<font face="mangal" size="3px">హోమీబాబా శతజయంతి సంవత్సర సందర్భంగా క్రొత్ - ఆర్బిఐ - Reserve Bank of India
హోమీబాబా శతజయంతి సంవత్సర సందర్భంగా క్రొత్త ₹ 10 ద్విలోహాత్మక (బై-మెటాలిక్) స్మారక చలామణి నాణేo జారీ
ఫిబ్రవరి 11, 2010 హోమీబాబా శతజయంతి సంవత్సర సందర్భంగా క్రొత్త ₹ 10 ద్విలోహాత్మక (బై-మెటాలిక్) భారత ప్రభుత్వం హోమీబాబా శతజయంతి సంవత్సర సందర్భంగా జారీ చేసిన క్రొత్త ₹ 10 ద్విలోహాత్మక (బై-మెటాలిక్) స్మారక చలామణి నాణేలను, భారతీయ రిజర్వ్ బ్యాంక్ త్వరలో చెలామణిలోకి తీసుకురానున్నది.
నమూనా(డిజైన్) ముందువైపు: నాణెం ఈ వైపున అశోక స్తంభం లోని సింహ బురుజు (capitol) ముద్రించబడి ఉంటుంది. దీనిక్రింద "सत्यमेव जयते" (సత్యమేవ జయతే) అని వ్యాఖ్య చెక్కబడి ఉంటుంది. ఎడమ వైపు పై పరిధి లో "भारत" (భారత్) అన్న పదం హిందీలో మరియు కుడి వైపు పై పరిధి లో “INDIA” (ఇండియా) అన్న పదం ఇంగ్లీషులో, ముద్రించబడి ఉంటాయి. సింహ బురుజు (capitol) క్రింద నాణెం విలువ (డినామినేషన్) “10” అంతర్జాతీయ సంఖ్యలలో కలిగి ఉంటుంది. ఎడమ వైపు క్రింది పరిధిలో “रूपये” అని హిందీలో మరియు కుడి వైపు క్రింది పరిధిలో “RUPEES” అని ఇంగ్లీషులో ముద్రించబడి ఉంటాయి. వెనుకవైపు: నాణెం ఈ వైపున “హోమిబాబా” యొక్క చిత్తరువు తో, ఎడమ పరిధిలో “होमी भाभा जन्म शताब्दी वर्ष” అని హిందీలో మరియు కుడి పరిధిలో “HOMI BHABHA BIRTH CENTENARY YEAR” అని ఇంగ్లీషులో ఉంటుంది. మరియు అడుగు భాగంలో సంవత్సరం “2008-2009” అని హోమిబాబా యొక్క చిత్తరువు క్రింది లిఖించబడి ఉంటుంది. ఈ క్రొత్త పది రూపాయల నాణెం “భారతీయ కాయినేజ్ యాక్ట్ 1906” (Indian Coinage Act 1906) ప్రకారం, చట్టబద్ధంగా చెలామణీ అవుతుంది. అజిత్ ప్రసాద్ ప్రెస్ రిలీజ్: 2009-2010/1115 |