<font face="mangal" size="3">అలహాబాద్ ఉన్నత న్యాయస్థానం 150 వ వార్షికోత్సవ<br - ఆర్బిఐ - Reserve Bank of India
అలహాబాద్ ఉన్నత న్యాయస్థానం 150 వ వార్షికోత్సవ
స్మారకార్థం ₹ 5 నాణేలు జారీ
ఏప్రిల్ 26, 2017 అలహాబాద్ ఉన్నత న్యాయస్థానం 150 వ వార్షికోత్సవ భారత ప్రభుత్వం పైన తెలిపిన నాణేలు ముద్రించింది. వీటిని భారతీయ రిజర్వ్ బ్యాంక్, త్వరలో చెలామణిలోకి తేనున్నది. వీటి నమూనా వివరాలు, ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆర్థిక వ్యవహారాల విభాగం, న్యూ దిల్లీ, ఫిబ్రవరి 23, 2016 తేదీన జారీ చేసిన భారతీయ గెజట్ - విశేష - భాగం II - సెక్షన్ 3 - సబ్ సెక్షన్ (i) -G.S.R. 191 (E) {The Gazette of India -Extraordinary - Part II-Section 3 – Sub-section (i) - G.S.R. 191 (E)} లో తెలిపినట్లు, ఈ క్రింది విధంగా ఉంటాయి- ముందువైపు: నాణెం ముందువైపు మధ్యలో, అశోక స్తూపం లోని సింహ శీర్షం కలిగి ఉంటుంది. దాని క్రింద “सत्यमेव जयते” (సత్యమేవ జయతే) అని చెక్కి ఉంటుంది. ఎడమ అంచున "भारत" (భారత్) అని దేవనాగరి లిపిలో, కుడి అంచున "INDIA" అని ఇంగ్లీష్‌లో, వ్రాసి ఉంటాయి. సింహ శీర్షంక్రింద, రూపాయి చిహ్నంతో (₹) బాటు విలువ "5" అంతర్జాతీయ సంఖ్యలలో కలిగి ఉంటుంది. వెనుక వైపు: అలహాబాద్ ఉన్నత న్యాయస్థాన భవనం ముందువైపు మధ్యభాగం, పుస్తకం నుండి వెలికి వస్తున్న చిత్రం చెక్కి ఉంటుంది. నాణెం పై అంచున “इलाहाबाद उच्च न्यायालय का 150 वां वार्षिकोत्सव (అలహాబాద్ ఉన్నత న్యాయస్థానం 150 వ వార్షికోత్సవం) అని దేవనాగరిలో, క్రింది అంచున "150th Anniversary of Allahabad High Court” అని లిఖించబడి ఉంటుంది. చిత్రం క్రింద "1866-2016" అని ఇంగ్లీష్ అంకెలలో వ్రాసి ఉంటుంది. కాయినేజ్ చట్టం 2011 ప్రకారం, ఈనాణేలు చట్టబద్ధంగా చెలామణి అవుతాయి. ఇదే విలువగల ప్రస్తుత నాణేలు కూడా చట్టబద్ధంగా చెలామణిలో కొనసాగుతాయి. అజిత్ ప్రసాద్ పత్రికా ప్రకటన: 2016-2017/2903 |