<font face="mangal" size="3">నేషనల్ ఎలెక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ (NEFT) వ - ఆర్బిఐ - Reserve Bank of India
నేషనల్ ఎలెక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ (NEFT) వ్యవస్థలో అదనపు సెటిల్‌మెంట్ బ్యాచిల ప్రారంభం
తేదీ: మే 08, 2017 నేషనల్ ఎలెక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ (NEFT) వ్యవస్థలో నేషనల్ ఎలెక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ వ్యవస్థను మెరుగు పరచడంకోసం, వినియోగదారుల సౌకర్యంకోసం, భారతీయ రిజర్వ్ బ్యాంక్, 2017-18 సంవత్సరపు మొదటి ద్వైమాసిక ద్రవ్య విధాన ప్రతిపాదనలో, NEFT వ్యవస్థలో అదనపు బ్యాచిలు ప్రారంభిస్తామని ప్రకటించింది. ప్రతి అరగంట వ్యవధిలో అనగా ఉదయం 8. 30, 9. 30, 10. 30 …… సాయంత్రం 5. 30, 6. 30 గంటలకు, జులై 10, 2017 నుండి, అదనంగా 11 బ్యాచిలు ప్రారంభించబడతాయి. దీనితో, రోజులో అరగంట బ్యాచిల సంఖ్య 23 కు పెరుగుతుంది. ఉదయం మొదటి బ్యాచి 8. 00 గం., సాయంత్రం ఆఖరి బ్యాచి 7.00 గం. సమయాలు, ఇప్పటిలాగే కొనసాగుతాయి. తిప్పివేయాల్సిన సమయంకూడా (Return Discipline) ఇప్పటిలాగే ఉంటుంది, అనగా B+2 గం. (సెటిల్‌మెంట్ బ్యాచి సమయం+ 2 గం.) అజిత్ ప్రసాద్ పత్రికా ప్రకటన: 2016-2017/3010 |