<font face="mangal" size="3px">రూపాయి చిహ్నం “ <span style="font-family:Arial;">₹</span> ” తో, “L” అక్షరం అంతర్గ - ఆర్బిఐ - Reserve Bank of India
రూపాయి చిహ్నం “ ₹ ” తో, “L” అక్షరం అంతర్గతంగా ఉండి, నంబర్ ప్యానెల్ లో అంకెల పరిమాణం ఎడమనుంచి కుడికి పెరుగుతూ ఉండేట్లు అచ్చువేసిన, ₹ 1000 బ్యాంక్ నోట్ల జా
ఆగస్టు 21, 2015 రూపాయి చిహ్నం “ ₹ ” తో, ‘L’ అక్షరం అంతర్గతంగా ఉండి, నంబర్ ప్యానెల్ లో అంకెల పరిమాణం ఎడమనుంచి కుడికి పెరుగుతూ ఉండేట్లు అచ్చువేసిన, ₹ 1000 బ్యాంక్ నోట్ల జారీ. భారతీయ రిజర్వ్ బ్యాంక్ త్వరలో మహాత్మా గాంధి సిరీస్ – 2005 లో, భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ డా. రఘురాం జి. రాజన్ సంతకంతో క్రొత్త ₹ 1000 బ్యాంక్ నోట్లను జారీ చేయనుంది. ఈ నోట్లు, ముందు వెనుక వైపుల " ₹ " చిహ్నం కలిగి, రెండు నంబరు ప్యానెళ్ళలో 'L' అక్షరం పొందుపరచి ఉంటాయి. ముద్రించిన సంవత్సరం '2015', నోటు వెనుకవైపు ముద్రించి ఉంటుంది. ఈ నోట్ల నమూనా అన్నిరకాలుగా, మునుపు జారీ చేసిన మహాత్మా గాంధి సిరీస్ – 2005 నోట్ల లాగే ఉంటుంది. కానీ, రెండు నంబర్ ప్యానెళ్ళ లో అంకెల పరిమాణం, ఎడమనుంచి కుడికి పెరుగుతున్న క్రమంలో ముద్రించి ఉంటాయి. అయితే, ముందుచేర్చిన మొదటి మూడు అక్షర/సంఖ్యలు ఒకే పరిమాణంలో ఉంటాయి. ఇలా నంబర్ ప్యానెళ్ళలో అంకెల పరిమాణం ఎడమ నుంచి కుడికి పెరుగుతున్న క్రమంలో గల ₹ 100, ₹ 500 నోట్లు, ఇంతకు ముందునుండే చలామణిలో ఉన్నాయి. గతంలో జారీచేయబడ్డ అన్ని ₹ 1000 నోట్లు కూడా, చట్టపరంగా చలామణిలో కొనసాగుతాయి. సంగీతా దాస్ పత్రికా ప్రకటన: 2015-2016/466 |