RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S3

Notification Marquee

आरबीआई की घोषणाएं
आरबीआई की घोषणाएं

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78488345

నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా (National Archives of India)
నూట ఇరవై ఐదవ సంవత్సర సందర్భంగా 10 స్మారక నాణేలు జారీ

ఏప్రిల్ 26, 2017

నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా (National Archives of India)
నూట ఇరవై ఐదవ సంవత్సర సందర్భంగా 10 స్మారక నాణేలు జారీ

భారత ప్రభుత్వం పైన తెలిపిన నాణేలు ముద్రించింది. వీటిని భారతీయ రిజర్వ్ బ్యాంక్, త్వరలో చెలామణిలోకి తేనున్నది.

వీటి నమూనా వివరాలు, ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆర్థిక వ్యవహారాల విభాగం, న్యూ దిల్లీ, ఫిబ్రవరి 26, 2016 తేదీన జారీ చేసిన భారతీయ గెజట్ - విశేష - భాగం II - సెక్షన్‌ 3 - సబ్ సెక్షన్‌ (i) -G.S.R. 197 (E) {The Gazette of India -Extraordinary - Part II-Section 3 – Sub-section (i) - G.S.R. 197 (E)} లో తెలిపినట్లు, ఈ క్రింది విధంగా ఉంటాయి-

ముందువైపు: నాణెం ముందువైపు మధ్యలో, అశోక స్తూపంలోని సింహ శీర్షం కలిగి ఉంటుంది. దాని క్రింద “सत्यमेव जयते” (సత్యమేవ జయతే) అని చెక్కి ఉంటుంది. ఎడమ అంచున "भारत" (భారత్) అని దేవనాగరి లిపిలో, కుడి అంచున "INDIA" అని ఇంగ్లీష్‌లో, వ్రాసి ఉంటాయి. సింహ శీర్షంక్రింద, రూపాయి చిహ్నంతో () బాటు విలువ "10" అని అంతర్జాతీయ సంఖ్యలలో కలిగి ఉంటుంది.

వెనుక వైపు: నేషనల్ ఆర్కైవ్స్ భవనం (National Archives Building) చిత్రం చెక్కి ఉంటుంది. చిత్రం క్రింద "125 वर्ष /125 YEARS” అని చెక్కి ఉంటుంది. నేషనల్ ఆర్కైవ్స్ భవనం చిత్రం పైన, మధ్యభాగంలో, 125 వ వార్షికోత్సవాల గుర్తింపు చిహ్నం (Logo) కలిగి ఉంటుంది. నాణెం పై అంచున "राष्ट्रीय अभिलेखागार" అని దేవనాగరిలో, క్రింది అంచున "NATIONAL ARCHIVES OF INDIA” అని ఇంగ్లీష్‌లో లిఖించబడి ఉంటుంది. సంవత్సరం "1891" మరియు "2016" అని పైన, క్రింద అంచులలో, ఇంగ్లీష్ అంకెలలో వ్రాసి ఉంటుంది. సంవత్సరం" 1916" మరియు "2016" అని అంతర్జాతీయ సంఖ్యలలో, చిత్రం పై భాగంలో, ఎడమ, కుడి ప్రక్కల వ్రాసి ఉంటుంది.

కాయినేజ్ చట్టం 2011 ప్రకారం, ఈనాణేలు చట్టబద్ధంగా చెలామణి అవుతాయి. ఇదే విలువగల ప్రస్తుత నాణేలు కూడా చట్టబద్ధంగా చెలామణిలో కొనసాగుతాయి.

అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ అడ్వైజర్

పత్రికా ప్రకటన: 2016-2017/2908

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?