<font face="mangal" size="3">OTC డెరివేటివ్స్ మార్కెట్ల కొరకు లీగల్ ఎంటిటీ &# - ఆర్బిఐ - Reserve Bank of India
OTC డెరివేటివ్స్ మార్కెట్ల కొరకు లీగల్ ఎంటిటీ ఐడెంటిఫైయర్ (LEI)ను ప్రవేశ పెట్టుట
ఆర్.బి.ఐ/2016-17/314 జూన్ 01, 2017 టు OTC డెరివేటివ్ మార్కెట్లలో పాల్గొనటానికి అర్హత కలిగిన అందరు మాడమ్ / డియర్ సర్ OTC డెరివేటివ్స్ మార్కెట్ల కొరకు లీగల్ ఎంటిటీ ఐడెంటిఫైయర్ (LEI)ను ప్రవేశ పెట్టుట ప్రపంచ ఆర్థిక సంక్షోభం తరువాతి దశలో, ఆర్ధిక సమాచార వ్యవస్థల నాణ్యతను మరియు ఖచ్చితత్వాన్ని మెరుగుపరిచేందుకు మెరుగైన రిస్క్ మేనేజిమెంట్ కొరకై, లీగల్ ఎంటిటీ ఐడెంటిఫైయర్ (LEI) కోడ్ ను ఒక కీలకమైన ప్రమాణంగా ప్రవేశపెట్టడం జరిగింది. LEI అనేది ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక లావాదేవీల పార్టీలను గుర్తించడానికి వాడే 20 అంకెల ప్రత్యేక కోడ్. 2. భారతదేశంలో రూపాయి వడ్డీ రేటు డెరివేటివ్స్, విదేశీ కరెన్సీ డెరివేటివ్స్ మరియు క్రెడిట్ డెరివేటివ్స్ లో, ఓవర్ ది కౌంటర్ (OTC) మార్కెట్లలో పాల్గొనేవారికి LEI వ్యవస్థను దశలవారీగా అమలు చేయాలని నిర్ణయించడమైనది. ఈ విధంగా, జతపర్చిన షెడ్యూల్ (అనుబంధం) లో సూచించిన సమయ శ్రేణుల ప్రకారం, ప్రస్తుత మరియు భవిష్యత్ లో పాల్గొనేవారు విశిష్ట LEI కోడ్ పొందవలసి ఉంటుంది. LEI కోడ్ లేని సంస్థలకు, షెడ్యూల్లో పేర్కొన్న తేదీ తర్వాత, OTC డెరివేటివ్ మార్కెట్లలో పాల్గొనడానికి అర్హత లేదు. 3 LEI యొక్క అమలు మరియు ఉపయోగం కోసం మద్దతునిచ్చే సంస్థ అయిన గ్లోబల్ లీగల్ ఎంటిటీ ఐడెంటిఫైయర్ ఫౌండేషన్ (GLEIF) చేత గుర్తింపు పొందిన స్థానిక ఆపరేటింగ్ యూనిట్స్ (LOUs) నుండి LEI పొందవచ్చు. చెల్లింపు మరియు సెటిల్మెంట్ సిస్టమ్స్ చట్టం, 2007 క్రింద రిజర్వు బ్యాంకుచే గుర్తింపు పొందిన క్లియరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (CCIL) యొక్క అనుబంధ సంస్థ అయిన లీగల్ ఎంటిటి ఐడెంటిఫైయర్ ఇండియా లిమిటెడ్ (LEIIL) నుండి, ఇండియా లో LEI కోడ్ ను పొందవచ్చు. లీగల్ ఎంటిటి ఐడెంటిఫైయర్ ఇండియా లిమిటెడ్ (LEIIL), LEI కోడ్ జారీ మరియు నిర్వహణ కోసం భారతదేశంలో స్థానిక ఆపరేటింగ్ యూనిట్ (LOU) గా GLEIF చే గుర్తింపు పొందింది. 4. నియమాలు, ప్రక్రియ మరియు దస్తావేజుల అవసరాలను, LEIL (https://www.ccilindia-lei.co.in/USR_FAQ_DOCS.aspx) నుండి నిర్ధారించుకోవచ్చు. 5. LEI కోడ్ లు పొందిన తరువాత, GLEIF మార్గదర్శకాల ప్రకారం అవి పునరుద్ధరించ బడేలా సంస్థలు నిర్ధారించుకోవాలి. ట్రేడ్ రిపోజిటరీ (TR) రిపోర్టింగ్ కోసం కాల పరిమితి దాటిన LEI లు చెల్లుబాటు కావు. 6. ఆర్.బి.ఐ చట్టం, 1934 సెక్షన్ 45 (W) క్రింద ఈ ఆదేశాలు జారీ చేయబడ్డాయి. మీ విధేయులు, (టి. రబి శంకర్) LEI కోడ్ అమలుపరచడం లో వివిధ సంస్థలు పాటించవలసిన షెడ్యూల్
|