<font face="mangal" size="3">పెద్ద కార్పొరేట్ రుణగ్రహీతల కోసం లీగల్ ఎంటĹ - ఆర్బిఐ - Reserve Bank of India
పెద్ద కార్పొరేట్ రుణగ్రహీతల కోసం లీగల్ ఎంటిటీ ఐడెంటిఫైయర్ (LEI) ప్రవేశ పెట్టుట
ఆర్.బి.ఐ/2017-18/82 నవంబర్ 02, 2017 అన్ని షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు మేడమ్ / డియర్ సర్, పెద్ద కార్పొరేట్ రుణగ్రహీతల కోసం లీగల్ ఎంటిటీ ఐడెంటిఫైయర్ (LEI) ప్రవేశ పెట్టుట ప్రపంచ ఆర్థిక సంక్షోభం తరువాతి దశలో, ఆర్ధిక సమాచార వ్యవస్థల నాణ్యతను మరియు ఖచ్చితత్వాన్ని మెరుగుపరిచేందుకు మెరుగైన రిస్క్ మేనేజిమెంట్ కొరకై, లీగల్ ఎంటిటీ ఐడెంటిఫైయర్ (LEI) కోడ్ ను ఒక కీలకమైన ప్రమాణంగా ప్రవేశపెట్టడం జరిగింది. LEI అనేది ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక లావాదేవీల పార్టీలను గుర్తించడానికి వాడే 20 అంకెల ప్రత్యేక కోడ్. 2. OTC డెరివేటివ్స్ మార్కెట్ లో పాల్గొనేవారి కోసం, జూన్ 01, 2017 నాటి సర్కులర్ ఆర్.బి.ఐ/2016-17/314 FMRD.FMID సంఖ్య.14/11.01.007/2-16-17 ద్వారా, లీగల్ ఎంటిటీ ఐడెంటిఫైయర్ (LEI), దశలవారీగా అమలు చేయబడింది. 3. అక్టోబర్ 4, 2017 నాటి అభివృద్ధి, నియంత్రణ విధానాలకు సంబంధించిన ప్రకటనలో, మొత్తం ఫండ్-బేస్డ్ మరియు నాన్-ఫండ్ ఆధారిత ఎక్స్పోజర్ ₹ 5 కోట్లు పైన ఉన్న బ్యాంకుల యొక్క కార్పొరేట్ రుణగ్రహీతలకు,లీగల్ ఎంటిటీ ఐడెంటిఫైయర్ (LEI) దశలవారీగా అమలుచేయబడుతుందని సూచించడమైనది.(ఎంపిక చేయబడిన భాగం జతచేయబడినది) దీని ప్రకారం, ఏదైనా బ్యాంకు నుండి మొత్తం ఫండ్-బేస్డ్ మరియు నాన్-ఫండ్ ఆధారిత ఎక్స్పోజర్ ₹ 5 కోట్లు పైన ఉన్న కార్పొరేట్ రుణగ్రహీతలు, అనుబంధంలో ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం లీగల్ ఎంటిటీ ఐడెంటిఫైయర్ (LEI) పొందేలా బ్యాంకులు వారికి సలహా ఇవ్వాలి. షెడ్యూల్ ప్రకారం LEI ని పొందని రుణగ్రహీతల క్రెడిట్ సౌకర్యాల పునరుద్ధరణ / మెరుగుపరచడం జరగదు. ₹ 5 కోట్లు మరియు ₹ 50 కోట్ల మధ్య ఉన్న రుణగ్రహీతల కొరకు వేరే మార్గదర్శకాలు జారీచేయబడతాయి. 4. పెద్ద రుణగ్రహీతలు తమ మూల సంస్థకు, అన్ని అనుబంధ సంస్థలకు మరియు సహ సంస్థలకు LEI పొందటానికి, బ్యాంకులు ప్రోత్సహించాలి. 5. LEI యొక్క అమలు మరియు ఉపయోగం కోసం మద్దతునిచ్చే సంస్థ అయిన గ్లోబల్ లీగల్ ఎంటిటీ ఐడెంటిఫైయర్ ఫౌండేషన్ (GLEIF) చేత గుర్తింపు పొందిన స్థానిక ఆపరేటింగ్ యూనిట్స్ (LOUs) నుండి, LEI పొందవచ్చు. చెల్లింపు మరియు సెటిల్మెంట్ సిస్టమ్స్ చట్టం, 2007 క్రింద రిజర్వు బ్యాంకుచే గుర్తింపు పొందిన క్లియరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (CCIL) యొక్క అనుబంధ సంస్థ అయిన లీగల్ ఎంటిటి ఐడెంటిఫైయర్ ఇండియా లిమిటెడ్ (LEIIL) నుండి, ఇండియా లో LEI కోడ్ ను పొందవచ్చు. లీగల్ ఎంటిటి ఐడెంటిఫైయర్ ఇండియా లిమిటెడ్ (LEIIL), LEI కోడ్ జారీ మరియు నిర్వహణ కోసం భారతదేశంలో స్థానిక ఆపరేటింగ్ యూనిట్ (LOU) గా GLEIF చే గుర్తింపు పొందింది. 6. నియమాలు, ప్రక్రియ మరియు డాక్యుమెంటేషన్ అవసరాలను LEIIL నుండి నిర్ధారించుకోవచ్చు. 7. LEI కోడ్ పొందిన తరువాత, రుణగ్రహీతలు GLEIF మార్గదర్శకాల ప్రకారం, కోడ్స్ ను పునరుద్ధరించేలా కూడా, బ్యాంకులు సునిశ్చితం చేసుకోవాలి. 8. బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం, 1949 లోని సెక్షన్ 21 మరియు సెక్షన్ 35(ఎ) క్రింద ఈ ఆదేశాలు జారీ చేయబడుతున్నాయి. మీ విధేయులు (ఎస్. ఎస్. బారిక్) అభివృద్ధి మరియు నియంత్రణ విధానాలకు సంబంధించిన అక్టోబర్ 4, 2017 నాటి ప్రకటన లోని ఎంపిక చేయబడిన భాగాలు 5. లీగల్ ఎంటిటీ ఐడెంటిఫైయర్ (LEI) - ఏదైనా బ్యాంకు నుండి మొత్తం ఫండ్-బేస్డ్ మరియు నాన్-ఫండ్ ఆధారిత ఎక్స్పోజర్ ₹ 5 కోట్లు పైన ఉన్న కార్పొరేట్ రుణగ్రహీతలు, లీగల్ ఎంటిటీ ఐడెంటిఫైయర్ (LEI) రిజిస్ట్రేషన్ పొంది దానిని సెంట్రల్ రిపోజిటరీ అఫ్ ఇన్ఫర్మేషన్ ఆన్ లార్జ్ క్రెడిట్స్ (CRILC) లో తప్పనిసరిగా నమోదు చేసుకునేట్లుగా బ్యాంకులు సునిశ్చితం చేసుకోవాలని నిర్ణయించడమైనది. ఇది కార్పోరేట్ సమూహాలు తీసుకున్న మొత్తం రుణాలు అంచనా వేయడానికి మరియు సంస్థ / సమూహం యొక్క ఆర్థిక ప్రొఫైల్ పర్యవేక్షణను సులభతరం చేస్తుంది. ఈ అవసరాన్ని క్రమాంకనం చేయబడిన, కానీ సమయ పరిధిలో, అమలు చేయబడుతుంది. అవసరమైన సూచనలు అక్టోబర్ 2017 చివరి నాటికి జారీ చేయబడతాయి. LEI అమలు కోసం షెడ్యూల్
|