<font face="mangal" size="3">లావాదేవీల నివేదికలో జాప్యానికి అపరాధ వడ్డీ - ఆర్బిఐ - Reserve Bank of India
లావాదేవీల నివేదికలో జాప్యానికి అపరాధ వడ్డీ విధింపు
ఆర్.బి.ఐ/2017-18/130 ఫిబ్రవరి 9, 2018 1 అధ్యక్షుడు మరియు నిర్వాహక సంచాలకుడు/ముఖ్య కార్య నిర్వహణ అధికారి మేడం / డియర్ సర్, లావాదేవీల నివేదికలో జాప్యానికి అపరాధ వడ్డీ విధింపు దయచేసి అక్టోబర్ 12, 2017 తేదీ నాటి మా మాస్టర్ డైరెక్షన్ DCM (CC) No.G-2/03.35.01/2017-18 ను చూడండి. 2. లావాదేవీలను తప్పుగా/ఆలస్యంగా నివేదించినప్పుడు లేదా నివేదించనందున ఆర్బిఐ వద్దనున్న వాడుక ఖాతాలో "అనర్హమైన" నిల్వని అనగా నికర డిపాజిట్ ను బ్యాంకు వాడుకున్న అన్ని సందర్భాల్లో, ప్రస్తుతము కరెన్సీ చెస్ట్ ఫై జరిమానా విధించబడుతోంది. అయినప్పటికీ కరెన్సీ చెస్ట్ లో "నికర డిపాజిట్" ఉండి, అంటే ఆర్బిఐ వద్దనున్న నిధులను వాడుకోక, ఆలస్యముగా నివేదించిన సంధర్భాలలో, స్పష్టమైన సూచనలు లేనందున, జారీ కార్యాలయాలు భిన్నంగా వ్యవహరిస్తున్నాయి. 3. సమీక్ష అనంతరం, "నికర డిపాజిట్" ఆలస్యంగా నివేదించిన సందర్భాల్లో ప్రస్తుత రేటుపై అపరాధ వడ్డీ, కరెన్సీ చెస్ట్ ఫై వసూలు చేయరాదని నిర్ణయించడం జరిగింది. అయితే, కరెన్సీ చెస్ట్ లావాదేవీలను నివేదించడంలో సరైన క్రమశిక్షణ కొరకై, ఆర్బీఐకి పాత నోట్ల రెమిట్టన్స్ పై తప్పుడు నివేదిక సమర్పించినప్పుడు / రెమిట్టన్స్ దారి మళ్ళిoపులను బదలాయింపులుగా చూపించిన సందర్భంలో విధించే అపరాధ వడ్డీ వలే, లావాదేవీల నివేదిక లోని జాప్యానికి గాను ఏక మొత్తంగా 50,000/- రూపాయల చొప్పున జరిమానా విధించబడుతుంది. (మాస్టర్ డైరెక్షన్ యొక్క 1.5 వ పేరా). 4. పై మాస్టర్ డైరెక్షన్ లో ఉన్న ఇతర సూచనలు మారవు. 5. సవరింపబడిన సూచనలు, సర్కులర్ తేది నుండి లేదా ఆ తేదీ తరువాత కనుగొనబడిన సందర్భాలకు వర్తిస్తాయి. మీ విధేయులు, (అజయ్ మిచ్యారి) |