<font face="mangal" size="3">శ్రీమాతా వైష్ణోదేవి పుణ్యక్షేత్రం రజతోత్స - ఆర్బిఐ - Reserve Bank of India
శ్రీమాతా వైష్ణోదేవి పుణ్యక్షేత్రం రజతోత్సవం స్మారక సందర్భంగా ₹ 10 నాణేలు జారీ
ఆగష్టు 29, 2013 శ్రీమాతా వైష్ణోదేవి పుణ్యక్షేత్రం రజతోత్సవం స్మారక సందర్భంగా ₹ 10 నాణేలు జారీ భారత ప్రభుత్వo చే ముద్రింపబడి పైన పేర్కొనబడిన నాణేలను, భారతీయ రిజర్వ్ బ్యాంక్ త్వరలో చెలామణిలోకి తీసుకురానున్నది. ఈ నాణెల నమూనా (డిజైన్), ఆకృతి, మొదలైన వివరాలు ఆర్దిక మంత్రిత్వశాఖ, ఆర్దిక వ్యవహారాల విభాగం, భారత ప్రభుత్వం చే ప్రచురించబడిన ఈ క్రింది పేర్కొనబడిన భారత రాజపత్రం లో సెప్టెంబర్ 14, 2012 వ తారీఖున ప్రకటించ (నోటిఫై) బడినవి:- భారత రాజపత్రం – విశేష – భాగం II, సెక్షన్ 3, సబ్-సెక్షన్ (i) – జారీ నం.458 (అనుబంధించబడింది) {The Gazette of India – Extraordinary – Part II – Section 3 – Sub-section (i) Issue No.458 (annexed)} ఈ నాణెలు ‘కాయినేజ్ యాక్ట్ 2011’ (The Coinage Act 2011) ప్రకారం, చట్టబద్ధంగా చెలామణీ అవుతాయి. ఈ విలువ (డినామినేషన్) గల ఇప్పుడున్న నాణేలు కూడా చట్టబద్ధంగా చెలామణిలో కొనసాగుతాయి. అజిత్ ప్రసాద్ ప్రెస్ రిలీజ్: 2013-2014/442 |