<font face="mangal" size="3">పశుపోషణ, మత్స్య పరిశ్రమల నిర్వహణ మూలధనంకొరĵ - ఆర్బిఐ - Reserve Bank of India
పశుపోషణ, మత్స్య పరిశ్రమల నిర్వహణ మూలధనంకొరకు
(వర్కింగ్ కేపిటల్) కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకం
తేదీ: 04/02/2019 పశుపోషణ, మత్స్య పరిశ్రమల నిర్వహణ మూలధనంకొరకు బ్యాంకింగ్ రంగంనుండి, అవసర సమయంలో సులభమైన, సరళమైన రీతిలో, స్వల్పకాలిక పంట రుణాలు అందించడం, కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకంయొక్క ఉద్దేశం. పశుపోషణ, మత్స్య పరిశ్రమ వ్యవసాయదారులకు కూడా ఈ ప్రయోజనం అందించడంకోసం, కిసాన్ క్రెడిట్ కార్డ్ సౌకర్యం కల్పించాలన్న నిర్ణయాన్ని, భారత ప్రభుత్వం 2018-19 బడ్జెట్‌లో ప్రకటించింది. ఈ విషయాన్ని, ఇందులో పాలుపంచుకొనేవారందరితో చర్చించి, పశుపోషణ, మత్స్య పరిశ్రమలలో ఉన్న వ్యవసాయదారులందరికీ వారి నిర్వహణ మూలధనం కొరకు, కిసాన్ క్రెడిట్ కార్డ్ సౌకర్యం పొడిగించాలని నిర్ణయించబడింది. అనిరుద్ధ డి జాధవ్ పత్రికా ప్రకటన: 2018-2019/1839 |