<font face="mangal" size="3">సమగ్ర పరపతి నివేదికల జారీ</font> - ఆర్బిఐ - Reserve Bank of India
సమగ్ర పరపతి నివేదికల జారీ
RBI/2017-18/35 తేదీ: ఆగస్ట్ 2, 2017 అన్ని పరపతి సమాచార సంస్థలు (CICs) అయ్యా/అమ్మా, సమగ్ర పరపతి నివేదికల జారీ పలు రుణాలు గల ఖాతాదారు యొక్క అన్ని ఖాతాల (ప్రస్తుత, గత) వివరాలూ పరపతి నివేదికలో (Credit Information Report) చేర్చాలని సూచించిన మా సర్క్యులర్ DBOD.No.CID.BC.127/20.16.056/2013-14 తేదీ జూన్ 27, 2014 [పేరా (v) అనుబంధం IV], దయచేసి చూడండి. 2. అయితే, కొన్ని CICలు, రుణ సంస్థలకు (Credit Institutions, CIs) నియమిత సమాచారంమాత్రమే (కమర్షియల్, కన్స్యూమర్ లేక MIF వివరాలుమాత్రమే కలిగిన) కలిగిన నివేదికలు అందిస్తున్నాయని గమనించడం జరిగింది. ఈ నిర్దుష్టమైన నివేదికలకు, CICలు వేర్వేరు రుసుము వసూలు చేస్తున్నారు. 3. నియమిత సమాచారంకలిగిన ఈ నివేదికలవల్ల, రుణ సంస్థలకు ఇతర మాడ్యూల్స్‌లో గల, రుణగ్రహీతయొక్క పూర్తి చరిత్ర తెలియడం లేదు. దీనివల్ల, రుణసంస్థలు తీసికొనే నిర్ణయాలపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు. 4. అందువల్ల, రుణ సంస్థలకు అందించే నివేదికలు, రుణగ్రహీతయొక్క అన్ని మాడ్యూళ్ళలోని (కన్స్యూమర్, కమర్షియల్ మరియు MFI) సమాచారం కలిగి ఉండేలా రూఢిపరచుకోవాలని, పరపతి సమాచార సంస్థలను (CICs) ఆదేశిస్తున్నాము. 5. ఈ ఆదేశాలు, సబ్-సెక్షన్ (1) సెక్షన్ 11, పరపతి సమాచార సంస్థలు (నియంత్రణ) చట్టం, 2005 [Credit Information companies (Regulations) Act, 2005], క్రింద జారీచేయబడ్డాయి. మీ విశ్వాసపాత్రులు, ప్రకాశ్ బలియార్ సింఘ్ |