<font face="mangal" size="3px">శ్రీమద్ రాజ్ చంద్ర 150 వ జన్మదిన వార్షికోత్సవ స - ఆర్బిఐ - Reserve Bank of India
శ్రీమద్ రాజ్ చంద్ర 150 వ జన్మదిన వార్షికోత్సవ స్మారక సందర్భంగా ₹ 10 నాణేల జారీ
జూన్ 29, 2017 శ్రీమద్ రాజ్ చంద్ర 150 వ జన్మదిన వార్షికోత్సవ స్మారక సందర్భంగా ₹ 10 నాణేల జారీ భారతీయ రిజర్వ్ బ్యాంక్ త్వరలో భారత ప్రభుత్వ ముద్రణలోని పైన పేర్కొన్న నాణేమును చెలామణిలోకి తీసుకురానున్నది. మాన్యులైన భారత ప్రధాన మంత్రి గారిచే ఈ నాణెము విడుదల చేయబడింది. ఆర్దిక మంత్రిత్వశాఖ, ఆర్దిక వ్యవహారాల విభాగం, న్యూడిల్లీ, జూన్ 23, 2017వ తారీఖున జారీ చేసిన భారత రాజపత్రం – విశేష – భాగం II, సెక్షన్ 3, సబ్-సెక్షన్ (i), G.S.R.641(E) {The Gazette of India – Extraordinary – Part II – Section 3 – Sub-section (i) – G.S.R.641 (E) లో ప్రకటించిన (నోటిఫై) ఈ నాణెం నమూనా (డిజైన్) వివరాలు ఈ క్రింది విధంగా ఉంటాయి: ముందువైపు: ఈ నాణెం ముందు వైపు అశోక స్తంభం లోని సింహ బురుజు (capitol) మధ్యలో ముద్రించబడి ఉంటుంది. దీనిక్రింద "सत्यमेव जयते" (సత్యమేవ జయతే) అని వ్యాఖ్య లిఖించబడి ఉంటుంది. ఎడమ పరిధిలో "भारत" (భారత్) అన్న పదం దేవనాగరి లిపిలో, కుడి పరిధిలో “INDIA” (ఇండియా) అన్న పదం ఇంగ్లీషులో, ముద్రించబడి ఉంటాయి. సింహ బురుజు (capitol) క్రింద రూపాయి చిహ్నం “₹” మరియు నాణెం విలువ “10” అంతర్జాతీయ సంఖ్యలలో కలిగి ఉంటుంది. వెనుకవైపు నాణెం మధ్యలో శ్రీమద్ రాజ్ చంద్ర యొక్క చిత్రం ముద్రించబడి ఉంటుంది. నాణెం పై పరిధి ఎడమవైపున “श्रीमद राजचुंद्र” అన్న పదం మరియు క్రింది పరిధి ఎడమవైపున “150 वी जयंती” అని దేవనాగరి లిపిలో ముద్రించబడి ఉంటుంది. నాణెం పై పరిధి కుడివైపున “SHRIMAD RAJCHANDRA” అని, క్రింది పరిధి కుడివైపున “150th Birth Anniversary” అని లిఖించబడి ఉంటుంది. సంవత్సరం “1867” మరియు “1901” అని అంతర్జాతీయ సంఖ్యలలో, శ్రీమద్ రాజ్ చంద్ర యొక్క చిత్రం ఎడమ మరియు కుడి వైపున లిఖించబడి ఉంటుంది. ఈ నాణెం ‘కాయినేజ్ యాక్ట్ 2011’ (The coinage Act 2011) ప్రకారం, చట్టబద్ధంగా చెలామణీ అవుతుంది. ఈ విలువ (డినామినేషన్) గల ఇప్పుడున్నటువంటి నాణేలు కూడా చట్టబద్ధంగా చెలామణిలో కొనసాగుతాయి. అజిత్ ప్రసాద్ ప్రెస్ రిలీజ్: 2016-2017/3517 |