక సంవత్సరానిదని ధృవీకరణతోపంపాలి. 2018-19 మరియు 2019-20 సంవత్సరాలలో చేసిన డిజ్బర్సుమెంట్సుకు సంబంధించి ఏదైనా మిగిలిన క్లెయిమ్స్ ను అంటే మార్చి 31, 2019 నాటి మరియు మార్చి 31, 2020 క్లెయిమ్స్ లో కలపకుండాఉన్నట్లయితే, వాటిని విడిగా సంఘటితం చేసి అదనపు క్లెయిమ్ గా మార్క్ చేసి స్టాట్యూటరిఆడిటర్లచే ధృవీకరణ చేయాలి.

  3. 3 శాతం అదనపు సబ్-వెన్షన్ కు సంబంధించి, బ్యాంకులు 2018-19 మరియు 2019-20 సంవత్సరాల్లో చేసిన డిజ్బర్సుమెంట్సుకు సంబంధించి సంఘటితం చేసిన క్లెయిమ్స్ ను స్టాట్యూటరి ఆడిటర్లచే క్లెయిమ్ సరయినదని ధృవీకరిస్తూ ఒకతూరులో వరసగా ఏప్రిల్ 30, 2020 మరియు ఏప్రిల్ 30, 2021 లోగా సమర్పించాలి.

  4. అన్యాక్రాంత యోగ్య (నేగోషియబుల్) గిడ్డంగి రిసీట్లకు మారుగా ఇచ్చిన పంట నూర్పిడి ఋణాల 2 శాతం సహాయవడ్డీ క్లెయిమ్స్, ప్రకృతి వైపరీత్యాలవల్ల రీస్ట్రక్చర్డ్ చేసిన ఋణాల 2 శాతం క్లెయిమ్స్, మరియు తీవ్రమైన ప్రకృతి వైపరీత్యాలవల్ల రీస్ట్రక్చర్డ్ చేసిన ఋణాల 2 శాతం లేదా 3 శాతం క్లెయిమ్ లకు సంబంధించి, బ్యాంకులు తాము చేసిన డిజ్బర్సుమెంట్సుకోసం సంఘటితం చేసిన క్లెయిమ్స్ ను ప్రతి హెడ్ నకు విడిగా స్టాట్యూటరి ఆడిటర్లచే క్లెయిమ్ సరయినదని ధృవీకరిస్తూ ఒకతూరులో సమర్పించాలి

మీ విధేయులు

(జి.పి. బోరా)
చీఫ్ జనరల్ మేనేజర్-ఇన్-ఛార్జ్

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?